News


మంచి ‘ఫండ్స్‌’ ఎంపికకు వీటిని చూడాల్సిందే

Wednesday 24th October 2018
personal-finance_main1540362272.png-21439

మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే వారి సంఖ్య ఎప్పటికప్పుడు విస్తరిస్తూనే ఉంది. ముఖ్యంగా సిప్‌ మార్గంలోకి ఎక్కువ మంది అడుగుపెడుతున్నారు. మరి వందలాది ఫండ్స్‌ పథకాల్లో ఎంపిక ఆచితూచి ఉంటేనే, రాబడులు అంత మెరుగ్గా ఉంటాయని మర్చిపోవద్దు. ఎంత కాలం పాటు ఇన్వెస్ట్‌ చేస్తారు, పథకంలో ఉండే రిస్క్‌ స్థాయి ఇలా ఎన్నో అంశాలను చూడాల్సి ఉంటుంది. 

పనితీరు, పోటీ పథకాలతో సమీక్ష

ఓ పథకం రాబడులన్నవి... ప్రారంభ ఎన్‌ఏవీ ధర, ముగింపు ఎన్‌ఏవీ ధరల మధ్య వ్యత్యాసం ఆధారంగా పేర్కొనేవి. అందుకే  నిర్ణీత సమయంలో రాబడులు ఎలా ఉన్నాయి, లేదా భిన్న పథకాల మధ్య ఎలా ఉన్నదీ చూడాలి. ఓ పథకం ఎన్‌ఏవీ ఫలానా రోజు ఎంతున్నది చూడాలి. ఆరు నెలల తర్వాత, ఏడాది తర్వాత, రెండేళ్ల తర్వాత కూడా చూసి, శాతం వారీగా వ్యత్యాసం ఎంతన్నది గమనించాలి. అలాగే, డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్‌ పనితీరును, మరో డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్‌ పనితీరుతోనే పోల్చి చూడాలి. బెంచ్‌ మార్క్‌ రిటర్నులను కూడా చూడాలి. దాంతో బెంచ్‌ మార్క్‌ రాబడులతో పోల్చినప్పుడు పథకం రాబడులు ఎంతున్నాయనేది తెలుస్తుంది. ప్రతీ పథకం కూడా బెంచ్‌ మార్క్‌ రాబడులను ఇన్వెస్టర్లకు తెలియజేయడం తప్పనిసరి. 

వ్యయాలు

5-10 ఏళ్ల కాలం కోసం ఓ మ్యూచువల్‌ ఫండ్‌ పథకంలో ఇన్వెస్ట్‌ చేస్తున్నారనుకుంటే... చార్జీలపై తప్పకుండా కన్నేయాలి. పథకం ఎక్స్‌పెన్స్‌ రేషియో ఎంతున్నది చూడాలి. డైరెక్ట్‌ ప్లాన్లలో ఇది తక్కువ ఉంటుంది. అలాగే, కనీస పెట్టుబడి మొత్తం అన్నది పథకాన్ని బట్టి వేర్వేరుగా ఉంటుంది. 

పోర్ట్‌ఫోలియో టర్నోవర్‌

మ్యూచువల్‌ ఫండ్స్‌ పోర్ట్‌ఫోలియోలోని స్టాక్స్‌ కొనుగోలు, అమ్మకాన్ని ఈ టర్నోవర్‌ తెలియజేస్తుంది. అధిక టర్నోవర్‌ ఉందంటే తరచుగా ఆ పథకం అమ్మకాలు, కొనుగోలు చేస్తోందని అర్థం. దాంతో ఎక్స్‌పెన్స్‌ రేషియో కూడా పెరిగిపోతుంది. ఇది పథకం పనితీరుపైనా పడుతుంది. 

పెట్టుబడుల ఉద్దేశ్యం

ఓ పథకానికి, మరో పథకానికి మధ్య రిస్క్‌ అంశాలు వేర్వేరుగా ఉంటాయి. ఓ పథకం ఎంచుకునే ముందు, మీ లక్ష్యాలకు ఎంత కాలం ఉంది, ఎంత మేర రాబడులను ఆశిస్తున్నారు తదితర అంశాలపై స్పష్టత తెచ్చుకుని, అప్పుడు మీకు సరిపోలే పథకాలను ఎంచుకోవాలి. డైవర్సిఫైడ్‌ పోర్ట్‌ఫోలియోతో రిస్క్‌ తగ్గతుంది. అయితే, అందుకని పదుల సంఖ్యలో ఈక్విటీ పథకాలు అక్కర్లేదు. రెండు మూడు చాలన్నది నిపుణుల సూచన.

ఫండ్‌ మేనేజర్‌ ట్రాక్‌ రికార్డు

ఫండ్‌ మేనేజర్‌ పనితీరును ట్రాక్‌ చేయడం కూడా మంచి ఆలోచనే. ఓ పథకానికి దీర్ఘకాలంగా ఒకే మేనేజర్‌ కొనసాగుతున్నట్టయితే, గత పనితీరు ఆధారంగా, భవిష్యత్తు పనితీరు ఎలా ఉంటుందన్నది సులభంగా అంచనాకు రావచ్చు.

ఆర్థిక పరిస్థితులు

పథకాల పనితీరును విశ్లేషించే ముందు ఆర్థిక పరిస్థితులను పరిశీలించాలి. ఆర్థిక పరిస్థితులు కొంత కాలంగా ప్రతికూలంగా ఉంటే మ్యూచువల్‌ ఫండ్స్‌ పనితీరు ఆ కాలంలో మెరుగ్గా ఉండకపోవచ్చు. కనుక మార్కెట్‌ పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.



You may be interested

చల్లారిన చమురు ధరలు

Wednesday 24th October 2018

ప్రపంచమార్కెట్లో ముడిచమురు ధరలు మంగళవారం ఒక్కరోజులోనే 4శాతం వరకు పతనమయ్యాయి. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో తాజాగా సౌదీ అరేబియా తగినంత చమురును ఉత్పత్తి చేయనున్నట్లు ప్రకటించింది. అగ్రరాజ్యం అమెరికా ఇరాన్‌పై పలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఇరాన్‌ రోజుకు ఏడు లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి ఇప్పటికే తగ్గిపోగా.. వచ్చేనెల 4 నుంచి అమెరికా రెండో విడత ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. దీంతో  వచ్చే ఏడాదికల్లా ఇరాన్‌

షేర్‌ఖాన్‌ దిపావళీ స్టాక్స్‌

Wednesday 24th October 2018

దీపావళి వస్తోందంటే ప్రముఖ బోకరేజీ సంస్థల నుంచి స్టాక్స్‌ సిఫారసుల మోత మోగిపోతుంటుంది. రానున్న ఏడాది కాలంలో మంచి రాబడులకు అవకాశం ఉన్న స్టాక్స్‌ జాబితాను అవి ప్రకటిస్తుంటాయి. అన్నీ సక్సెస్‌ అవుతాయన్న నమ్మకం అయితే లేదు... కానీ, ఆయా సిఫారసుల్లోని మంచి స్టాక్స్‌ను ఎంపిక చేసుకోవడం ఇన్వెస్టర్లు చేయాల్సిన అసలైన పని. షేర్‌ఖాన్‌ ఈ సారి అందరికంటే ముందే సంవత్‌ 2075 పేరుతో స్టాక్స్‌ జాబితాను ప్రకటించేసింది. నిజానికి

Most from this category