STOCKS

News


ఫండ్స్‌లో నాలుగు నిర్ధారకాలు

Friday 10th August 2018
personal-finance_main1533903348.png-19150

పెట్టుబడులను సులభతరం చేసే వేదికే మ్యూచువల్‌ ఫండ్స్‌. కానీ, 2,000కు పైగా పథకాల నుంచి ఎంపిక చేసుకోవడం అన్నది కొత్త ఇన్వెస్టర్లకు కొరుకుడుపడని అంశమే. ఇటీవలి కాలంలో మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతున్న వారి సంఖ్యలో వేగవంతమైన వృద్ధి కనిపిస్తోంది. మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే ఆసక్తితో ఉన్న కొత్త ఇన్వెస్టర్లు పథకాల ఎంపిక ముందు నాలుగు అంశాలను అర్థం చేసుకోవాలి. దాంతో ఎంపిక సులభం అవుతుంది. అవేంటన్నది నిపుణులు తెలియజేస్తున్నారు.

 

డెట్‌ లేదా ఈక్విటీ

డెట్‌ ఫండ్స్‌లో లేదా ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలా అన్నది తెలుసుకోవాలి. ఈ రెండూ భిన్న అవసరాలను తీర్చేవి. డెట్‌ ఫండ్స్‌ తక్కువ రాబడులను స్థిరంగా ఇస్తాయి. తక్కువ రిస్క్‌, తక్కువ రాబడులతో ఉంటాయి. స్వల్ప కాలిక లక్ష్యాల కోసం ఇవి సరిపోతాయి. ఎందుకంటే స్వల్ప కాలిక అవసరాలకు రాబడుల కంటే పెట్టుబడులను కాపాడుకోవడం కీలకం. 

అదే ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ షేర్లలో ఇన్వెస్ట్‌ చేస్తాయి. అధిక రాబడులను ఇవ్వగలవు. కానీ అదే సమయంలో స్వల్ప కాలంలో ఎక్కువ ఆటుపోట్లకు గురవుతాయి. కనీసం ఐదేళ్లు అంతకంటే ఎక్కువ కాల వ్యవధి కోసం అనుకూలం. దీర్ఘకాలంలో ఈక్విటీ పెట్టుబడులపై నష్టాలు వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. మొదటి సారి ఇన్వెస్ట్‌ చేస్తున్న వారు, ఈక్విటీకి ప్రాధాన్యం ఇచ్చేట్టు అయితే బ్యాలన్స్‌డ్‌ ఫండ్స్‌ను ఎంచుకోవాలి. ఇవి 65 శాతం ఈక్విటీల్లోనూ, మిగిలిన మేర డెట్‌లో పెట్టుబడులు పెడతాయి. డెట్‌ విభాగం పెట్టుబడులు స్థిరత్వాన్ని ఇస్తాయి.

 

డైరెక్ట్‌ ప్లాన్‌ లేదా రెగ్యులర్‌ ప్లాన్‌

మ్యూచువల్‌ ఫండ్స్‌లో డైరెక్ట్‌, రెగ్యులర్‌ ప్లాన్‌ అని రెండు రకాలు ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్‌ లేదా ఏదైనా మధ్యవర్తిత్వ సంస్ధ ద్వారా కొనుగోలు చేస్తే అది రెగ్యులర్‌ ప్లాన్‌ అవుతుంది. ఫండ్‌ సంస్థ నుంచి నేరుగా కొంటే అది డైరెక్ట్‌ ప్లాన్‌ అవుతుంది. ఇందులో మధ్యవర్తులు ఎవరూ ఉండరు. ఈ రెండూ వేర్వేరుగా పనిచేయవు. పోర్ట్‌ఫోలియో కూడా ఒకటే. వాటి వ్యయాల్లోనే తేడా. డైరెక్ట్‌ ప్లాన్‌లో డిస్ట్రిబ్యూటర్లు ఉండరు కనుక కమీషన్లు చెల్లించక్కర్లేదు. దీంతో వ్యయాలు తక్కువ. రెగ్యులర్‌ ప్లాన్లలో మధ్యవర్తులకు కమీషన్లు చెల్లిస్తాయి సంస్థలు. దాంతో వాటిలో వ్యయాలు ఎక్కువ. అవగాహన తక్కువ ఉండి, మంచి గైడెన్స్‌ ఇచ్చే సంస్థల ద్వారా మొదట్లో రెగ్యులర్‌ ప్లాన్‌లను కొనుగోలు చేయవచ్చు. కొంత అవగాహన వచ్చిన తర్వాత డైరెక్ట్‌ ప్లాన్‌కు మారిపోవచ్చు.

