News


ఎంఎఫ్‌ నిర్వహణ ఆస్తులు 14% అప్‌

Friday 5th October 2018
personal-finance_main1538713578.png-20874

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్ (ఎంఎఫ్‌) పరిశ్రమ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ (ఏయూఎం) విలువ ఆశాజనక వృద్ధిరేటును నమోదుచేసింది. జూలై- సెప్టెంబర్ త్రైమాసికంలో 14 శాతం వృద్ధి చెంది రూ.24 లక్షల కోట్లకు చేరినట్లు అసోసియేష‌న్ ఆఫ్ మ్యూచువ‌ల్ ఫండ్స్ ఇన్ ఇండియా(యాంఫీ) నివేదిక ద్వారా వెల్లడైంది. క్రితం ఏడాది ఇదేకాలంలో దేశీ ఎంఎఫ్‌ల ఏయూఎం రూ.21 లక్షల కోట్లుగా నమోదైంది. ఈ అంశంపై స్పందించిన ఎంఎఫ్‌ పరిశ్రమ వర్గాలు.. రిటైల్ పెట్టుబడిదారుల భాగస్వామ్యం గణనీయంగా పెరగడం వల్లనే ఈ సారి రెండంకెల వృద్ధిరేటు సాధ్యపడిందని పేర్కొన్నాయి. తమ పరిశ్రమ కొనసాగించిన అవగాహన ప్రచారం కారణంగా క్రమబద్ధమైన పెట్టుబడి ప్రణాళికల (సిప్‌) ద్వారా పెట్టుబడులు జోరందుకున్నట్లు వివరించాయి. పరిశ్రమలోని 41 సంస్థలలో 33 ఎంఎఫ్‌లు వృద్ధిరేటును నమోదుచేశాయి. తాజా నివేదిక ప్రకారం సెప్టెంబరు నాటికి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏయూఎం (ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ను మినహాయించి) రూ.3,10,257 కోట్లు కాగా, ఆ తరువాత స్థానంలో ఉన్నటువంటి హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్‌ ఏయూఎం రూ.3,06,360 కోట్లుగా నమోదైంది. రూ.2,54,207 కోట్లతో ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మూడవ స్థానంలోనూ, ఎస్‌బీఐ ఎంఎఫ్‌ రూ.2,53,829 కోట్లతో నాలుగవ స్థానంలో ఉన్నాయి. 



You may be interested

ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 16.7 శాతం వృద్ధి

Friday 5th October 2018

న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఏప్రిల్‌- సెప్టెంబర్‌ మధ్య స్థూలంగా 16.7 శాతం పెరిగాయి. విలువలో రూ.5.47 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. అయితే ఇదే కాలంలో రిఫండ్స్‌ విలువ రూ.1.03 లక్షల కోట్లు. గత ఏడాది ఈ కాలంలో జరిగిన రిఫండ్స్‌కన్నా ఇది 30.4 శాతం అధికం. దీనితో నికర వసూళ్లు (రిఫండ్స్‌ సర్దుబాటు అనంతరం) 14 శాతం వృద్ధితో రూ.4.44 లక్షల కోట్లుగా ఉన్నట్లు ఆర్థిక శాఖ ఒక

మార్కెట్లోకి బీఎండబ్ల్యూ ‘ఎక్స్‌1’

Friday 5th October 2018

న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన లగ్జరీ కార్‌మేకర్‌ బీఎండబ్ల్యూ... భారత మార్కెట్‌లో గురువారం ‘ఎక్స్‌1’ పెట్రోల్‌ వేరియంట్‌ను విడుదల చేసింది. కేవలం 7.6 సెకన్ల వ్యవధిలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల ఈ శక్తివంతమైన కారు ధర రూ.37.5 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. గరిష్ట స్పీడు గంటకు 224 కి.మీ కాగా, ఇంతటి వేగానికి తగిన భద్రతా వ్యవస్థను కూడా ఈ కారులో మెరుగుపరిచినట్లు వెల్లడించింది. ఆరు ఎయిర్‌

Most from this category