STOCKS

News


రెంటల్‌ డిపాజిట్‌ను ఏ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయాలి.

Monday 4th February 2019
personal-finance_main1549264971.png-24004

ప్ర: నా షాపింగ్‌ కాంప్లెక్స్‌ను అద్దెకివ్వడం వల్ల రెంటల్‌ డిపాజిట్‌గా(మూడేళ్లకు) రూ.5 లక్షలు వచ్చాయి. ఈ సొమ్ములను ఏ కేటగిరీ మ్యూచువల్‌ ఫండ్‌లో నేను ఇన్వెస్ట్‌ చేయాలి. మూడేళ్ల తర్వాత ఈ మొత్తాన్ని నేను తిరిగి ఇవ్వాల్సి  ఉంటుంది కాబట్టి అసలుకు ఢోకా లేకుండా ఉండే ఫండ్‌ను సూచించండి.
-దేవేందర్‌, విశాఖ పట్టణం
జ: ఈ మొత్తాన్ని ఆల్ట్రా షార్ట్‌ డ్యూరేషన్‌ బాండ్‌ ఫండ్‌ లేదా షార్ట్‌ డ్యూరేషన్‌ బాండ్‌ ఫండ్‌లో గానీ ఇన్వెస్ట్‌ చేయండి. మీరు సదరు ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేసే ముందు ఈ ఫండ్‌ ఎక్స్‌పెన్స్‌ రేషియో ఎంత ఉందో చెక్‌ చేసుకోండి.  ఈ మొత్తాన్ని ఒకేసారి మీరు ఆ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. ఈ కేటగిరీ ఫండ్స్‌లో అధిక క్రెడిట్‌ రేటింగ్‌ ఉన్న ఫండ్‌నే ఎంచుకోండి.  క్రెడిట్‌ రేటింగ్‌ ఎంత అధికంగా ఉంటే, మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అంత సురక్షితంగా ఉంటాయని చెప్పవచ్చు. అలా కాకుండా ఈ మొత్తాన్ని మీరు బ్యాంక్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారనుకోండి. ఈ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై వచ్చే వడ్డీకి మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ మ్యూచువల్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేశారనుకోండి. పన్నుల పరంగా మీకు  ప్రయోజనాలు లభిస్తాయి. మూడేళ్లలోపు కాలంలో  మీరు పొందే లాభాలపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పని లేదు. మూడేళ్ల తర్వాత ఈ ఫండ్‌పై వచ్చే రాబడులను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. దీంతో మీకు ఇండేక్సేషన్‌ ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

ప్ర: ప్రస్తుతం మార్కెట్‌ తీవ్రమైన ఒడిదుడుకుల్లో ఉంది కదా! ఇలాంటి సందర్భాల్లో నష్ట భయాన్ని తగ్గించుకోవడానికి ఎన్‌ఎఫ్‌ఓ(న్యూ ఫండ్‌ ఆఫర్‌)లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. ఎన్‌ఎఫ్‌ఓలో ఇన్వెస్ట్‌ చేయాలనే నా నిర్ణయం సరైనదేనా?
-కుముదిని, విజయవాడ
జ: మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికి కీలకమైన ప్రాతిపదిక... సదరు ఫండ్‌ పనితీరు గతంలో ఉలా ఉందనే విషయం. ఒక ఫండ్‌ పనితీరును కనీసం ఏడాది నుంచి ఐదేళ్ల పాటు పరిగణనలోకి తీసుకొని, ఇదే కాలంలో ఇదే కేటగిరీ ఫండ్స్‌ పనితీరుతో పోల్చి, సంతృప్తికరమైన రాబడులు వస్తే, ఆ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. కానీ న్యూ ఫండ్‌ ఆఫర్‌(ఎన్‌న్‌ఎఫ్‌ఓ)కు అలాంటి ట్రాక్‌ రికార్డ్‌ ఏమీ ఉండదు. అందుకని ఎన్‌ఎఫ్‌ఓలో ఇన్వెస్ట్‌ చేయడం అర్థం లేని పని అని నా అభిప్రాయం. ఎన్‌ఎఫ్‌ఓలో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల నష్ట భయం తగ్గుతుందనేది అపోహ మాత్రమే. నిజానికి చెప్పాలంటే ఎన్‌ఎఫ్‌ఓ విషయమై ఎక్కువ అనిశ్చితి ఉంటుందనే విషయం కాదనలేనిది. అందుకని మంచి ఈక్విటీ ఫండ్‌ను ఎంచుకొని సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌)విధానంలో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేస్తే ఒడిదుడుకుల ప్రభావం పెద్దగా ఉండదు.

