STOCKS

News


ర్యాలీలో మ్యూచువల్‌ ఫండ్స్‌ ఏం చేశాయి?

Friday 19th April 2019
Markets_main1555697563.png-25235

మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు (ఏఎంసీలు) ఫిబ్రవరి నుంచి మొదలైన ర్యాలీలో ప్రభుత్వరంగ బ్యాంకులు, స్పెషాలిటీ కెమికల్స్‌, కార్బన్‌ బ్లాక్‌ కంపెనీలు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు, ఫార్మా కంపెనీల్లో వాటాలను తగ్గించుకున్నాయి. అదే సమయంలో కన్జ్యూమర్‌ ఆధారిత వ్యాపార కంపెనీలైన ఎఫ్‌ఎంసీజీ, హాస్పిటాలిటీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం గమనార్హం. దేశీయ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు విద్యుత్‌ తయారీ సంస్థలు, బ్యాటరీ కంపెనీల్లోనూ ఇన్వెస్ట్‌ చేశాయి. 

 

మార్చి త్రైమాసికంలో మొత్తం మీద ఈక్విటీల్లో మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల పెట్టుబడుల రాక తగ్గింది. ఎందుకంటే ఫండ్‌ మేనేజర్లు జనవరిలో రూ.7,161 కోట్ల మేర ఇన్వెస్ట్‌ చేయగా, ఫిబ్రవరిలో 2,174 కోట్లు పెట్టుబడులు పెట్టాయి. కానీ, మార్చి నెలలో ఏకంగా రూ.7,665 కోట్ల మేర అమ్మకాలు జరిపాయి. ఫిబ్రవరిలో రూ.5,122 కోట్లు, మార్చిలో రూ.11,756 కోట్ల మేర ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల్లో ఇన్వెస్టర్ల నుంచి నిధులు వచ్చినప్పటికీ ఫండ్స్‌ మేనేజర్లు, అమ్మకాలు చేయడం ద్వారా ఎన్నికల ముందు కాస్త అప్రమత్త ధోరణితో వ్యవహరించినట్టు తెలుస్తోంది. అయితే, ఫండ్స్‌ కొనుగోళ్లు కొసాగుతాయని మార్కెట్‌ పరిశీలకులు పేర్కొంటున్నారు. 

 

మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు మార్చి క్వార్టర్లో హాత్‌వే కేబుల్‌ అండ్‌ డేటాకామ్‌లో వాటాలు తగ్గించుకున్నాయి. డిసెంబర్‌ త్రైమాసికం నాటికి 6.3 శాతం వాటాలు ఫండ్స్‌ చేతుల్లో ఉంటే, మార్చి క్వార్టర్‌కు కేవలం 0.01 శాతానికి వచ్చేసింది. అంటే దాదాపు పూర్తిగా అమ్మేసినట్టు తెలుస్తోంది. జీఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో 4.2 శాతం, ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో 2.2 శాతం, పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో 1 శాతం మేర వాటాలను డిసెంబర్‌ త్రైమాసికం తర్వాత తగ్గించుకున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లను కూడా అమ్మడం గమనార్హం. యూనియన్‌ బ్యాంకులో 2.5 శాతం, ఓబీసీలో 1.6 శాతం, పీఎన్‌బీలో 1.6 శాతం, సిండికేట్‌ బ్యాంకులో ఒక శాతం మేర వాటాలను అమ్మేశాయి. ఇంకా నోసిల్‌, క్లారియంట్‌ కెమికల్స్‌, బోడల్‌ కెమికల్స్‌, ఓరియంట్‌ కార్బన్‌ అండ్‌ కెమికల్స్‌, ఫిలిప్స్‌ కార్బన్‌ బ్లాక్‌ కంపెనీల్లోనూ వాటాలు తగ్గించుకున్నాయి. అలాగే, యూపీఎల్‌, జీఎస్‌ఎఫ్‌సీ, అరబిందో ఫార్మా, సొలారా యాక్టివ్‌ ఫార్మా, టోరెంట్‌ ఫార్మా, ఏసీసీ, అంబుజా సిమెంట్స్‌లోనూ అమ్మకాలు జరిపాయి. ‘‘గత ఏడాదిగా మార్కెట్‌ సంక్షోభం నేపథ్యంలో ఫండ్స్‌ లిక్విడిటీ కోసం వేచి చూస్తున్నాయి. మార్కెట్లు తగిన స్థాయిలకు చేరుకోవడంతో పోర్ట్‌ఫోలియోను రీఅలైన్‌ చేస్తున్నాయి. మార్చి ఇందుకు మంచి అవకాశాలను కల్పించింది’’ అని వ్యాల్యూ రీసెర్చ్‌ సంస్థ అధినేత ధీరేంద్ర కుమార్‌ పేర్కొ‍న్నారు. 

