News


సెప్టెంబర్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌ కొనుగోళ్లు

Sunday 14th October 2018
personal-finance_main1539540529.png-21140

మ్యూచువల్‌ ఫండ్స్‌ను నిపుణులైన మేనేజర్లు నిర్వహిస్తుంటారు. ఏ స్టాక్‌ను ఎప్పుడు విక్రయించాలి, ఎప్పుడు కొనుగోలు చేయాలనే విషయంలో సాధారణ ఇన్వెస్టర్లతో పోలిస్తే ఫండ్స్‌ మేనేజర్లు సదా అప్రమత్తంగా వ్యవహరిస్తుంటారు. అలా అయితేనే వారు ఇన్వెస్టర్ల పెట్టుబడులపై రాబడులు తీసుకురాగలరు. ఈ ఏడాది సెప్టెంబర్‌ నెలలో దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టపోయిన విషయం తెలిసిందే. ఈ సమయంలో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగించగా... దేశీయ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు (మ్యూచువల్‌ ఫండ్స్‌ తదితర) కొనుగోళ్లు జరిపారు. ఈ ఏడాది ఆగస్ట్‌ నుంచి మ్యూచువల్‌ ఫండ్స్‌ నికర కొనుగోలుదారులుగానే ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్ట్‌లో ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.6,800 కోట్ల పెట్టుబడులు తరలివస్తే, సెప్టెంబర్‌లో రూ.14,100 కోట్లకు పెరగడం గమనార్హం. మరి తాజా మార్కెట్‌ కరెక్షన్‌లో ఫండ్స్‌ కొనుగోలు చేసిన, అమ్మిన షేర్ల గురించి ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ ఓ నివేదికలో తెలిపింది.

 

లార్జ్‌క్యాప్‌
లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో వేదాంత లిమిటెడ్‌, ఎన్‌ఎండీసీ, అదానీ పోర్ట్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, అశోక్‌లేలాండ్‌ స్టాక్స్‌ను ఎక్కువగా కొనుగోళ్లు చేశాయి. అదే సమయంలో లార్జ్‌క్యాప్‌ విభాగంలో శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌, విప్రో, ఐసీఐసీఐ లాంబార్డ్‌, యునైటెడ్‌ బ్రెవరీస్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌లో అమ్మకాలు చేశాయి. 
మిడ్‌క్యాప్‌
మిడ్‌క్యాప్‌ విభాగంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, సింజీన్‌ ఇంటర్నేషనల్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌, ప్రెస్టీజ్‌ ఎస్టేట్‌, ఆల్కెమ్‌ ల్యాబ్స్‌లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టాయి. అదే సమయంలో దివాన్‌ హౌసింగ్‌, పీసీ జ్యుయలర్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, రిలయన్స్‌ క్యాపిటల్‌, టాటా కమ్యూనికేషన్‌లో అమ్మకాలు జరిపాయి. 
స్మాల్‌క్యాప్‌
స్మాల్‌క్యాప్‌ విభాగంలో గుజరాత్‌ ఫ్లోరో, వీమార్ట్‌, స్పైస్‌జెట్‌, కేపీఐటీ టెక్నాలజీస్‌, ఐఎఫ్‌జీఎల్‌ రిఫ్రాక్టరీస్‌లో కొనుగోళ్లు చేయగా, మోన్‌శాంటో ఇండియా, బలరామ్‌పూర్‌చినీ, టెక్నో ఎలక్ట్రిక్‌, ఇన్ఫీబీమ్‌ అవెన్యూస్‌, కావేరి సీడ్‌లో అమ్మకాలు చేశాయి. 



You may be interested

పతనాలకు వెరవని ఈక్విటీ ఫండ్స్‌ ఇన్వెస్టర్లు

Sunday 14th October 2018

మార్కెట్లలో కరెక్షన్‌ సాధారణంగా రిటైల్‌ ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తుంది. మార్కెట్‌ ర్యాలీల్లో ఇన్వెస్ట్‌ చేసేందుకు మొగ్గు చూపే ఇన్వెస్టర్లు, పతనాల్లో మాత్రం దూరం ఉంటుంటారు. అంతేకాదు ఉన్నదంతా ర్యాలీల్లో ఇన్వెస్ట్‌ చేసి, కరెక్షన్‌లో భయపడి అమ్ముకునే వారు కూడా ఉన్నారు. కానీ, ఇటీవలి కాలంలో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్టర్లలో పరిణతి కనిపిస్తోంది. మార్కెట్‌ కరెక్షన్లు చూసి రిటైల్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్టర్లు భయపడడం లేదు సరికదా, అదనంగా

ఓపిక ఉంటేనే లాభాలు!

Sunday 14th October 2018

స్టాక్‌ మార్కెట్లలో ఇటీవలి కరెక్షన్‌ కొంత మంది ఇన్వెస్టర్లను నష్టాల పాలు చేసింది. మార్కెట్లు మరో 10 శాతం వరకు దిద్దుబాటుకు గురయ్యే అవకాశాలు లేకపోలేదని మార్సెల్లస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ వ్యవస్థాపకుడు సౌరభ్‌ ముఖర్జియా పేర్కొన్నారు. నిజానికి ఈక్విటీలన్నవి సహజంగా ఆటుపోట్లతో కూడి ఉంటాయని, కాకపోతే నష్టాలను పరిమితం చేసుకునే మార్గాలు కూడా ఉన్నాయని మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. నష్టాలను పరిమితం చేసుకోవడం అన్నది లాభాలు గడించేందుకు కీలకమని చెబుతున్నారు.

Most from this category