STOCKS

News


మహీంద్రా నుంచి కొత్త ఈక్విటీ ఫండ్‌

Tuesday 9th October 2018
personal-finance_main1539059799.png-20961

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అనుబంధ సంస్థ అయిన మహీంద్రా మ్యూచువల్‌ ఫండ్‌ మార్కెట్లోకి కొత్త రకం ఈక్విటీ పథకాన్ని విడుదల చేసింది. ‘మహీంద్రా రూరల్‌ భారత్‌ అండ్‌ కన్‌సప్షన్‌ యోజన’ పేరిట ఆరంభిస్తున్న ఈ ఈక్విటీ ఫండ్‌ పథకం సబ్‌స్క్రిప‍్షన్‌ ఈ నెల 19న ఆరంభమై నవంబర్‌ 2న ముగుస్తుంది. దీర్ఘకాలక మూలధన వృద్ధి కోరుకునే ఇన్టెసర్లకు ఈ పథకం మంచి అవకాశమని కంపెనీ అశుతోష్‌ బిష్ణోయ్‌ తెలిపారు. ఈ పథకం కనీసం 80 శాతం పెట్టుబడిని గ్రామీణ భారతం వైపు దృష్టి కేంద్రీకరించిన సంస్థల ఈక్విటీ ఆధారిత సాధనాల్లో పెడుతుందని ఆయన చెప్పారు. 



You may be interested

అపోలో మ్యునిక్‌ నుంచి ‘ఐకెన్‌’

Tuesday 9th October 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆరోగ్య బీమా కంపెనీ అపోలో మ్యునిక్‌... విపణిలోకి ‘ఐకెన్‌’ పేరిట క్యాన్సర్‌ పాలసీని విడుదల చేసింది. జీవితకాల కవరేజీ అందించడమే ఈ ప్లాన్‌ ప్రత్యేకత అని కంపెనీ సీఎంఓ డాక్టర్‌ నందినీ అలీ సోమవారమిక్కడ విలేకరులకు తెలిపారు. క్లెయిమ్‌ చేసిన తర్వాత వార్షిక పునరుద్దరణకు వీలుంటుందని.. ఇప్పటివరకు 20 రకాల ఆరోగ్య బీమా పాలసీలను విడుదల చేశామని చెప్పారు. 5–60 ఏళ్ల వయస్సున్న కుటుంబ సభ్యులెవరైనా

టాటా ఎలెక్సీ అమ్మకాలు రూ.403 కోట్లు

Tuesday 9th October 2018

 ముంబై: టాటా గ్రూప్‌కు చెందిన ఐటీ కంపెనీ, టాటా ఎలెక్సీ నికర అమ్మకాలు ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.403 కోట్లకు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర అమ్మకాలతో (రూ.342 కోట్లు) పోలిస్తే 17 శాతం వృద్ధి సాధించామని టాటా ఎలెక్సీ తెలిపింది. నికర లాభం రూ.57 కోట్ల నుంచి 44 శాతం వృద్ధితో రూ.82 కోట్లకు ఎగసిందని పేర్కొంది. ఎబిట

Most from this category