STOCKS

News


సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ ఎఫ్‌పీఓ @ రూ.17,000 కోట్లు

Thursday 29th November 2018
personal-finance_main1543470617.png-22478

న్యూఢిల్లీ: సీపీఎస్‌ఈ ఎక్స్చేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌(ఈటీఎఫ్‌) ఫాలో ఆన్‌ ఆఫర్‌కు మంచి స్పందన లభించింది. వచ్చిన సబ్‌స్క్రిప్షన్‌లో రూ.17,000 కోట్ల వరకూ ప్రభుత్వం అంగీకరించే అవకాశాలున్నాయి.  సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ ఫాలోఆన్‌ ఆఫర్‌ (నాలుగో దఫా)ద్వారా రూ.8,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.  అదనంగా సబ్‌స్క్రిప్షన్‌ వస్తే, మరో రూ.6,000 కోట్లు,.... మొత్తం రూ.14,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావించింది. ఈ ఎఫ్‌పీఓ మంగళవారం మొదలై బుధవారం ముగిసింది. మొదటి  రోజే యాంకర్‌ ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 5.5 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయి రూ.13,300 కోట్ల మేర బిడ్‌లు వచ్చాయి. ఇక  బుధవారం వచ్చిన రూ.3,000 కోట్ల బిడ్‌లలో 95 శాతం వరకూ బిడ్‌లు రిటైర్మెంట్‌ ఫండ్స్‌, బీమా కంపెనీల నుంచే వచ్చాయి. మొత్తం వచ్చిన సబ్‌స్క్రిప్షన్‌లో రూ.17,000 కోట్ల వరకూ అట్టేపెట్టుకుంటామని ప్రభుత్వ ఉన్నతాధికారొకరు చెప్పారు. 
సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌లో 11 షేర్లు...
సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌లో మొత్తం 11 ప్రభుత్వ రంగ సంస్థల షేర్లున్నాయి. ఈ ఈటీఎఫ్‌లో ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, ఐఓసీ, ఆయిల్‌ ఇండియా, పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎన్‌టీపీసీ, ఎస్‌జేవీఎన్‌, ఎన్‌ఎల్‌సీ, ఎన్‌బీసీసీ కంపెనీల షేర్లున్నాయి. 2014లో కేంద్ర ప్రభుత్వం సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఈటీఎఫ్‌ ద్వారా మూడు దఫాలుగా రూ.11,500 కోట్లు సమీకరించింది. 2014, మార్చిలో రూ.3,000 కోట్లు, 2017, జనవరిలో రూ.6,000 కోట్లు, 2017, మార్చిలో రూ.2,500 కోట్లు సమీకరించగలిగింది.  కాగా ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.80,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకూ రూ.15,000 కోట్ల వరకూ సమీకరించగలిగిదంఇ. కోల్‌ ఇండియాలో వాటా విక్రయం ద్వారా రూ.5,300 కోట్లు, నాలుగు ప్రభుత్వ రంగ కంపెనీలు-రైట్స్‌, ఇర్కాన్‌, మిధాని, గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ ఐపీఓల ద్వారా రూ.1,700 కోట్లు రాబట్టగలిగింది. You may be interested

పీఎన్‌బీ నిర్వహణ ఎన్‌సీఆర్‌ చేతికి

Thursday 29th November 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలో మూడో అతిపెద్ద పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంక్‌ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) నిర్వహణ బాధ్యత ఎన్‌సీఆర్‌ కార్పొరేషన్‌ దక్కించుకుంది. మూడేళ్ల అగ్రిమెంట్‌లో పీఎన్‌బీ నగదు నిర్వహణ, కంటెంట్‌ మేనేజ్‌మెంట్, ఎలక్ట్రానిక్‌ జర్నల్‌ పుల్లింగ్, సైట్‌ మేనేజ్‌మెంట్, సాఫ్ట్‌వేర్‌ డిస్ట్రిబ్యూషన్‌ వంటి అన్ని రకాల సేవలందిస్తామని ఎన్‌సీఆర్‌ ఇండియా ఎండీ నఫ్‌రోజ్‌ దస్తూర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం పీఎన్‌బీకి దేశంలో 6,692 బ్రాంచీలు, 3600

మన్మోహన్‌ హయాంలో వృద్ధి రేటుకు కోత

Thursday 29th November 2018

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (యూపీఏ) ప్రభుత్వ హయాంలో జరిగినట్లు వెలువడిన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి గణాంకాలకు కేం‍ద్ర ప్రభుత్వం బుధవారం కోతపెట్టింది. ఈ తాజా గణాంకాలను చూస్తే, సంస్కరణలు ప్రారంభించిన అనంతరం దేశం ఎప్పుడూ రెండంకెల వృద్ధి సాధించలేకపోవడం గమనార్హం. పైగా వృద్ధి గణాంకాలు 9 శాతం దిగువకు పడిపోయాయి.   2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వెలువడిన ఈ తాజా గణాంకాలు రాజకీయ

Most from this category