News


జీవన్‌శాంతి, ఎన్‌పీఎస్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌.. ఏది మెరుగు?

Sunday 18th November 2018
personal-finance_main1542563936.png-22153

రిటైర్మెంట్‌కు ఏ పథకంలో ఇన్వెస్ట్‌ చేసుకుంటే మెరుగైన రాబడులు వస్తాయన్నది మన దేశంలో ఎక్కువ మందికి ఉండే సందేహం. ప్రైవేటు రంగంలోని వారికి ఎన్‌పీఎస్‌, ఈఎల్‌ఎస్‌ఎస్‌, బీమా పెన్షన్‌ పథకాలు ఇలా ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ఈ విషయంలో ఓ ఇన్వెస్టర్‌ ప్రశ్నకు ఫిన్‌ఫిక్స్‌ రీసెర్చ్‌ అండ్‌ అనలటిక్స్‌ వ్యవస్థాపకుడు ప్రబ్లీన్‌ బాజ్‌పాయి సమాధానం ఇచ్చారు. 

 

వయసు 31 ఏళ్లు. రూ.15 లక్షలను 55వ ఏట వచ్చే వరకు ఇన్వెస్ట్‌ చేస్తాను. ఎల్‌ఐసీ జీవన్‌శాంతి, ఎన్‌పీఎస్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఏది మెరుగు?
ఎన్‌పీఎస్‌ అన్నది ఈక్విటీల్లో పెట్టుబడులకు అవకాశం కల్పిస్తుంది. కాకపోతే ప్రతీ ఆర్థిక సంవత్సరంలోనూ కనీసం ఒక్కసారి అయినా జమ చేయాలి. 60 ఏళ్లు వచ్చే వరకు ఇన్వెస్ట్‌ చేయాలి. అప్పుడు చేతికి వచ్చే మొత్తంలో 40 శాతంతో యాన్యుటీ ప్లాన్‌ తీసుకోవడం తప్పనిసరి. 60 ఏళ్ల కంటే ముందే తప్పుకుంటే 80 శాతం మెచ్యూరిటీతో యాన్యుటీ ప్లాన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఎల్‌ఐసీ జీవన్‌ శాంతి అనేది 20 ఏళ్ల డిఫర్డ్‌ పీరియడ్‌తో ఒకేసారి ఇన్వెస్ట్‌ చేసే పథకం. రూ.15 లక్షలను ఇన్వెస్ట్‌ చేస్తే... 20 ఏళ్ల తర్వాత నుంచి ప్రతీ నెలా సుమారు రూ.26,000 చొప్పున పెన్షన్‌ అందుతుంది. జీవన్‌శాంతి జీవిత బీమాను సైతం అందిస్తుంది. అదే మ్యూచువల్‌ ఫండ్స్‌లో రెండు ఈక్విటీ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేసినట్టయితే... ఏటా 12 శాతం రాబడి అంచనాతో 24 ఏళ్లలో రూ.2.56 కోట్లు సమకూరుతుంది. దీనిపై 6 శాతం ఆదాయం వస్తుందని అనుకున్నా ప్రతీ నెలా రూ.1.28 లక్షల మేర పెన్షన్‌ అందుకోవచ్చు. 

 

మనవడి ఉన్నత విద్య కోసం 17 ఏళ్ల కాలానికి రూ.5 లక్షలు ఇన్వెస్ట్‌ చేస్తా. అధిక రాబడులు ఎందులో ఉంటాయి?
లార్జ్‌క్యాప్‌, మల్టీక్యాప్‌, మిడ్‌క్యాప్‌ మధ్య పెట్టుబడిని మూడు భాగాలు చేసుకుని ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఐసీఐసీఐ బ్లూచిప్‌, రిలయన్స్‌ లార్జ్‌క్యాప్‌, యాక్సిస్‌ బ్లూచిప్‌ అన్నవి మంచి లార్జ్‌క్యాప్‌ పథకాలు. మల్టీక్యాప్‌లో మంచి పథకాలను చూస్తే... హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్‌ బిల్డర్‌ వ్యాల్యూ, ఎస్‌బీఐ మ్యాగ్నం మల్టీక్యాప్‌, మోతీలాల్‌ ఓస్వాల్‌ మల్టీక్యాప్‌35 ఉన్నాయి. మిడ్‌క్యాప్‌లో హెచ్‌డీఎఫ్‌సీ మిడ్‌క్యాప్‌ అపార్చునిటీస్‌, కోటక్‌ ఎమర్జింగ్‌ ఈక్విటీ అన్నవి మంచి పథకాలని పైసాబజార్‌ సీఈవో నవీన్‌కుక్రేజా తెలిపారు.
 You may be interested

పడ్డవన్నీ మంచివి కావు!

Sunday 18th November 2018

‘పడ్డోళ్లు ఎప్పుడూ చెడ్డోళ్లు కారు’ అన్నది జీవితానికి సరిపోతుందేమో కానీ... స్టాక్స్‌కు మాత్రం అతకదు. ఎందుకంటే పడిపోయిన స్టాక్స్‌ అన్నీ మంచివనీ చెప్పలేం. అలాగనీ చెడ్డవని అనడానికి కూడా లేదు. గత రెండేళ్ల కాలంలో స్మాల్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ భారీ ర్యాలీ చేశాయి. కానీ, ఈ ఏడాది మాత్రం తీవ్ర నష్టాల బాటలోకి వెళ్లాయి. అధిక వ్యాల్యూషన్ల కారణంగా వాటిల్లో దిద్దుబాటు జరిగింది. ఇక చమురు ధరలు, రూపాయి పతనం

ఇన్వెస్టర్ల పెట్టుబడులను హరించేసిన స్టాక్స్‌

Sunday 18th November 2018

ఇన్వెస్టర్లు రాబడుల కాంక్షతో స్టాక్‌ మార్కెట్లో నేరుగా ఇన్వెస్ట్‌ చేయడానికి మొగ్గుచూపుతుంటారు. ఒక్కసారి పెట్టుబడి పెట్టిన తర్వాత కంపెనీ పనితీరుపై నిత్యం కన్నేసి ఉంచి, అవసరమైతే వేగంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారానే రాబడులకు, పెట్టుబడి రక్షణకు అవకాశం ఉంటుందని తెలుసుకోవాలి. లేదంటే ఇన్వెస్టర్లు నిండా నష్టాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. కుబేరులను చేసిన షేర్లే కాదు... నిండా ముంచేసినవీ కూడా స్టాక్‌ మార్కెట్లో ఉన్నాయి. గడిచిన ఐదేళ్ల కాలంలో ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువను

Most from this category