STOCKS

News


బాండ్‌ ఫండ్స్‌లో మెరుగైన పనితీరు

Monday 21st January 2019
personal-finance_main1548049719.png-23690

బాండ్‌ ఫండ్స్‌లో మెరుగైన పనితీరు...(ఫండ్‌ రివ్యూ)
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఆల్‌ సీజన్స్‌బాండ్‌ ఫండ్‌

గత ఏడాది బాండ్‌ మార్కెట్‌ తీవ్రమైన ఒడిదుడుకులకు గురైంది. ఈ ఏడాది మాత్రం బాండ్‌ మార్కెట్‌ జోరుగానే ఉండొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. గత కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణం దిగివస్తోంది. మరోవైపు రేట్ల నిర్ణయం విషయంలో విధానాల మార్పు కారణంగా ఆర్‌బీఐ పాలసీ సరళంగానే ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతే కాకుండా బహిరంగ మార్కెట్‌ కార్యకలాపాల జోరును పెంచుతోంది. బహిరంగ మార్కెట్‌ కార్యకలాపాల్లో భాగంగా ఆర్‌బీఐ ప్రభుత్వ బాండ్లను జోరుగా కొనుగోలు చేస్తోంది. ... ఇవన్నీ బాండ్‌ మార్కెట్‌కు సానుకూలాంశాలే అని చెప్పవచ్చు. అయితే ఈ ఏడాది జనవరి-మార్చి ‍క్వార్టర్లో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అంచనాలను మించి మార్కెట్‌ రుణాలను సమీకరించనుండటం, కేంద్ర ప్రభుత్వ ద్రవ్య స్థితిగతులు, ద్రవ్యోల్బణ సంబంధిత రిస్క్‌లు ....ఇవన్నీ రానున్న నెలల్లో బాండ్‌ మార్కెట్‌పై ప్రభావం చూపే ప్రతికూలాంశాలు.

పరిస్థితులను బట్టి వ్యూహాలు...
ఇన్వెస్టర్లు ఒకింత రిస్క్‌ భరించగలిగేతే బాండ్‌ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. బాండ్ల ధరలు ర్యాలీ జరిపితే డైనమిక్‌ బాండ్‌ ఫండ్స్‌ లాభపడతాయి. డైనమిక్‌ బాండ్‌ ఫండ్స్‌కు వడ్డీరేట్ల హెచ్చుతగ్గులే కీలకం. ఇక ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఆల్‌ సీజన్స్‌బాండ్‌ ఫండ్‌  (గతంలో దీనిని ఐసీఐసీఐ ప్రుడె‍న్షియల్‌ లాంగ్‌ టర్మ్‌ ప్లాన్‌)గా వ్యవహిరించేవారు) విషయానికొస్తే,  వివిధ వడ్డీ రేట్ల కాలాల్లో  నిలకడైన రాబడులనిచ్చింది. 2014-2016 మధ్య కాలంలో ఈ ఫండ్‌ 16-19 శాతం రేంజ్‌లో రాబడులనిచ్చింది. లాంగ్‌టర్మ్‌ గిల్ట్‌ఫండ్స్‌ 2-3 శాతమే రాబడులనిచ్చిన 2017లో ఈ ఫండ్‌ 5 శాతం వరకూ రాబడినిచ్చింది. ఒడిదుడుకుల పరిస్థితుల్లో  బాండ్లు/డిబెంచర్లు/కమర్షియల్‌ పేపర్‌ వంటి సాధనాల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ కాలపరిమితిని సమర్థవంతంగా నిర్వహించడం,  పరిస్థితులు బాగా ఉన్నప్పుడు ర్యాలీలను క్యాష్‌ చేసుకోవడం వంటి వ్యూహాలను పాటించడం ద్వారా ఈ ఫండ్‌ నష్టాలను తగ్గించుకోగలిగింది. ఈ కేటగిరిలో ఫండ్స్‌ కంటే మెరుగైన రాబడులనివ్వగలిగింది. ఇక ఐదు, పదేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకున్నా, ఈ ఫండ్‌ వార్షిక రాబడులు 9-10 శాతం రేంజ్‌లో ఉన్నాయి. ఈ కాలంలో ఈ కేటగిరీ ఫండ్ల సగటు రాబడి దీనికంటే తక్కువగా వుంది. రెండు-మూడేళ్లు ఇన్వెస్ట్‌ చేయాలనుకునే ఇన్వెస్టర్లు ఈ డైనమిక్‌ బాండ్‌ ఫండ్‌ను పరిశీలించవచ్చు.