ప్ర: నేను గత ఏడాది కొంత మొత్తం ఒక ట్యాక్స్‌-సేవింగ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేశాను. కానీ ఈ ఫండ్‌ పనితీరు సరిగ్గా లేదు. ఈ ఏడాది కూడా ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ కొనసాగించమంటారా ? లేక వేరే కొత్త ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయమంటారా?
-అజీజ్‌, వరంగల్‌
జ: మీరు ఏ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేసిందీ వివరాలు వెల్లడించలేదు. కానీ చాలా ట్యాక్స్‌ సేవింగ్‌ ఫండ్స్‌లో ఒక ఏడాది కాలంలో మంచి రాబడులను ఇవ్వలేవు. ఒక ఏడాది కాలంలో ట్యాక్స్‌ సేవింగ్స్‌ ఫండ్‌ పనితీరు గురించి పెద్దగా పట్టించుకోవలసిన పనిలేదు. ట్యాక్స్‌ సేవింగ్స్‌ ఫండ్స్‌లో కనీసం ఐదేళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఐదేళ్ల పాటు కదలించలేరు. ఐదేళ్ల కాల వ్యవధిలో ట్యాక్స్‌ సేవింగ్స్‌ ఫండ్స్‌ మంచి పనితీరే కనబరుస్తాయి. కాబట్టి మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు. సదరు ఫండ్‌లో మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి.

ప్ర: చాలా ఏళ్లు కోర్టులో ఉన్న న్యాయ వివాదం పరిష్కారమై నాకు రూ.15 లక్షలు వచ్చాయి. ఇప్పుడు నాకు ఈ డబ్బులతో ఏమీ అవసరం లేదు. ఈ డబ్బులను దీర్ఘకాలం పాటు.... కనీసం పదేళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. ఏ తరహా మ్యూచువల్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే మంచిదో సూచించండి. ?
-డేవిడ్‌, సికింద్రాబాద్‌
జ: కనీసం పదేళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే, ముందుగా ఈక్విటీ ఇన్‌కమ్‌ ఫండ్‌లో కొంత కాలం ఇన్వెస్ట్‌ చేయండి. ఆ తర్వాత ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌లోకి బదిలీ చేసి మీరు కోరుకున్న కాలానికి కొనసాగించండి. ఏడాది నుంచి ఏడాదిన్నర కాలం పాటు ఈక్విటీ ఇన్‌కమ్‌ ఫండ్‌లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేయండి. కార్పస్‌లో మూడో వంతు మొత్తాన్ని ఈ ఫండ్‌ ఈక్విటీలోనూ, మిగిలిన మొత్తాన్ని ఆర్బిట్రేజ్‌, ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. ఇలాంటి వ్యూహం కారణంగా మార్కెట్‌ ఒడిదుడుకుల్లో ఉన్నా కూడా మీ పెట్టుబడికి పెద్దగా ప్రమాదం ఉండదు. మూడేళ్ల పాటు ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి. ఆ తర్వాత మార్కెట్‌ ఒడిదుడుకులు, మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి విధానాలపై మీకు తగినంతగా అవగాహన వస్తుంది. అప్పుడు ఈ ఫండ్‌ నుంచి ఏదైనా బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌కు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మార్చుకోవచ్చు.



You may be interested

సొంతింటికి దారి ఇదీ..!

Monday 4th February 2019

- బడ్జెట్‌లో రియల్టీకి పలు ప్రయోజనాలు... - ఆదాయపన్ను పరంగానూ పెద్ద ఉపశమనం - సొంతింటికి ప్లాన్‌ చేసుకునేందుకు అనుకూలతలు - రుణం తీసుకోవాలంటే చూడాల్సినవి కొన్ని ఉన్నాయ్‌ - డౌన్‌ పేమెంట్‌, రుణ కాల ‍వ్యవధి, ఈఎంఐ కీలకం - పిల్లల ఉన్నత విద్య, అత్యవసరాలూ పరిగణనలోకి... ఇంటి కొనుగోలును ఆకర్షణీయం చేసే పలు నిర్ణయాలను మోదీ సర్కారు ఇటీవలి బడ్జెట్లో ప్రకటించింది. అందుబాటు గృహాలపై బిల్డర్లకు పన్ను రాయితీలను 2019-20 వరకు పొడిగించింది. అమ్ముడుపోకుండా ఉన్న

36,220 - 36778 శ్రేణిని ఎటు ఛేదిస్తే అటు

Monday 4th February 2019

కేంద్ర ప్రభుత్వం ప్రవేశేట్టిన మధ్యంతర బడ్జెట్‌లో పేద, మధ్యతరగతి ప్రజలపై వరాల జల్లు కురిసింది. ఈ బడ్జెట్‌ ప్రతిపాదనల అనంతరం లబ్దిపొందుతాయని అంచనావేస్తున్న ఆటో, కన్జూమర్‌ షేర్లు ర్యాలీ జరపగా, ద్రవ్యలోటు పెరుగుతుందన్న ఆందోళనలతో బాండ్లతో పాటు బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ షేర్లు క్షీణించాయి. మరోవైపు రూపాయి క్షీణత ఫలితంగా ఐటీ షేర్లు కూడా మెరుగుపడ్డాయి. రానున్న కొద్ది రోజుల్లో బడ్జెట్‌ రోజునాటి ట్రెండే కొనసాగే అవకాశం లేదు. మరో మరో

Most from this category