STOCKS

News


9 శాతం రాబడినిచ్చే డెట్‌ ఫండ్లు ఉన్నాయా?

Monday 7th January 2019
personal-finance_main1546857934.png-23454

- పెద్ద మొత్తంలో ఒకేసారి ఇన్వెస్ట్‌ చేయటం తప్పా?
- ఫండ్‌ నిపుణుడు ధీరేంద్రకు ‘సాక్షి’ పాఠకుల ప్రశ్నలు

ప్ర: నేను ఏడాది క్రితం ఫ్రాంక్లిన్‌ ఇండియా స్మాలర్‌ కంపెనీస్‌ ఫండ్‌లో పెద్ద మొత్తం ఇన్వెస్ట్‌ చేశాను. అప్పటి నుంచి ఈ ఫండ్‌ పనితీరు ఏ మాత్రం బాగులేదు. నా ఇన్వెస్ట్‌మెంట్‌ 20 శాతం వరకూ తరిగిపోయింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు?
-సత్యం, విజయవాడ 

జ: సాధారణంగా చాలా మంది ఇన్వెస్టర్లు చేసే తప్పునే మీరూ చేశారు. సదరు ఫండ్‌ గతంలో పనితీరును చూసి ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌ చేశారు. ఇలాంటి ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఇలా ఒకేసారి ఎప్పుడూ ఇన్వెస్ట్‌ చేయకూడదు. అయితే ఫ్రాంక్లిన్‌ ఇండియా స్మాలర్‌ కంపెనీస్‌ ఫండ్‌ మంచి ఫండ్‌ అనే చెప్పవచ్చు. ఇలాంటి స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌లో మంచి రాబడులు పొందాలంటే కనీసం ఐదు నుంచి ఏడేళ్ల పాటు ఎదురు చూడాల్సి ఉంటుంది. అప్పుడు గానీ ఒక పూర్తి మార్కెట్‌ సైకిల్‌ కాలం పూర్తి కాదు. మీరు మరింతగా పొదుపు చేయగలిగితే ఈ ఫండ్‌లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) విధానంలో మరికొన్నాళ్లు ఇన్వెస్ట్‌ చేయండి. ఇలాచేస్తే మీకు యావరేజింగ్‌ ప్రయోజనాలు లభిస్తాయి. 

ప్ర: నేను డెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. ఏడాదికి 9 శాతం రాబడినిచ్చే డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఉన్నాయా ? ఉంటే వాటి వివరాలు తెలపండి. 
-కార్తీక్‌, విశాఖపట్టణం 

జ: ఏడాదికి 9 శాతం రాబడినిచ్చే కొన్ని ఓపెన్‌ ఎండెడ్‌ డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఉన్నాయి. అయితే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలా మ్యూచువల్‌ఫండ్స్‌  ఇంత రాబడినిస్తాయని గ్యారంటీగా చెప్పలేం. గత ఏడాది కొన్ని ఆల్ట్రా–షార్ట్‌ బాండ్‌ ఫండ్స్‌ 9 శాతం రాబడినిచ్చాయి. ఈ ఫండ్స్‌  ఐదేళ్ల సగటు రాబడి కూడా 9 శాతంగా ఉంది. అయితే భవిష్యత్తులో ఇవి ఈ రేంజ్‌ రాబడులను ఇస్తాయా అనే విషయంలో ఎలాంటి గ్యారంటీ ఉండదు.  మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా ఏడాదికి 9 శాతం రాబడిని పాందాలనుకుంటే మీరు ఫిక్స్‌డ్‌ మెచ్యురిటీ ప్లాన్లను (ఎఫ్‌ఎమ్‌పీ) పరిశీలించవచ్చు. ఇవి ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్స్‌ కావు. కానీ వీటికి లాక్‌ ఇన్‌ పీరియడ్‌ ఉంటుంది. మీరు ఏదైన ఒక ఎఫ్‌ఎమ్‌పీలో గానీ, కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్‌లో గానీ ఇన్వెస్ట్‌ చేశారనుకుందాం. మూడేళ్ల తర్వాత ఏడాదికి 9 శాతానికి మించే రాబడి వస్తుంది. మీకు 8.50 శాతం గానీ, 8.75 శాతం గానీ రాబడి వచ్చినా, అవి  మంచి రాబడులే అని చెప్పవచ్చు. మీరు ఏ బ్యాంక్‌లో ఇన్వెస్ట్‌ చేసినా మీకు గరిష్టంగా ఏడాదికి 8 శాతానికి మించి రాబడులను రావు. పైగా ఈ వడ్డీ ఆదాయంపై పన్ను చెల్లించాల్సి  ఉంటుంది. మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసినా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఆ పన్ను భారం తక్కువగా ఉంటుంది. మ్యూచువల్‌ ఫండ్స్‌పై వచ్చే రాబడులను మూలధన లాభాలుగా పరిగణిస్తారు. పైగా మూడేళ్ల తర్వాత వచ్చే రాబడులపై ఇండేక్సేషన్‌ ప్రయోజనాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని పన్ను లెక్కిస్తారు. కాబట్టి పన్ను భారం తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. 9 శాతానికి అర శాతం అటూ ఇటూగా రాబడి వస్తే పరవాలేదు అనుకుంటే మీరు కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే రెండు ముఖ్యమైన విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. మొదటిది.. ఈ బాండ్‌ ఫండ్‌.. మంచి రేటింగ్‌ ఉన్న బాండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేసిందీ లేనిదీ చెక్‌  చేసుకోవాలి. ఇక రెండోది. గత ఐదు నుంచి ఏడేళ్ల ట్రాక్‌ రికార్డ్‌ను పరిశీలించడం. ఈ ట్రాక్‌ రికార్డ్‌ సంతృప్తికరంగా ఉన్న ఫండ్‌నే ఎంచుకోండి. 

