STOCKS

News


రూ.24 లక్షల కోట్లకు ఫండ్స్‌ ఆస్తులు

Saturday 8th December 2018
personal-finance_main1544240965.png-22753

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్‌ ఆస్తులు గత నెలలో 8 శాతం ఎగసి రూ.24 లక్షల కోట్లకు పెరిగాయి. లిక్విడ్‌ స్కీమ్స్‌లో పెట్టుబడులు జోరుగా పెరగడంతో ఫండ్‌ ఆస్తులు ఈ స్థాయిలో పెరిగాయని యాంఫీ(అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా) పేర్కొంది. సంపద వృద్ధికి మ్యూచువల్‌ ఫండ్స్‌ తగిన సాధనాలన్న అంచనాలతో వచ్చే ఏడాది ఫండ్స్‌ల్లో మరింత జోరుగా పెట్టుబడులు వస్తాయని వివరించింది.  ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, ఇతరత్రా అంశాలపై యాంఫీ ఇంకా ఏం చెప్పిందంటే., 

♦ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ దూసుకుపోతోంది. 
♦ ద్రవ్యోల్బణం దిగొస్తున్న కారణంగా సమీప భవిష్యత్తులో ఈక్విటీల్లో రాబడులు చెప్పుకోదగిన ‍స్థాయిలో ఉంటాయి. 
♦ భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మొత్తం 42 మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల నిర్వహణ ఆస్తులు ఈ ఏడాది నవంబర్‌లో రూ.24.03 లక్షల కోట్లకు పెరిగాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో ఈ ఆస్తులు రూ.22.23 లక్షల కోట్లుగా ఉన్నాయి. గత ఏడాది నవంబర్‌లో ఈ ఆస్తులు రూ.22.79 లక్షల కోట్లుగా ఉన్నాయి.
♦ గత నెలలో ఫండ్స్‌ల్లో పెట్టుబడులు రూ.1.42 లక్షల కోట్లు వచ్చాయి. అంతకు ముందటి నెల పెట్టుబడులతో పోల్చితే ఇది రూ.35,000 కోట్లు అధికం. 
♦ సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) పెట్టుబడులు నెలకు రూ.7,985 కోట్లుగా ఉన్నాయి.  గత నెలలో 1.5 లక్షల మంది కొత్తగా సిప్‌లను ఆరంభించారు. 
♦ లిక్విడ్‌, ఈక్విటీ, ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌ల్లో పెట్టుబడులు బాగా రావడంతో గత నెలలో ఫండ్స్‌ ఆస్తులు బాగా పెరిగాయి. 
♦ గత నెలలో లిక్విడ్‌ ఫండ్స్‌లో రూ.1.36 లక్షల కోట్లు, ఈక్విటీ, ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌ల్లో రూ.8,400 కోట్లు, బ్యాలన్స్‌డ్‌ ఫండ్స్‌ల్లో రూ.215 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి. 
♦ గత కొన్ని నెలలుగా ఫండ్స్‌ఉపసంహరణ జోరుగా ఉన్న గోల్డ్‌ ఈటీఎఫ్‌ ఫండ్స్‌లో నవంబర్‌లో మాత్రం రూ.10 కోట్ల నికర పెట్టుబడులు వచ్చాయి. 
♦ ఇక ఇన్‌కమ్‌ ఫండ్స్‌ నుంచి రూ.6,518  కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది. 



You may be interested

కరెంట్‌ అకౌంట్‌ లోటు భయాలు

Saturday 8th December 2018

ముంబై: దేశంలో కరెంట్‌ అకౌంట్‌ లోటు (క్యాడ్‌) భయాలు నెలకొన్నాయి. రెండవ త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్‌) నమోదయిన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చితే క్యాడ్‌ 2.9 శాతంగా నమోదయ్యింది. విలువలో ఇది 19.1 బిలియన్‌ డాలర్లు. రెండవ త్రైమాసికంలో ఇది  15.9 బిలియన్‌ డాలర్లే (జీడీపీలో 2.4 శాతం). గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ విలువ 6.9 బిలియన్‌ డాలర్లు (జీడీపీలో 1.1శాతం). కాగా ప్రస్తుత ఆర్థిక

సాఫ్ట్‌బ్యాంకులోకి కీర్తిగా రెడ్డి

Saturday 8th December 2018

న్యూఢిల్లీ: సాఫ్ట్‌బ్యాంకు 100 బిలియన్‌ డాలర్ల విజన్‌ ఫండ్‌ నిర్వహణ బాధ్యతలను ఫేస్‌బుక్‌ నుంచి తీసుకుంటున్న కీర్తిగారెడ్డికి అప్పగిస్తోంది. విశేషమేమిటంటే సాఫ్ట్‌బ్యాంకు ఓ మహిళను ఈ బాధ్యతల కోసం ఎంపిక చేయటం ఇదే తొలిసారి. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ పెట్టుబడులకు సంబంధించి సాఫ్ట్‌బ్యాంకు గ్రూపు పరిధిలో 12 ఫండ్స్‌ ఉన్నాయి. ‘‘సాఫ్ట్‌బ్యాంకు ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్‌లో కీర్తిగారెడ్డి చేరారు. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఫండ్‌ను ఆమె నిర్వహిస్తారు. సీనియర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ దీప్‌ నిషార్‌తో

Most from this category