STOCKS

News


అస్సెట్‌ అలోకేషన్‌ పక్కాగా ఉందా...?

Monday 4th March 2019
personal-finance_main1551638458.png-24409

ప్రతీ ఆదాయార్జన వ్యక్తి తన పెట్టుబడుల విషయంలో పక్కాగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వివిధ సాధనాలకు పెట్టుబడుల కేటాయింపు (అస్సెట్‌ అలోకేషన్‌ ) ఎంతన్నది ఎవరికి వారు తమ రిస్క్‌ సామర్థ్యాలు, రాబడుల ఆధారంగా నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఒకరి పోర్ట్‌ఫోలియోకు సంబంధించి అస్సెట్‌ అలోకేషన్‌ అన్నది ఓ చక్కని డైవర్సిఫికేషన్‌ (వైవిధ్యత) అని ఐడీఎఫ్‌సీ ఏఎంసీ మార్కెటింగ్‌ హెడ్‌ గౌరబ్‌ పరిజా పేర్కొ‍న్నారు. బాండ్లు, ఈక్విటీ, క్యాష్‌, కమోడిటీలు, రియల్‌ ఎస్టేట్‌ వంటివి ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. వీటిల్లో పెట్టుబడులను వర్గీకరించుకోవడం ద్వారా రిస్క్‌ను పరిమితం చేసుకోవచ్చని సూచించారు. 

 

చక్కని అస్సెట్‌ అలోకేషన్‌ అనేది రిస్క్‌ను పరిమితం చేసి, ఇన్వెస్టర్లు ఆకాంక్షలకు అనుగుణంగా అధిక రాబడులను ఇచ్చేది అయి ఉండాలని గౌరబ్‌ పరిజా పేర్కొన్నారు. అలాగే, సరైన సాధనం ఎంపికతోపాటు, వాటికి సరైన కేటాయింపులు (ఎంత శాతం పెట్టాలన్నది) అన్నవి కీలకమైనవిగా చెప్పారు. ‘‘భిన్న సాధనాలు, మార్కెట్‌, ఆర్థిక పరిస్థితులను బట్టి భిన్నంగా పనితీరు చూపిస్తాయి. భిన్న సాధనాల నుంచి రాబడులు ఒకే విధంగా కొనసాగవు. ప్రభుత్వ సెక్యూరిటీలు (జీ సెక్‌) ఏడాది కాలంలో 6.7 శాతం రాబడులను ఇచ్చాయి. అదే సమయంలో ఇందులో రిస్క్‌ 6.98 శాతం. ఈక్విటీల్లో పెట్టుబడులపై సగటు రాబడులు 18.36 శాతంగా ఉన్నాయి. ఇందులో రిస్క్‌ 27.71 శాతం. 90:10 చొప్పున ప్రభుత్వ సెక్యూరిటీలు, ఈక్విటీలకు పెట్టుబడులను కేటాయించినప్పుడు... రిస్క్‌ 6.63 శాతం ఉంటోంది. అదే జీసెక్‌, ఈక్విటీల కేటాయింపుల రేషియో 75:25 శాతం చొప్పున ఉంటే అప్పుడు సగటు రాబడులు 9.6 శాతం, రిస్క్‌ శాతం 10.94 శాతం. ఈక్విటీ కేటాయింపులు పెంచుకుంటూ వెళితే రిస్క్‌ కూడా అదే విధంగా అధికం అవుతుంది. జీసెక్‌కు కేటాయింపులు పెంచుకుంటే రిస్క్‌తోపాటు రాబడులు కూడా తక్కువగా ఉంటాయి’’ అని గౌరబ్‌ పరిజా వివరించారు. 

 

అయితే, డెట్‌-ఈక్విటీ పోర్ట్‌ఫోలియోతోపాటు డెట్‌, ఈక్విటీ, బంగారం పోర్ట్‌ఫోలియోను మిక్స్‌ చేసుకుఉంటే రిస్క్‌ చాలా వరకు తగ్గుతోందని గౌరబ్‌ చెప్పారు. ‘‘ఉదాహరణకు 80:20 శాతం చొప్పున డెట్‌, ఈక్విటీ కేటాయింపులపై సగటు రాబడులు 9.64 శాతం అయితే రిస్క్‌ 9.65 శాతం. దీనికి బదులు 80 శాతం డెట్‌, 10 శాతం ఈక్విటీ, 10 శాతం బంగారానికి కేటాయించుకుంటే రాబడులు 9.53 శాతం కాగా, రిస్క్‌ 5.63 శాతమే’’ అని గౌరబ్‌ తెలియజేశారు.



You may be interested

ఇన్వెస్ట్‌ చేస్తున్నది స్టాక్‌లో కాదు... కంపెనీలో: కేడియా

Monday 4th March 2019

స్టాక్స్‌, మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేస్తున్నదానికి బదులు... తాము పెట్టుబడి పెడుతున్నది ఓ కంపెనీలో అని భావిస్తే ఇన్వెస్టర్ల దృక్పథం వేరుగా ఉంటుందని ప్రముఖ ఇన్వెస్టర్‌, కేడియా సెక్యూరిటీస్‌ ఎండీ విజయ్‌ కేడియా సూచించారు. మార్కెట్ల తీరుతెన్నులపై ఆయన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను తెలియజేశారు.    అతి అనర్థదాయకమన్న ఓ నానుడిని కేడియా గుర్తు చేశారు. మార్కెట్లలో జరిగింది ఇదేనన్నారు. 2017లో స్టాక్స్‌ అతిగా పెరగడం వల్లే ఆ

దీర్ఘకాలం కోసం ఈ పీఎస్‌యూ కంపెనీలు!

Monday 4th March 2019

ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడులకు ఢోకా ఉండదన్న విషయం చాలా మంది ఇన్వెస్టర్లకు తెలిసిందే. ముఖ్యంగా ప్రభుత్వరంగంలోని మహారత్న, నవరత్న కంపెనీలకు ప్రభుత్వపరంగా మద్దతు, సహకారం ఎప్పుడూ ఉంటుంది. మంచి పనితీరుతో కూడిన పీఎస్‌యూ కంపెనీల్లో దీర్ఘకాలం కోసం పెట్టుబడులు పెట్టాలనుకునే వారు పరిశీలించతగిన స్టాక్స్‌ను పలువురు విశ్లేషకులు సూచిస్తున్నారు. ఆ వివరాలే ఇవి...   ‘‘ఇటీవలి దిద్దుబాటు నేపథ్యంలో ఫండమెంటల్స్‌ బలంగా ఉన్న పీఎస్‌యూ స్టాక్స్‌లో ఎంతో విలువ నెలకొని ఉంది. డివిడెండ్‌

Most from this category