ప్ర: నేను కొన్నాళ్లుగా ఒక మ్యూచువల్‌ ఫండ్‌లో నెలకు రూ.3,000 చొప్పున సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. అయితే ఈ ఫండ్‌ పనితీరు నేను ఆశించిన స్థాయిలో లేదు. సిప్‌లను ఆపేద్దామనుకుంటున్నాను. తగిన సలహా ఇవ్వండి. 
-సుగుణ, హైదరాబాద్‌ 

జ: మీరు ఎన్నాళ్ల నుంచి ఇన్వెస్ట్‌ చేస్తున్నదీ వెల్లడించలేదు. ఒక ఫండ్‌ పనితీరును అంచనా వేయడానికి కనీసం రెండున్నరేళ్లు సమయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఈ రెండున్నరేళ్ల కాలంలో మీరు ఇన్వెస్ట్‌ చేస్తున్న ఫండ్‌ పనితీరు సంతృప్తికరంగా లేకపోతే సిప్‌లు ఆపేయవచ్చు. ఇక సిప్‌లు ఆపేయాలా? కొనసాగించాలా అనే విషయమై నిర్ణయం తీసుకోవడానికి రెండు ముఖ్యమైన విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. మొదటిది మార్కెట్‌ స్థితిగతులు ఎలా ఉన్నాయనేది. మార్కెట్‌ పతన బాటలో ఉండి మీ ఫండ్‌  మంచి పనితీరు కనబరచలేదనుకోండి. మీరు ఎలాంటి ఆందోళన పడక్కర్లేదు. నిరభ్యంతరంగా మీ సిప్‌లను కొనసాగించండి. అలా కాకుండా మార్కెట్‌ బాగున్నా మీ ఫండ్‌ పనితీరు బాగా లేదనుకోండి. అప్పుడు సిప్‌లను ఆపేయవచ్చు. ఇక రెండోది ఇతర ఫండ్స్‌తో పోల్చి చూడడం.. ఇదే కేటగిరి ఇతర ఫండ్స్‌తో పోల్చితే మీరు ఇన్వెస్ట్‌ చేస్తున్న ఫండ్‌ పనితీరు మెరుగ్గా ఉంటే మంచిదే. అలా కాకుండా అధ్వాన్నంగా ఉంటే, ఈ ఫండ్‌ నుంచి వైదొలగవచ్చు. You may be interested

2018లో ఫండ్స్‌ ఆస్తుల వృద్ధి రూ.1.24 లక్షల కోట్లు

Monday 7th January 2019

సిప్‌ పెట్టుబడుల్లో స్థిరమైన పెరుగుదల న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆస్తుల విలువ 2019లో నికరంగా రూ.1.24 లక్షల కోట్ల మేర పెరిగింది. ఇది 5.54 శాతం వృద్ధి. దీంతో అన్ని ఏఎంసీల నిర్వహణలోని ఆస్తుల విలువ 2018 డిసెంబర్‌ నాటికి రూ.23.61 లక్షల కోట్లుగా ఉంది. రిటైల్‌ ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యం మంచిగా ఉండడం, సిప్‌ ద్వారా వచ్చే పెట్టుబడులు స్థిరంగా పెరుగుతూ వస్తుండడం ఏఎంసీల నిర్వహణలోని ఆస్తుల వృద్ధికి దోహదపడింది. 2017

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ...   కొనొచ్చు

Monday 7th January 2019

బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌ ప్రస్తుత ధర: రూ.122 టార్గెట్‌ ధర: రూ.140 ఎందుకంటే..?: దేనా, విజయా బ్యాంక్‌లను బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విలీనం చేయడానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ విలీనానికి సంబంధించి షేర్ల మార్పిడి నిష్పత్తి దేనా, విజయ బ్యాంక్‌ల కంటే బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వాటాదారులకే లాభదాయకంగా ఉంది. ప్రతి వెయ్యి విజయ బ్యాంక్‌ షేర్లకు 402 బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు, ప్రతి వెయ్యి దేనా బ్యాంక్‌

Most from this category