STOCKS

News


ఎంఎఫ్ నిర్వహణ ఆస్తుల్లో 12.5% క్షీణత

Tuesday 9th October 2018
personal-finance_main1539058956.png-20949

న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) పరిశ్రమ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ (ఏయూఎం) విలువ గత నెలలో తగ్గుదలను నమోదుచేసింది. ఈ ఏడాది సెప్టెంబరులో దేశీ 41 ఎంఎఫ్‌ల ఏయూఎం 12.5 శాతం క్షీణించి రూ.22 లక్షల కోట్లకు తగ్గినట్లు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) నివేదిక ద్వారా వెల్లడైంది. ఆగస్టు చివరినాటికి ఈ మొత్తం రూ.25.20 లక్షల కోట్లకు చేరుకుని రికార్డును నెలకొల్పగా... ఆ తరువాత నమోదైన మార్కెట్‌ భారీ పతనం కారణంగా లిక్విడ్‌ ఫండ్స్‌, ఇన్‌కం స్కీముల నుంచి ఒక్కసారిగా అవుట్‌ఫ్లో చోటు చేసుకుందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కాలంలో మనీ మార్కెట్‌ నుంచి రూ.2.11 లక్షల కోట్లు.. ఇన్‌కం స్కీమ్‌ (డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌) రూ.32,504 కోట్లు, గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నుంచి రూ.33 కోట్లు అవుట్‌ఫ్లో నమోదైంది. మరోవైపు ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్‌ స్కీమ్‌లలో (ఈఎల్‌ఎస్‌ఎస్‌) రూ.11,250 కోట్లు, బ్యాలెన్సెడ్‌ ఫండ్స్‌లో రూ.731 కోట్లు ఇన్‌ఫ్లో నమోదైనట్లు యాంఫీ వెల్లడించింది.


 



You may be interested

పేలవంగా అవాస్‌ ఫైనాన్షియర్స్‌ లిస్టింగ్‌

Tuesday 9th October 2018

న్యూఢిల్లీ: హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ ఆవాస్‌ ఫైనాన్షియర్స్‌ కంపెనీ షేర్లు స్టాక్‌ మార్కెట్లో సోమవారం పేలవంగా లిస్టయ్యాయి. ఈ షేర్‌ బీఎస్‌ఈలో ఇష్యూ ధర, రూ.821తో పోలిస్తే 8 శాతం నష్టంతో రూ.758 వద్ద లిస్టయింది. ఇంట్రాడేలో 14 శాతం నష్టంతో రూ.710కు పడిపోయింది. చివరకు 6 శాతం నష్టంతో రూ.773 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో 4.96 లక్షల షేర్లు, ఎన్‌ఎస్‌ఈలో 35 లక్షల ఈక్విటీ షేర్లు ట్రేడయ్యాయి. సోమవారం

రైతు మార్కెట్లలో కోల్డ్‌ స్టోరేజీలు

Tuesday 9th October 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: కూరగాయలు, పండ్ల హోల్‌సేల్‌ మార్కెట్లలో చిన్నపాటి శీతల గిడ్డంగుల ఏర్పాటుకు తాము సిద్ధమని చాంబర్‌ ఆఫ్‌ కోల్డ్‌ స్టోరేజెస్‌ ఇండస్ట్రీ వెల్లడించింది. ప్రభుత్వం స్థలం సమకూరిస్తే కోల్డ్‌ స్టోరేజీలను తాము సొంత ఖర్చుతో నిర్మిస్తామని చాంబర్‌ తెలంగాణ ప్రెసిడెంట్‌ గుబ్బ నాగేందర్‌ రావు చెప్పారు. ఇక్కడి హైటెక్స్‌లో నవంబరు 16-17 తేదీల్లో జరుగనున్న ఇండియా కోల్డ్‌ చైన్‌ ఎక్స్‌పో, ట్రేడ్‌ షో (ఐసీఈ) వివరాలను సోమవారం

Most from this category