 

గ్రోత్‌ లేదా డివిడెండ్‌

మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలు గ్రోత్‌, డివిడెండ్‌ ఆప్షన్‌తో ఉంటాయి. డివిడెండ్‌ ఆప్షన్‌ ఎంచుకుంటే క్రమం తప్పకుండా లాభాలను డివిడెండ్‌గా పంచుతుంటాయి. గ్రోత్‌ ఆప్షన్‌లో లాభాల పంపిణీ ఉండదు. దీంతో లాభాలు అలా వృద్ధి చెందుతూనే ఉంటాయి. రెగ్యులర్‌గా ఆదాయం అవసరం లేని వారు గ్రోత్‌ ఆప్షన్‌కు వెళ్లడమే మంచిది. 

 

క్లోజ్‌ ఎండెడ్‌, ఓపెన్‌ ఎండెడ్‌

ఓపెన్‌ ఎండెడ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలు కొనుగోలు, అమ్మకాలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. వీటికి నిర్ణీత కాల వ్యవధి అంటూ ఉండదు. వాటి రోజువారీ నెట్‌ అస్సెట్‌ వ్యాల్యూ (ఎన్‌ఏవీ) ఆధారంగా కొనుగోలు, అమ్మకం చేసుకోవచ్చు. క్లోజ్‌ ఎండెడ్‌ పథకాలనేవి కేవలం ‘న్యూ ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌వో)’ కాల వ్యవధిలోనే కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. కాల వ్యవధి తీరేంత వరకు పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు అవకాశం ఉండదు. అయితే, ఏదైనా అవసరం కోసం ముందుగానే వాటిని విక్రయించుకునేందుకు క్లోజ్‌ ఎండెడ్‌ పథకాలను స్టాక్‌ ఎక్సేంజ్‌లలో లిస్ట్‌ చేస్తున్నాయి. కానీ ట్రేడ్‌ అవుతున్నవి చాలా చాలా తక్కువే. కనుక ఇలా బయపడడం కష్టం.



You may be interested

ఐసీఐసీఐ బ్యాంకులో పెట్టుబడి రెట్టింపు అవుతుందా!?

Saturday 11th August 2018

ఐసీఐసీఐ బ్యాంకు వచ్చే రెండేళ్ల కాలంలో పెట్టుబడులపై నూరు శాతం లాభాన్ని ఇవ్వగలదంటే నమ్మశక్యంగా లేదా..? కానీ, ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ మాత్రం 100 శాతం వరకు లాభం ఇవ్వగలదని భావిస్తోంది. మొండి బకాయిల నుంచి వృద్ధి వైపు అడుగులు పడుతున్న క్రమంలో ఇది సాధ్యమేనంటోంది. ఈ స్టాక్‌లో వచ్చే రెండు మూడు త్రైమాసికాలు ఆటుపోట్లు ఉంటాయని, ఆ తర్వాత రిస్క్‌ రాబడులన్నవి సానుకూలంగా మారతాయని

ఆప్షన్‌ కొనుగోలుదారులు నష్టపోయేదెందుకు?

Friday 10th August 2018

ప్రపంచవ్యాప్తంగా 80-85 శాతం ఆప్షన్లు ప్రయోజనం లేకుండా ఎక్స్‌పైర్‌ అయ్యేవే. ఆప్షన్ల కొనుగోలు దారులు నష్టపోతుంటే, వాటిని అమ్మిన వారు నిజంగా లాభపడుతున్నారు. ఇందుకు రెండు కారణాలున్నాయి. ఆప్షన్లను కొనుగోలు చేసేవారు సాధారణంగా చిన్న ట్రేడర్లు. ఆప్షన్లను విక్రయించేది పెద్ద ఇనిస్టిట్యూషన్లు. ఆకర్షణీయంగా కనిపించే ఆప్షన్లు పూర్తి ధర పలుకుతాయి. డీప్‌ అవుట్‌ ఆఫ్‌ మనీ (ఎటీఎం) ఆప్షన్లు ఉపయోగం లేనివే. ఆప్షన్ల విక్రయదారులకే కాలం సానుకూలిస్తుంది.    ఆప్షన్ల కొనుగోలులో నష్టం

Most from this category