News


ఎంఎఫ్‌ మదుపరులకు పాఠాలు

Saturday 29th December 2018
personal-finance_main1546076479.png-23313

ఈ సంవత్సరం మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్టర్లకు మిశ్రమ ఫలితాలు అందాయి. 2018లో ఎంఎఫ్‌ మార్కెట్‌ మదుపరులకు మూడు పాఠాలు నేర్పింది.
1. టాప్‌ అప్‌ మరువద్దు: మార్కెట్లు వెనుకంజ వేసిన తరుణంలో ఎంఎఫ్‌ పోర్టుఫోలియోను టాప్‌ అప్‌ చేసుకున్నవాళ్లకు ఈ ఏడాది మంచి రాబడులే వచ్చాయి. కేవలం మొదట పెట్టిన పెట్టుబడితో ఆగిన వాళ్లు నష్టాలను చవిచూశారు.
2. లాంగ్‌టర్మ్‌ మంత్రం: దీర్ఘకాలిక ధృక్పథం, పోర్టుఫోలియోలో వైవిధ్యత ఉన్న మదుపరులే ముందుంటారని ఈ ఏడాది నిరూపించింది. ఈక్విటీ మార్కెట్లో సగటు ఇన్వెస్టరు​ దాదాపు 30 శాతం వార్షిక నష్టం నమోదు చేస్తాడు. అదే లాంగ్‌టర్మ్‌లో ఈ నష్టం యావరేజ్‌ అయి లాభాలు వస్తాయి. అందువల్ల ఎంఎఫ్‌ల్లో దీర్ఘకాలానికే పెట్టుబడులు పెట్టాలి.
3. ఫండ్‌ సామర్ధ్య ప్రదర్శన: ఇన్వెస్టర్లు ఒక ఫండ్‌ను ఎంచుకునేముందు దాని ప్రదర్శనను చూస్తారు. అయితే గతేడాది మంచి ప్రదర్శన చూపిన చాలా ఫండ్స్‌ ఈ ఏడాది నష్టాన్నిచ్చాయి. అందువల్ల కేవలం ఫండ్‌ ఏడాది ప్రదర్శన చూడకుండా, దీర్ఘకాలిక ప్రదర్శన చూసి పెట్టుబడి నిర్ణయం తీసుకోవాలని నిపుణుల సూచన.



You may be interested

సెల్లింగ్‌ సప్తపది

Saturday 29th December 2018

ఎప్పుడు అమ్మేయాలో తెలుకోండి స్టాక్‌ మార్కెట్లో విజయం సాధించాలంటే రెండు మౌలిక సూత్రాలు తప్పక తెలిసుండాలి. ఒకటి సరైన సమయంలో కొనడం, రెండు సరైన సమయంలో అమ్మడం. చాలామంది ఆచితూచి కొనుగోలు చేసినా ఎప్పుడు అమ్మాలో తెలియక బొక్కబోర్లాపడుతుంటారు. అందుకే మన వద్ద ఉన్న స్టాకులను ఎప్పుడు విక్రయించాలో తెలుసుకోవడం కీలకం. ఇందుకు నిపుణులు కొన్ని సంకేతాలను సూచిస్తున్నారు... 1. 20 శాతం లాభాలు: సాధారణంగా ఒక కీలక నిరోధాన్ని దాటిన తర్వాత

ఎఫ్‌ఎంసీజీపై జెఫర్రీస్‌ మక్కువ

Saturday 29th December 2018

రాబోయే కొన్ని నెలల్లో ఎఫ్‌ఎంసీజీ స్టాకులు పాజిటివ్‌గా ఉండొచ్చని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థ జెఫర్రీస్‌ అంచనా వేస్తోంది. సమీప భవిష్యత్‌లో ముడిపదార్ధాల ధరలు తగ్గడం, వినిమయ డిమాండ్‌ పెరగడంతో ఎఫ్‌ఎంసీజీ స్టాకుల రీరేటింగ్‌ సంభవించవచ్చని తెలిపింది. ముడిపదార్ధాల ధరలు చల్లారడంతో ఈ కంపెనీల మార్జిన్లు విస్తృతమవుతాయని వివరించింది. అయితే ఈ రంగంలో స్టాకులను ఎంచుకునేముందు వాల్యూషన్లు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. గత కొన్ని నెలలుగా ముడిపదార్ధాల ధరల పెరుగుదలతో ఆహార

Most from this category