STOCKS

News


యాంఫీ చైర్మన్‌గా నిమేష్ షా

Monday 15th October 2018
personal-finance_main1539581113.png-21149

న్యూఢిల్లీ: అసోసియేష‌న్ ఆఫ్ మ్యూచువ‌ల్ ఫండ్స్ ఇన్ ఇండియా(యాంఫీ) నూతన చైర్మన్‌గా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈవో నిమేష్ షా ఎంపికయ్యారు. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ ఎ.బాలసుబ్రమణ్యన్‌ స్థానంలో ఈయన్ని నియమించినట్లు యాంఫీ ప్రకటించింది. 2007 నుంచి మ్యూచువ‌ల్ ఫండ్స్ పరిశ్రమలో షా సేవలందిస్తున్నట్లు పేర్కొంది. ఇక వైస్‌ చైర్మన్‌గా ఎల్‌ అండ్‌ టీ మ్యూచువల్‌ ఫండ్‌ సీఈఓ కైలాష్ కులకర్ణి కొనసాగుతున్నట్లు తెలిపింది.



You may be interested

పెద్ద పట్టణాల్లో ఇళ్లకు డిమాండ్‌

Monday 15th October 2018

న్యూఢిల్లీ: దేశంలోని ఏడు పెద్ద పట్టణాల్లో ఇళ్లకు డిమాండ్‌ నెలకొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్‌)లో అమ్మకాలు 15 శాతం పెరిగాయి. డీమోనిటైజేషన్‌, జీఎస్టీ, రెరా తాలూకూ ప్రభావాల నుంచి ప్రాపర్టీ మార్కెట్‌ కోలుకుంటున్నట్టు అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెంట్స్‌ తెలిపింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబై మెట్రోపాలిటన్‌ ప్రాంతం, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌, పుణె నగరాల్లో కలిపి చూస్తే నివాస గృహాల విక్రయాలు ఈ ఏడాది జూలై-సెప్టెంబర్‌ కాలంలో

స్వల్ప, దీర్ఘకాల లక్ష్యాల కోసం... ఫ్రాంక్లిన్‌ ఇండియా అల్ట్రా షార్ట్‌ బాండ్‌ ఫండ్‌

Monday 15th October 2018

పెట్టుబడులపై రిస్క్‌కు భయపడేవారు, డెట్‌ సాధనాల్లోనూ కాస్తంత సురక్షితమైన సాధనం కోసం చూసే వారు ఫ్రాంక్లిన్‌ ఇండియా అల్ట్రా షార్ట్‌ బాండ్‌ ఫండ్‌ - సూపర్‌ ఇనిస్టిట్యూషనల్‌ ప్లాన్‌ను పరిశీలించొచ్చు. అధిక రేటింగ్‌ కలిగిన షార్ట్‌ టర్మ్‌ డెట్‌ ఇనుస్ట్రుమెంట్లలో పెట్టుబడులు పెడుతుంది. మనీ మార్కెట్‌ ఇనుస్ర్టుమెంట్లు, కమర్షియల్‌ పేపర్లు పోర్ట్‌ఫోలియోలో ఎక్కువ వాటాను ఆక్రమిస్తాయి. ఈ కేటగిరీలో గత పదేళ్ల కాలంలో టాప్‌ పథకాల్లో ఇదీ ఒకటిగా నిలిచింది.

Most from this category