News


మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌పై చిగురించిన ఆశలు

Thursday 13th June 2019
personal-finance_main1560364633.png-26258

మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తులు మే నెలలో క్రితం నెలతో పోలిస్తే రూ.16,000 కోట్లు పెరిగి రూ.25.43 లక్షల కోట్లకు చేరాయి. లిక్విడ్‌ ఫండ్స్‌లోకి ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు వచ్చాయి. ముఖ్యంగా ఈక్విటీ ఫండ్స్‌లోకీ రూ.5,407 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి. ఏప్రిల్‌ నెలలో ఈక్విటీ ఫండ్స్‌లోకి వచ్చిన రూ.4,609 కోట్లతో పోలిస్తే పెరిగాయి. ప్రధానంగా ఈక్విటీ ఫండ్స్‌లోకి మే నెలలో వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో సగం మేర రూ.2,689 కోట్లు మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ పథకాల్లోకి వచ్చినవే. 

 

‘‘గడిచిన ఏడాది కాలంలో భారీ కరెక్షన్‌ అనంతరం ఇన్వెస్టర్లు మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లో ఎంతో విలువ దాగుందని భావిస్తున్నారు’’అని యూనియన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సీఈవో జి.ప్రదీప్‌కుమార్‌ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండడంతోపాటు కంపెనీల ఫలితాలు మెరుగుపడతాయన్న అంచనాల నేపథ్యంలో రిటైల్‌ ఇన్వెస్టర్లు వచ్చే ఏడాది కాలంలో సిప్‌ మార్గం ద్వారా తమ పెట్టుబడులను పెంచుకోవచ్చని సూచించారు. కాగా, ఇన్వెస్టర్లలో సిప్‌ పట్ల నమ్మకం మే నెలలోనూ కొనసాగింది. మే నెలలో సిప్‌ ద్వారా వచ్చిన పెట్టుబడులు రూ.8,183కోట్లు. ఏప్రిల్‌ నెలలో వచ్చిన సిప్‌ పెట్టుబడులు రూ.8,237 కోట్లతో పోలిస్తే కాస్త తగ్గాయి. అయితే, సిప్‌ పెట్టుబడుల్లో 90 శాతం ఈక్విటీ పథకాల్లోకి వెళ్లినవే. 

 

డెట్‌ విభాగంలో... కార్పొరేట్లు రూ.68,582 కోట్లను లిక్విడ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేశారు. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ డిఫాల్ట్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, అడాగ్‌ గ్రూపు కంపెనీల్లో సమస్యలతో క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్స్‌ నుంచి రూ.4,155 కోట్ల పెట్టుబడులను ఇన్వెస్టర్లు వెనక్కి తీసేసుకున్నారు. బ్యాంకింగ్‌ అండ్‌ పీఎస్‌యూ డెట్‌ ఫండ్‌ విభాగంలోకి రూ.3,381 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ విభాగంలోని పథకాలు బ్యాంకుల సర్టిఫికేట్స్‌ ఆఫ్‌ డిపాజిట్లు లేదా బాండ్లలో ఇన్వెస్ట్‌ చేస్తాయి. ‘‘డెట్‌ మార్కెట్లో ఫిక్స్‌డ్‌ ఇనకమ్‌ సెక్యూరిటీలకు సంబంధించి ప్రతికూల వార్తలు రావడంతో క్రెడిట్‌ రిస్క్‌, మీడియం డురేషన్‌ ఫండ్స్‌ల్లో పెట్టుబడుల రాకపై వాటి ప్రభావం పడింది’’ అని షేర్‌ఖాన్‌ (బీఎన్‌పీ పారిబాస్‌)కు చెందిన గౌతమ్‌ ఖాలియా తెలిపారు.
 



You may be interested

11900 దిగువన ప్రారంభమైన నిఫ్టీ

Thursday 13th June 2019

క్రితం నష్టాల ముగింపునకు కొనసాగింపుగా మార్కెట్‌  గురువారం కూడా నష్టాలతోనే మొదలైంది. నిఫ్టీ 32 పాయింట్ల నష్టంతో 11900 స్థాయి దిగువన 11,874ల వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 77 పాయింట్లను కోల్పోయి 39,679 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాలు, ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి ఫ్లాట్‌ ప్రారంభం, దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడుల తరలింపు తదితర అంశాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి.

ఏ రంగం ఆకర్షణీయం..?

Thursday 13th June 2019

ఎన్నికల అంకం పూర్తయ్యి మునుపటి ప్రభుత్వమే మరింత బలంగా కేంద్రంలో కొలువుదీరింది. దీంతో స్టాక్‌ మార్కెట్లు కొత్త శిఖరాలను తాకి, ఆ తర్వాత కన్సాలిడేషన్‌లోకి వెళ్లినట్టు కనిపిస్తున్నాయి. కొన్ని రంగాలు ఖరీదైన వ్యాల్యూషన్లకు చేరగా, కొన్ని ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నిపుణుల అభిప్రాయాల ఆధారంగా రంగాలవారీ విశ్లేషణ ఇలా ఉంది.    ఆటోమొబైల్‌ ఆటోమొబైల్‌ రంగం ప్రస్తుతం 18.1 పీఈ వద్ద ట్రేడవుతోంది. చారిత్రక సగటు పీఈ 16.9 కంటే 7 శాతం

Most from this category