STOCKS

News


ఇంటర్నేషనల్‌ ఫండ్స్‌ మంచివేనా

Monday 14th January 2019
personal-finance_main1547451635.png-23573

ప్ర: ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లో ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ ప్లాన్‌ (ఎఫ్‌ఎమ్‌పీ)ల్లో ఇన్వెస్ట్‌ చేస్తే మంచిదే కదా ? ఈ విషయమై తగిన సూచనలివ్వండి.
-మృణాళిని, సికింద్రాబాద్‌
జ: ఎఫ్‌ఎమ్‌పీలు ఎప్పుడైనా  మంచి ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాలే.  ప్రస్తుతం ఇవి మంచి రాబడులనిస్తున్న మాట వాస్తవమే. కానీ వీటికి ఉన్న ఏకైక సమస్య లిక్విడిటీ. వీటికి లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. ఇవి స్టాక్‌ మార్కెట్లో లిస్టైనప్పటికీ, వీటి వాల్యూమ్స్‌ చాలా తక్కువగా ఉంటాయి. ​ట్రేడింగ్‌ చాలా మందంగా ఉంటుంది. ఒక నిర్దేశిత కాలానికి ఇన్వెస్ట్‌ చేసి, ఆ కాల పరిమితి పూర్తయిన తర్వాతనే మీరు డబ్బులు తీసుకునేట్లయితే, ఎఫ్‌పీఎమ్‌లు మంచి సాధనాలే. అలా కాకుండా ఇప్పుడు ఇన్వెస్ట్‌ చేసి, అవసరమైనప్పుడు తీసుకోవాలనుకుంటే కుదరదు. వడ్డీరేట్లలో హెచ్చుతగ్గుల నుంచి ఎఫ్‌ఎమ్‌పీలు మీరు రక్షణ కల్పిస్తాయి. మార్కెట్‌ రిస్క్‌ ప్రభావం తక్కువగానే ఉంటుంది. బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కంటే ఒకింత అధికంగా రాబడులు రావచ్చు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో పోల్చితే పన్ను ప్రయోజనాలూ పొందవచ్చు. ఎఫ్‌ఎమ్‌పీల్లో ఇన్వెస్ట్‌ చేసే ముందు స్కీమ్‌ ఇన్ఫర్మేషన్‌ డాక్యుమెంట్‌(ఎస్‌ఐడీ)ని క్షుణ్నంగా పరిశీలించండి. ఎఫ్‌ఎమ్‌పీని నిర్వహిస్తున్న మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ ట్రాక్‌ రికార్డ్‌ను కూడా మదింపు చేయండి. మీరు ఇన్వెస్ట్‌ చేయాలనుకున్న ఎఫ్‌ఎమ్‌పీ గత పనితీరు భవిష్యత్‌ రాబడులకు గ్యారంటీ ఇవ్వనప్పటికీ, సదరు ఫండ్‌ మేనేజర్‌ సామర్థ్యాన్ని మీరు అంచనా వేయవచ్చు.

ప్ర: ఎన్‌పీఎస్‌(నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌)లో తాజా మార్పుల కారణంగా పన్ను భారం  తగ్గుతుంది కదా! అందుకని రిటైర్మెంట్‌ కోసం ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం కన్నా ఎన్‌పీఎస్‌లోనే ఇన్వెస్ట్‌ చేయడం మంచిదని అనుకుంటున్నాను. నా నిర్ణయం సరైనదేనా ?
-శ్రీనివాస్‌, విశాఖపట్టణం
జ: నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌పీఎస్‌) ఇప్పుడు కొంచెం మెరుగైంది. తాజా మార్పుల ప్రకారం మీరు 60 సంవత్సరాల వయస్సులో రిటైరైతే, అప్పటివరకూ ఎన్‌పీఎస్‌లో పోగుపడిన మొత్తంలో 60 శాతం వరకూ మీరు  విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన 40 శాతం మొత్తంతో యాన్యుటీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక మీరు విత్‌డ్రా చేసుకునే 60 శాతం మొత్తంపై గతంలో కొంత వరకూ పన్ను చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడు ఎలాంటి పన్ను భారం ఉండదు. అయితే ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు, ఎన్‌పీఎస్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు చాలా తేడా ఉంది. మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు మీరే పూర్తిగా యజమాని. కానీ ఎన్‌పీఎస్‌లో అలా కాదు. ఎన్‌పీఎస్‌లో పోగుపడిన దాంట్లో 60 శాతం వరకూ మాత్రమే మీరు తక్షణం విడ్‌డ్రా చేసుకోగలరు. మిగిలిన 40 శాతం మొత్తంతో యాన్యుటీని కొనుగోలు చేయాలి. మ్యూచువల్‌ ఫండ్స్‌లో అయితే పెట్టుబడి కేటాయింపులు మీరు కోరుకున్న విధంగా చేసుకోవచ్చు. ఎన్‌పీఎస్‌లో పెట్టుబడుల కేటాయింపులకు పరిమితులుంటాయి. ఎన్‌పీఎస్‌లో ఒక ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే... నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉంటాయి.  దేశంలో అత్యంత తక్కువ నిర్వహణ వ్యయాలు ఉన్న ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనం బహుశా ఇదే. తాజా మార్పుల కారణంగా ఎన్‌పీఎస్‌ మెరుగుపడినప్పటికీ, మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై నిర్ణయాధికారం ఇతరులకు ఉంటుంది. అయితే రానున్న 10-15 ఏళ్లలో ఎన్‌పీఎస్‌ మరింతగా మెరుగుపడే అవకాశాలున్నాయి. అయితే ఇలాంటి పథకాలకు సంబంధించి  ఇంగ్లాండ్‌లో చాలా మార్పులు వచ్చాయి.  అక్కడ ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్‌ చేసినవాళ్లు...తమ అవసరాలకు అనుగుణంగా విత్‌డ్రాయల్‌ ప్లాన్‌ను మార్చుకోవచ్చు. రిటైరైన తర్వాత ఇన్వెస్టర్లు కావాలనుకుంటే ఎన్‌పీఎస్‌లో పోగుపడిన మొత్తాన్ని.. వంద శాతం వరకూ విత్‌డ్రా చేసుకోవచ్చు. కావాలనుకుంటేనే యాన్యుటీని కొనుగోలు చేయవచ్చు. యాన్యుటీ కొనుగోలు  తప్పనిసరి కాదు. ఇక మన దేశం విషయానికి వస్తే... ఎన్‌పీఎస్‌ తాజా మార్పులు.. చెప్పుకోదగిన మార్పులు కావని చెప్పవచ్చు. అయితే రానున్న రోజుల్లో మరిన్ని మార్పులు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