చురుకైన మెచ్యురిటీ మేనేజ్‌మెంట్‌
బాండ్ల ధరల అధారంగా డెట్‌ ఫండ్‌ ఎన్‌ఏవీ(నెట్‌ అసెట్‌ వేల్యూ) పెరగడం, తగ్గడం ఉంటుంది. వడ్డీరేట్ల కదలికలు బాండ్ల ధరలను ప్రభావితం చేస్తాయి. వడ్డీరేట్లు పెరిగితే, బాండ్ల ధరలు తగ్గుతాయి. అలాగే వడ్డీరేట్లు తగ్గితే బాండ్ల రేట్లు పెరుగుతాయి. కాలపరిమితి అధికంగా ఉండే బాండ్ల రాబడులు మరింత సున్నితంగా  ఉంటాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఆల్‌ సీజన్స్‌బాండ్‌ ఫండ్‌...
బాండ్లలో ఇన్వెస్ట్‌చేసే సగటు మెచ్యురిటీ కాలం 4-20 ఏళ్లుగాఉంది. గత ఏడాది జులై-అక్టోబర్‌ మధ్య ఈ సగటు మెచ్యురిటీ కాలం 1.5-2 సంవత్సరాలు గానూ, గత రెండు నెలల్లో 3-5 సంవత్సరాలు గానూ ఉంది.  మెచ్యురిటీ డ్యురేషన్‌ ఇంత యాక్టివ్‌గా ఉండటం వల్ల మధ్యంతర బాండ్‌ ర్యాలీ ప్రయోజనాలను ఈ బాండ్‌ అందిపుచ్చుకోవడమే కాకుండా ఈ కేటగిరీలో మంచి రాబడులనిస్తోన్న ఫండ్‌గా నిలుస్తోంది.You may be interested

అంతర్జాతీయ ట్రెండ్‌, ఫలితాలే ఆధారం

Monday 21st January 2019

- సోమవారం కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ ఫలితాలు - ఐటీసీ, మారుతీ సుజుకీ, ఎల్‌ అండ్‌ టీ ఫలితాలు ఈవారంలోనే.. - క్రూడ్‌, రూపాయి కదలికలపై దృష్టి.. న్యూఢిల్లీ: ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌–డిసెంబర్‌) కార్పొరేట్‌ ఫలితాలు.. దేశీ స్టాక్‌ సూచీలకు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు వెల్లడైన కంపెనీల ఫలితాలు పర్వాలేదనిపించుకోగా.. ఇండెక్స్‌ హెవీవెయిట్‌ అయిన ఐటీసీ ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే అంశంపై మార్కెట్‌

రుణానికి కొత్త రూటు.. పీ2పీ

Monday 21st January 2019

సులభంగా రుణాలు పొందే చోటు మరొకరికి రుణాలను ఆఫర్‌ చేయడానికీ ఇదే మార్గం ఒకరికి అవసరం.. మరొకరికి రాబడి పీర్‌ టు పీర్‌ (పీటూపీ) లెండింగ్‌కు 2018 మంచి ప్రోత్సాహకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. పీటూపీ సంస్థలను ఎన్‌బీఎఫ్‌సీలుగా ఆర్‌బీఐ గుర్తించి, లైసెన్స్‌లను మంజూరు చేసింది గతేడాదే. దీంతో క్రౌడ్‌ ఫండింగ్‌ వేదికలకు అధికారిక గుర్తింపు లభించింది. దేశంలో 2016 నాటికి 30కి పైగా పీటూపీ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, వీటిలో 11 సంస్థలకు గతేడాది

Most from this category