STOCKS

News


భారీగా ఇన్వెస్ట్‌ చేస్తున్నా.. నాలుగు, ఐదు ఫండ్స్‌ సరిపోతాయా

Monday 22nd April 2019
personal-finance_main1555915751.png-25260

ప్ర: ఈ ఏడాదే నేను రిటైర్‌ కాబోతున్నాను. రిటై‍ర్మెంట్‌ బెనిఫిట్స్‌ కింద రూ.50 లక్షల వరకూ వస్తాయి. దీంతో రూ.15 లక్షల మొత్తాన్ని సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌(ఎస్‌సీఎస్‌ఎస్‌) కింద ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. మరో రూ.9 లక్షలను పోస్ట్‌ ఆఫీస్‌ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తాను. మిగిలిన మొత్తాన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. ఇది సరైన నిర్ణయమేనా ?
అశోక్‌, విజయవాడ
 
జ: ఈ వివరాలు ఆధారంగా మీ ఆర్థిక అవసరాలు వెల్లడి కావడం లేదు. అంటే మీకు నెలవారీ ఎంత ఖర్చవుతుంది ? తీర్చాల్సిన రుణలేమైనా ఉన్నాయా ? ఇత్యాది అంశాలను పరిగణనలోకి తీసుకొని రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ని ఇన్వెస్ట్‌ చేయాలి. మీరు ఇచ్చిన వివరాలను పరిశీలించి.. మీ రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌లో సగం వరకూ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడమనేది  సరైన వ్యూహమో, కాదో చెప్పలేము. అయితే రూ.15 లక్షల మొత్తాన్ని సీనియర్‌ సిటిజన్‌ సేవిం‍గ్స్‌ స్కీమ్‌లోనూ, మరో రూ.9 లక్షల మొత్తాన్ని పోస్ట్‌ ఆఫీస్‌ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌ చేయడం..సురక్షిత వ్యూహమేనని చెప్పవచ్చు.  ఈ స్కీమ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయడం అంటే మీరు భారత ప్రభుత్వానికి అప్పు ఇచ్చినట్లే లెక్క. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఎలాంటి ఢోకా  ఉండదు. ఇక మిగిలిన మొత్తాన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలన్న మీ ఆలోచన కూడా కొంత వరకూ సరైనదే. అయితే మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు మీరు రెండు ముఖ్యమైన విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. మొదటిది. మీకు గతంలో మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసిన అనుభవం లేకపోతే ముందుగా బ్యాలన్స్‌డ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయండి. ఒక ఏడాది పాటు ఇన్వెస్ట్‌ చేసిన తర్వాత మ్యూచువల్‌ ఫం‍డ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌  విషయమై మీకు తగిన అవగాహన వస్తుంది. అప్పుడు ఈక్విటీ, ఇతర మ్యూచువల్‌ ఫం‍డ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. ఇక రెండో విషయం.  మీరు పెద్ద మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేయనున్నారు కాబట్టి, ఇంత పెద్ద మొత్తాన్ని ఒకేసారి ఈక్విటీ, ఇతర ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయకూడదు. ముందుగా ఈ మొత్తాన్ని ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయండి. ఈ ఫండ్‌ నుంచి 18-20 నెలల కాలంలో ఈ మొత్తాన్ని కొన్ని ఎంపిక చేసిన ఈక్విటీ ఫండ్స్‌ల్లో సిస్టమేటిక్‌ ట్రాన్స్‌ఫర్‌ ప్లాన్‌(ఎస్‌టీపీ) ద్వారా బదిలీ చేయండి. 

ప్ర: ఒక ఇన్వెస్టర్‌ పోర్ట్‌ఫోలియోలో నాలుగు లేదా ఐదు ఫండ్స్‌ ఉంటే చాలు అని మీరు గతంలో చెప్పారు కదా ! అయితే నెలకు రూ.55,000-60,000 రేంజ్‌లో మ్యూచువల్‌ ఫం‍డ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయాలనుకున్నప్పుడు.. అంటే పెద్ద మొత్తంలో మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకున్నప్పుడు కూడా ఈ సూచన వర్తిస్తుందా ? 
-సుకన్య, హైదరాబాద్‌ 
జ: పెద్ద మొత్తంలో మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోల్లో కూడా నాలుగు, ఐదు ఫం‍డ్స్‌ ఉంటే డైవర్సిఫికేషన్‌ ప్రయోజనాలు పొందవచ్చు. పోర్ట్‌ఫోలియోలో ఫండ్స్‌ ఎక్కువగా ఉంటే గందరగోళం కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు అధికంగా ఉంటాయి. పోర్ట్‌ఫోలియోలో ఫండ్స్‌ అధికంగా ఉంటే డూప్లికేషన్‌ కూడా అధికంగా ఉండొచ్చు. అంటే ఫండ్స్‌ పోర్ట్‌ఫోలియోల్లో ఉండే కంపెనీల షేర్లు ఒకే విధంగా ఉండవచ్చు. ఇలా ఉంటే డైవర్సిఫికేషన్‌ ప్రయోజనాలు పెద్దగా లభించవు. పోర్ట్‌ఫోలియోల్లో పది కంటే అధికంగా ఫండ్స్‌ ఉంటే దాదాపు సగం ఫండ్స్‌ ఫోర్ట్‌ఫోలియోలు దాదాపు ఒకే విధంగా ఉండవచ్చు. పైగా ఫండ్స్‌ అధికంగా ఉంటే మీరు ఫండ్స్‌ నిర్వహణ వ్యయాలు కూడా అధికంగానే చెల్లించాల్సి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, మీరు పెద్ద మొత్తాల్లో ఇన్వెస్ట్‌ చేస్తున్నప్పుడు కూడా... మీ పోర్ట్‌ఫోలియోలో మూడు, నాలుగుకు మించి ఫండ్స్‌ ఉండకుండా ఉంటే మంచిది. అంతే కాకుండా మీరు ఇన్వెస్ట్‌ చేయాలనుకున్న మొత్తంలో నాలుగో వంతుకు మించి అధికంగా ఏ ఫండ్‌లోనూ ఇన్వెస్ట్‌ చేయకండి. 

