STOCKS

News


ఇప్పటికైతే ఈటీఎఫ్‌లు నయం: ధీరేంద్ర కుమార్‌

Thursday 29th November 2018
personal-finance_main1543431427.png-22460

కొన్ని రకాల ఫండ్స్‌ ప్రాధాన్యం కోల్పోయాయని, ఇవి బెంచ్‌ మార్క్‌తో పోటీ పడలేకపోతున్నాయని వ్యాల్యూ రీసెర్చ్‌ సం‍స్థ సీఈవో ధీరేంద్ర కుమార్‌ అన్నారు. ఈ ఫండ్స్‌ వ్యయాలు అధిక స్థాయిల్లో ఉండడమే కారణమన్నారు. వీటికంటే ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌లు) మెరుగైనవన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. మ్యూచువల్‌ ఫండ్స్‌ రాబడుల్లో వచ్చిన మార్పులపై ఆయన ఓ వార్తా సంస్థతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘‘లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌ సిప్‌ రాబడులను గమించినట్టయితే... 71 ఫండ్స్‌ పథకాల్లో గత ఐదేళ్లుగా సిప్‌ చేస్తూ వెళితే కేవలం 14 ఫండ్స్‌ మాత్రమే ఇండెక్స్‌ను మించి రాబడులను ఇవ్వగలిగాయి. గత పదేళ్ల కాలం నుంచి 41 ఫండ్స్‌ ఉండగా అందులో కేవలం 11 ఫండ్స్‌ మాత్రమే ఇండెక్స్‌ను మించి రాబడులను ఇచ్చాయి. కనుక అవి ఇప్పుడు తగినవి కావు. లార్జ్‌క్యాప్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే ఎక్సేంజ్‌ ట్రేటెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌లు)ను పరిశీలించండి. ఈక్విటీ మార్కెట్లు, వాటి నుంచి రాబడుల విషయంలో అతా అనిశ్చితి నెలకొంది. కనుక వ్యయాలన్నవి ఇక్కడ ముఖ్యమైనవి. ఈటీఎఫ్‌లలో ఎక్స్‌పెన్స్‌ రేషియో తక్కువగా ఉంటుంది’’ అని ధీరేంద్ర కుమార్‌ మారిన పరిస్థితులను విశదీకరించారు. 


చాలా మంది ఇన్వెస్టర్లు మల్టీక్యాప్‌ ఫండ్స్‌, బ్యాలన్స్‌డ్‌ ఫండ్స్‌లో రూ.5,000-10,000 వరకు సిప్‌ చేస్తున్నా గానీ, వారి పోర్ట్‌ఫోలియోలో ఇండెక్స్‌ ఆప్షన్‌ ఉండడం లేదన్నారు. వ్యక్తిగత ఇన్వెస్టర్లు నిఫ్టీ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చని సూచించారు. స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ ఫండ్‌, మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ ఫండ్‌, బ్యాలన్స్‌డ్‌ ఇండెక్స్‌ ఫండ్స్‌ లేవన్న విషయాన్ని గుర్తు చేశారు. సెబీ ఇటీవల మ్యూచువల్‌ ఫండ్స్‌ ఎక్స్‌పెన్స్‌ రేషియోల తగ్గింపు నిర్ణయం మెచ్చుకోతగినదిగా అభివర్ణించారు. రానున్న రెండు నుంచి నాలుగేళ్లలో చురుగ్గా నిర్వహణలో ఉండే ఫండ్స్‌ ఆకర్షణీయమైనవని, పోటీ కారణంగా అవి ఎక్స్‌పెన్స్‌ రేషియో తగ్గించుకోవడం లేదా పనితీరు మెరుగ్గా ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ధీరేంద్ర కుమార్‌ అంచనా వేశారు. ‘‘కొత్తగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ ఆరంభించే వారు బ్యాలన్స్‌డ్‌ ఫండ్స్‌తో మొదలు పెట్టాలనే మళ్లీ చెబుతాను. అది కూడా ఈక్విటీలో మల్టీక్యాప్‌ విధానం, డెట్‌లో కార్పొరేట్‌ బాండ్స్‌ పరంగా మంచి కలయికతో ఉన్నవి ఎంచుకోవాలి. పన్ను ఆదా కోసం అయితే మల్టీక్యాప్‌తో కూడిన పన్ను ఆదా పథకాన్ని ఎంచుకోవాలి. లార్జ్‌క్యాప్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు వాటికి బదులు ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్‌ చేయడం మంచిది’’ అని సూచించారు.  You may be interested

నిఫ్టీ గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌!!

Thursday 29th November 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో గురువారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:42 సమయంలో 96 పాయింట్ల లాభంతో 10,811 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ బుధవారం ముగింపు స్థాయి 10,717 పాయింట్లతో పోలిస్తే 94 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ గురువారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ దాదాపుగా లాభాల్లోనే ట్రేడవుతున్నాయి.

ఈ కంపెనీల ఆదాయాల్లో నిలకడైన వృద్ధి

Thursday 29th November 2018

ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు, గత నాలుగు క్వార్టర్లుగా ఆదాయాల్లో వృద్ధిని నమోదు చేస్తున్న ఈ కంపెనీలపై ఓ సారి దృష్టి సారించొచ్చు. ఆశ్చర్యకరంగా పనితీరును మెరుగుపరుచుకుంటున్న ఈ 12 కంపెనీల్లో కొన్ని ఇప్పటికే మంచి రాబడులను పంచాయి. ప్రతీ త్రైమాసికంలోనూ ఆదాయాలు పెంచుకుంటూ వస్తున్నవి, 20 శాతానికి పైగా లాభాల మార్జిన్‌ను కలిగి ఉన్నవి, రూ.500 కోట్లకు పైగా మార్క్‌ట్‌ విలువ కలిగిన కంపెలు ఇవి. వీటిలో టీసీఎస్‌,

Most from this category