 

మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు మార్చి త్రైమాసికంలో కొనుగోళ్ల వివరాలను చూస్తే... ఐనాక్స్‌ లీజర్‌లో 0.4 శాతం వాటాలు పెంచుకుని, పీవీఆర్‌లో 1.7 శాతం తగ్గించుకున్నాయి. షీలాఫోమ్‌లో 7.3 శాతం మేర కొనుగోళ్లు చేశాయి. డిసెంబర్‌ నాటికి మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలకు షీలాఫోమ్‌ కంపెనీలో 9.7 శాతమే వాటాలు ఉంటే, మార్చి క్వార్టర్‌లో ఇది 17 శాతానికి పెరిగింది. ఇమామీలో 5.7 శాతం, రిలాక్సో ఫుట్‌వేర్‌లో 3.9 శాతం, ఎక్సైడ్‌ ఇండస్ట్రీలో 1.4 శాతం, అమరరాజా బ్యాటరీస్‌లో ఒక శాతం చొప్పున వాటాలు పెంచుకున్నాయి. ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ, తాజ్‌జీవీకే హోటల్స్‌, వీ2రిటైల్‌, ట్రెంట్‌, టాటా పవర్‌, టోరెంట్‌ పవర్‌లోనూ కొనుగోళ్లు చేశాయి. అయితే, వెనక్కి తీసేసుకున్న పెట్టుబడులను మళ్లీ త్వరలోనే ఫండ్స్‌ ఇన్వెస్ట్‌ చేస్తాయని, భిన్నమైన స్టాక్స్‌ను ఎంచుకుంటాయని ధీరేంద్ర కుమార్‌ పేర్కొన్నారు. You may be interested

వినోద రాజ్యంలో యాప్‌లే ‘టాప్‌’

Saturday 20th April 2019

 - 2021 నాటికి రూ.35,400 కోట్లకు మార్కెట్‌ - ప్రస్తుతం 30 పైగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు - రూ. 25 నుంచి ప్యాకేజీలు ప్రారంభం - ఈ ఏడాది సినిమాను దాటేయనున్న ఓటీటీ - భారీ పెట్టుబడులతో వస్తున్న సంస్థలు బ్యాండ్‌విడ్త్‌ కోసం బెగ్గింగ్‌ చేసే రోజులు పోయాయిప్పుడు. ఒక వీడియోను డౌన్‌లోడ్‌ చేసుకుంటే డేటా ఖర్చయిపోతుందేమోననే భయాలు కూడా లేవిప్పుడు. అందుకే... పెన్‌డ్రైవ్‌లోకి డౌన్‌లోడ్‌ చేసుకుని దాన్నే అలా చేతులు మార్చుకునే రోజులిప్పుడు లేవు. డౌన్‌లోడ్‌

భారతీ ఎయిర్‌టెల్‌కు రైట్స్‌ ఇష్యూతో బలం!

Friday 19th April 2019

భారతీ ఎయిర్‌టెల్‌ భారీ రైట్స్‌ ఇష్యూ మే 3న ప్రారంభమై 17వ తేదీన ముగియనుంది. రైట్స్‌ ఇష్యూ ద్వారా కంపెనీ మొత్తం మీద రూ.25,000 కోట్లను సమీకరించనుంది. రైట్స్‌ ఇష్యూలో పాల్గొనేందుకు రికార్డ్‌ తేదీగా ఏప్రిల్‌ 24ను కంపెనీ ఖరారు చేసింది. ఈ తేదీ నాటికి వాటాదారులుగా ఉన్న వారికే రైట్స్‌ ఇష్యూలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఈ ఇష్యూ కంపెనీకి లాభించే అంశంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.    రైట్స్‌ ఇష్యూ ద్వారా

Most from this category