ప్ర: నేను రెండేళ్ల నుంచి మిడ్‌-క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. సంతృప్తికరమైన రాబడులే వస్తున్నాయి. అయితే ఈ ఏడాది మిడ్‌-క్యాప్‌ ఫండ్స్‌ పనితీరు ఎలా ఉండనున్నది ? 
-జావేద్‌, విశాఖపట్టణం 

జ: ఈ ఏడాది మిడ్‌-క్యాప్‌ ఫండ్స్‌ ఎలా ఉంటాయోనన్న విషయమై ప్రస్తుతానికైతే ఎలాంటి అంచనాలు లేవు. అయితే రానున్న మూడు నుంచి నాలుగేళ్ల కాలానికి లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌తో పోల్చితే మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ చెప్పుకోదగ్గ స్థాయిలో రాబడులను ఇస్తాయని గట్టిగా చెప్పగలను. మల్టీ క్యాప్‌ ఫండ్స్‌ రాబడుల కంటే కూడా మిడ్‌ క్యాప్‌ ఫం‍డ్స్‌ రాబడులు అధికంగా ఉంటాయనే చెప్పవచ్చు. ఇక ఈ ఏడాదిని పరిగణనలోకి తీసుకుంటే, వీటి పనితీరు అంతంతమాత్రంగానే ఉండొచ్చు. ఇప్పటికే ఈ ఫండ్స్‌ వేల్యూయేషన్లు అధికంగా ఉండటంతో, కొంత కరెక్షన్‌ చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. మిడ్‌-క్యాప్‌ ఫండ్స్‌కు ఇటీవల కాలంలో మంచి ప్రాచుర్యం లభించడంతో ఈ ఫండ్స్‌ల్లో ఇన్వెస్టర్లు ఇబ్బడి ముబ్బడిగా ఇన్వెస్ట్‌ చేశారు. దీంతో ఈ ఫండ్స్‌ నిధులు బాగా పెరిగిపోయాయి. ఇలా నిధులు భారీగా పెరిగిపోయినప్పుడు, మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌ తగిన రాబడులను ఇవ్వలేవు. ఈ ఫండ్స్‌ పనితీరులో ఒడిదుడుకులు చోటు చేసుకోవచ్చు. అయినప్పటికీ,  ఏడాది లేదా  ఏడాదిన్నర కాలం నుంచి మిడ్‌ క్యాప్‌ ఫం‍డ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్న ఇన్వెస్టర్లు...ఈ ఒడిదుడుకులను పట్టించుకోకుండా  తమ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించవచ్చు. మూడు నుంచి ఐదేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌ మంచి పనితీరును ఇవ్వగలవని చెప్పవచ్చు. మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేస్తే, మంచి రాబడులు పొందవచ్చు. 



You may be interested

భారత్‌ పన్నుల రాజేమీ కాదు

Monday 22nd April 2019

కొన్ని రంగాలను కాపాడుకునే హక్కు ఉంది నిపుణుల అభిప్రాయాలు న్యూఢిల్లీ: భారత్‌ టారిఫ్‌ల విషయంలో కింగ్‌ (రాజు) ఏమీ కాదని, వ్యవసాయం వంటి కీలకమైన రంగాల ప్రయోజనాలను కాపాడుకునే హక్కు ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. భారత్‌ దిగుముల సుంకాలు ప్రపంచంలోనే ఎక్కువగా ఉన్నాయన్న అమెరికా ఆరోపణలను తోసిపుచ్చుతూ... అభివృద్ధి చెందిన జపాన్‌, దక్షిణ కొరియా, ఈయూ, అమెరికా సైతం అధిక టారిఫ్‌లను వ్యవసాయ ఉత్పత్తులపై కొనసాగిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. భారత్‌ తమ

తక్షణ మద్దతు శ్రేణి 39,040-38,975 పాయింట్లు

Monday 22nd April 2019

ఎట్టకేలకు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గతవారం డబుల్‌టాప్‌ను అధిగమించి, భారత్‌ మార్కెట్‌ దీర్ఘకాలిక అప్‌ట్రెండ్‌ ఇంకా కొనసాగుతుందని రుజువుచేసింది. అంటే..సమీప భవిష్యత్తులో వివిధ అంశాల కారణంగా మార్కెట్‌ ఒడుదుడుకులకు లోనైనా, రానున్న నెలల్లో మరిన్ని ఉన్నత శిఖరాలను భారత్‌ సూచీలు చేరతాయనే విశ్వాసాన్ని ఇన్వెస్టర్లకు గతవారం ట్రెండ్‌ కల్పించింది. కార్పొరేట​ దిగ్గజం రిలయన​‍్స ఇండస్ట్రీస​...శుక్రవారం మార్కెట్‌​ ముగిసిన తర్వాత వెల్లడించిన ఫలితాలపై  షేరు స్పందన సోమవారం తెలుస్తుంది. మరిన్ని కీలక కంపెనీల

Most from this category