ప్ర: ఇంటర్నేషనల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే మంచిదేనా  ? ఇక్కడి మంచి మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో  ఇన్వెస్ట్‌ చేసి మంచి రాబడులు పొందవచ్చు కదా ?
-జాన్‌, బెంగళూరు

జ:   ఇంటర్నేషనల్‌ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయడానికి ముఖ్యమైన కారణాలు రెండు. మొదటిది నాణ్యమైన కంపెనీల్లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా మంచి రాబడులు సాధించడం.రెండోది...డైవర్సిఫికేషన్‌ ప్రయోజనాలు పొందడం.  ఇంటర్నేషనల్‌ ఫండ్స్‌ ద్వారా అమెజాన్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థల్లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. ఈ కంపెనీలు అమెరికా స్టాక్‌ మార్కెట్లో లిస్టయినప్పటికీ, అంతర్జాతీయంగా ఆదాయాన్ని ఆర్జిస్తాయి. మన దేశంలో కూడా దిగ్గజ కంపెనీలున్నాయి. కానీ, అమెజాన్‌, గూగుల్‌.. స్థాయి  దిగ్గజ కంపెనీలు లేవు కదా !  ఇంటర్నేషనల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల డాలర్‌తో రూపాయి మారకం క్షీణత ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఇంటర్నేషనల్‌ ఫండ్స్‌ల్లో ఒక్క రంగానికే చెందిన కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసే ఫండ్స్‌ ఉన్నాయి. వాటిని వదిలేయండి. భారత, విదేశీ ఫండ్స్‌ల్లో కూడా ఇన్వెస్ట్‌చేసే ఫండ్స్‌ ఉన్నాయి. వాటిని పరిశీలించవచ్చు. మీరు మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు కొత్త అయితే మీ పోర్ట్‌ఫోలియోలో కనీసం 10-20 శాతం పెట్టుబడులు ఇంటర్నేషనల్‌ ఫండ్స్‌లో ఉండేలా చూసుకుంటే మంచిది. మీరు ఇప్పటికే మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేస్తున్నవారైతే, మీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు 30-40 శాతం వరకూ ఉండొచ్చు.You may be interested

యాక్సిస్‌, ఐటీసీలో షేర్ల విక్రయం

Monday 14th January 2019

- 'సూటీ' వాటాలపై కేంద్రం యోచన న్యూఢిల్లీ: స్పెసిఫైడ్ అండర్‌టేకింగ్ ఆఫ్ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (సూటీ) ద్వారా యాక్సిస్‌ బ్యాంక్‌, ఐటీసీల్లో తనకున్న వాటాల్లో కొంత భాగాన్ని విక్రయించడంపై కేంద్ర ఆర్థిక శాఖ దృష్టి పెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. బల్క్ లేదా బ్లాక్ డీల్స్‌ రూపంలో ఇది ఉండొచ్చని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గతేడాది సెప్టెంబర్ 30 నాటికి సూటీకి యాక్సిస్ బ్యాంక్‌లో

2018లో ఇళ్ల విక్రయాల్లో 7 శాతం వృద్ధి

Monday 14th January 2019

హైదరాబాద్‌లో 17 శాతం పడిపోయిన అమ్మకాలు 9 ప్రధాన పట్టణాల్లో పరిస్థితులపై ప్రాప్‌ టైగర్‌ నివేదిక న్యూఢిల్లీ: నివాసానికి సిద్ధంగా ఉన్న ఫ్లాట్లకు డిమాండ్‌ నెలకొనడంతో... 2018లో ప్రముఖ పట్టణాల్లో ఇళ్ల విక్రయాలు మొత్తం మీద 7 శాతం పెరిగాయి. ప్రాప్‌ ఈక్విటీ అనే సంస్థ పరిశోధనలో ఈ వివరాలు తెలిశాయి. దేశవ్యాప్తంగా 9 పట్టణాల్లో కొత్త యూనిట్ల ప్రారంభం 22 శాతం తగ్గి గతేడాదిలో 1.46 లక్షల యూనిట్లకు పరిమితం అయ్యాయి.

Most from this category