STOCKS

News


ఎన్‌బీఎఫ్‌సీల్లో ఫండ్స్‌ పెట్టుబడులు.. ఏం పర్వాలేదు..

Monday 1st October 2018
personal-finance_main1538389061.png-20759

ఎన్‌బీఎఫ్‌సీ స్టాక్స్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడుల గురించి భయపడాల్సిన అవసరం లేదంటున్నారు వ్యాల్యురీసెర్చ్‌ సీఈవో ధీరేంద్ర కుమార్‌. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. లిక్విడిటీ సమస్య అనేది ఒక అంశమైతే.. విశ్వాసాన్ని ఏర్పరచడం అనేది మరొక అంశమని తెలిపారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ వంటి ఘటనలు తలెత్తినప్పుడు.. దీని వల్ల ఇతర విభాగాలపై కూడా నెగటివ్‌ ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. అందువల్ల సవాళ్లను అధిగమించేందుకు త్వరితగతిన చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. సమస్యకు ముగింపు పలకడానికి, స్పష్టమైన పరిష్కార విధానాలను ప్రకటించాలని పేర్కొన్నారు. లేకపోతే మార్కెట్‌ విశ్వాసం దెబ్బతింటుందని హెచ్చరించారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ వంటి సమస్యలు ఏర్పడినప్పడు చాలా వరకు లిక్విడ్‌ ఫండ్స్‌ విలువ రాత్రికిరాత్రే పడిపోదనే విషయాన్ని ఇన్వెస్టర్లు గమనించారని పేర్కొన్నారు. అలాగే ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ ఫండ్స్‌ వాటి డిజైన్‌ వల్ల సమస్యను ఎదుర్కొన్నాయని తెలిపారు. ఇక ఎఫ్‌ఎంపీల విషయంలో ఇన్వెస్టర్లు ఏం చేయడానికి వీలులేదని పేర్కొన్నారు. 
ఫండ్‌ మేనేజర్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల స్టాక్స్‌లోనూ ఇన్వెస్ట్‌ చేశారని ధీరేంద్ర కుమార్‌ తెలిపారు. ఇవి సరైన పనితీరు కనబర్చడం లేదన్నారు. అయితే అన్ని ఎన్‌బీఎఫ్‌సీలు ఒకే విధంగా ఉండవని, ఇది ఒక చిన్న విభాగమని పేర్కొన్నారు. మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్మాణాన్ని పరిశీలిస్తే.. డైవర్సిఫికేషన్‌ వల్ల ప్రయోజనం పొందొచ్చని తెలిపారు. అలాగే ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్స్‌నుంచి ఎప్పుడైనా ఎగ్జిట్‌ అవ్వొచ్చని పేర్కొన్నారు. అందువల్ల ఎన్‌బీఎఫ్‌సీ స్టాక్స్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్ల వల్ల భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. 


MFs

You may be interested

జున్‌జున్‌వాలాకూ ఒక్క నెలలో రూ.1,300 కోట్ల నష్టాలు!

Monday 1st October 2018

సాధారణ ఇన్వెస్టర్లకే కాదు... బిలియనీర్‌ ఇన్వెస్టర్‌, ఏస్‌ ఇన్వెస్టర్‌గా పేరొందిన జున్‌జున్‌వాలా పోర్ట్‌ఫోలియో సైతం తాజా కరెక్షన్‌లో నెగెటివ్‌ (మైనస్‌) రిటర్నుల్లోకి వెళ్లిపోయింది. కేవలం గత నెల రోజుల్లోనే ఆయన టాప్‌ 10 హోల్డింగ్స్‌పై రూ.1,300 కోట్ల నష్టాలు (12.3 శాతం) చూపిస్తున్నాయి. అదే ఈ ఏడాది ఇంత వరకు చూస్తే నికరంగా రూ.1,196 కోట్ల నష్టాల్లో ఉన్నాయి. ఇది 11.4 శాతానికి సమానం. జున్‌జున్‌వాలా టాప్‌ 10 హోల్డింగ్స్‌

ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌కు సత్యం తరహా పరిష్కారం?

Monday 1st October 2018

ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ను ఒడ్డునపడేసేందుకు సత్యం కంప్యూటర్స్‌ తరహా పరిష్కారాన్ని తెచ్చేందుకు కేంద్రం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా గ్రూప్‌ మేనేజ్‌మెంట్‌లో మార్పులు చేసేందుకు ఎన్‌సీఎల్‌టీని అనుమతి కోరింది. సోమవారమే ఇందుకు సంబంధించి ఆదేశాలు వచ్చే అవకాశాలున్నాయి. సంక్షోభానికి సరైన మేనేజ్‌మెంట్‌ చర్యలు లేకపోవడం కూడా ఒక కారణమని కేంద్రం తన పిటీషన్‌లో పేర్కొంది. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ పతనమైతే అది అటు ఎంఎఫ్‌లు, ఇటు

Most from this category