STOCKS

News


స్లాబ్‌ మారకుండా పన్ను ఊరట ఎలా ?

Monday 18th February 2019
Markets_main1550473234.png-24242

 ప్ర: నేను గత ఏడేళ్ల నుంచి మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిప్‌(సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌)విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. ఇక ఇప్పటి నుంచి నేరుగా షేర్లలోనే ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. షేర్లలో నేరుగా ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?


జ: నేరుగా షేర్లలో ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు మూడు ముఖ్యమైన విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. మొదటిది. మీరు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్న కంపెనీ గురించి సమాచారం తెలుసుకోవాలి. రెండోది మ్యూచువల్‌ ఫండ్స్‌తో పోల్చితే షేర్లపై స్టాక్‌ మార్కెట్‌ ఒడిదుడుకుల ప్రభావం అధికంగా ఉంటుంది.  సాధారణంగా ఒక మ్యూచువల్‌ ఫండ్‌ పోర్ట్‌ఫోలియోలో 30-40 షేర్లు ఉంటాయి. పోర్ట్‌ఫోలియోలో షేర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల, డైవర్సిఫికేషన్‌ కారణంగా స్టాక్‌ మార్కెట్‌  ఒడిదుడుకుల ప్రభావం మ్యూచువల్‌ ఫండ్స్‌పై తక్కువగా ఉంటుంది. అదే మీరు షేర్లలో నేరుగా ఇన్వెస్ట్‌ చేస్తే ఒడిదుడుకుల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దీనిని తట్టుకోవడానికి సిద్ధపడితేనే మీరు షేర్లలో నేరుగా ఇన్వెస్ట్‌ చేయాలి.మూడోది మీ పోర్ట్‌ఫోలియోలో కనీసం 15-20 వరకూ షేర్లు ఉండాలి. ఈ షేర్లలో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయగలిగి ఉండాలి. ఇలా చేస్తేనే మీకు డైవర్సిఫికేషన్‌ ప్రయోజనాలు లభిస్తాయి. షేర్లలో ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు గుర్తించుకోవలసిన మరో కీలకమైన విషయం. ఒక షేర్‌ను కొనుగోలు చేయడానికి ఏది సరైన సమయమో గుర్తించడం, ఒక గొప్ప కంపెనీని అధ్వాన సమయంలో కొనుగోలు చేయడం కంటే, ఒక అధ్వాన కంపెనీ షేర్‌ను సరైన సమయంలో కొనుగోలు చేయడం కీలకం. షేర్లలో ఇన్వెస్ట్‌ చేస్తూ ఉంటే. అనుభవం మీద మీకు ఈ విషయమై అవగాహన వస్తుంది. అందుకని మీరు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్న దాంట్లో పది శాతాన్ని రెండేళ్ల పాటు  నేరుగా షేర్లలో ఇన్వెస్ట్‌ చేయండి. ఇంతే మొత్తాన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌లో కూడా ఇన్వెస్ట్‌ చేయండి. రెండు మార్గాల్లో రాబడులు ఎలా వచ్చాయో గమనించండి. మీకు ఒడిదుడుకులకు తట్టుకోగల ఓర్పు, కంపెనీలపై తగిన అవగాహన, స్టాక్‌ మార్కెట్‌ సంబంధిత అంశాలపై అధ్యయనం చేయడానికి తగిన సమయం... ఇవన్నీ ఉంటే నేరుగా షేర్లలో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. లేదంటే మంచి రేటింగ్‌ ఉన్న ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ కొనసాగించండి. 

ప్ర: బడ్జెట్‌లో ఆదాయపు పన్నుకు సంబంధించి వచ్చిన మార్పులేంటి ? ట్యాక్స్‌ స్లాబ్‌ల్లో మార్పులు లేకపోయినా, రూ. ఆరున్నర లక్షల వరకూ ఆదాయం ఉన్నా ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు కదా ! కొంచెం వివరిస్తారా ?


జ: మీకు ఆదాయం రూ. ఆరున్నర లక్షలుండి మీరు, రూ. లక్షన్నర వరకూ సెక్షన్‌ 80 సి కింద ఇన్వెస్ట్‌ చేసినట్లయితే మీరు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన పనిలేదు. మీ వాస్తవ ఆదాయం ఎంత అయినప్పటికీ, పన్ను ఆదాయం రూ.5లక్షలు దాటకపోతే, మీరు నయాపైసా పన్ను చెల్లించక్కరలేదు. పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పు లేదు. రూ.12,500 రిబేటు లభిస్తుంది. ప్రస్తుతమైతే రూ.2.5 లక్షల వరకూ పన్ను మినహాయింపు ఉంటుంది. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ ఆదాయం ఉంటే పన్ను బాధ్యత రూ.12,500. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఈ 12,500కు పూర్తి రిబేట్‌ను ప్రభుత్వం ఇస్తోంది. అంటే ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పనిలేదు. అయితే రూ. 6.5 లక్షలలోపు ఆదాయం ఉన్న వారందరికీ ఇది వర్తించదు. అన్ని మినహాయింపులు పోను మీ ట్యాక్సబుల్‌ ఇన్‌కమ్‌ రూ. 5 లక్షలు మించకూడదు. సెక్షన్‌ 80సీ కింద రూ. లక్షన్నర వరకూ ఇన్వెస్ట్‌ చేసి. ఎన్‌పీఎస్‌ కింద అదనంగా మరో రూ.50,000 ఇన్వెస్ట్‌ చేసిన పక్షంలో మీ వార్షిక ఆదాయం రూ.7 లక్షలు ఉన్నప్పటికీ, మీరు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పనిలేదు. వీటికి అదనంగా రూ. 2 లక్షల వరకూ గృహ రుణంపై వడ్డీని కూడా చెల్లిస్తున్నట్లయితే, మీ వార్షికాదాయం రూ.9 లక్షలున్నప్పటికీ, మీరు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పని లేదు. 

ప్ర: స్టాక్‌ మార్కెట్‌ పడిపోతున్నప్పుడు ఈక్విటీ ఫండ్స్‌లో సిప్‌ల ద్వారా ఇన్వెస్ట్‌  చేయడం ప్రారంభించాలని మిత్రులంటున్నారు. ఇది వాస్తవమేనా? 


జ: ఈక్విటీ ఫండ్స్‌లో సిప్‌ ద్వారా పెట్టుబడులు  పెట్టడానికి సరైన సమయం అంటూ ఏదీ ఉండదు. మార్కెట్‌ పతన బాటలో ఉన్నప్పుడైనా, జోరుగా లాభాలు సాధిస్తున్నప్పుడైనా సిప్‌లు మొదలు పెట్టవచ్చు. మార్కెట్‌ పతనమవుతున్నప్పుడు షేర్లను కొని, మార్కెట్‌ పెరుగుతున్నప్పుడు అమ్ముకోవడం అనేది మంచి ఐడియా, కానీ మార్కెట్‌ ఏ స్థాయి వరకూ పతనమవుతుందో, ఏ స్థాయి వరకూ పెరుగుతుందో ఎవరూ అంచనా వేయలేరు. అందుకని మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిప్‌ల ద్వారానే ఇన్వెస్ట్‌ చేస్తేనే దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందవచ్చు. మార్కెట్‌ పతనసమయంలో కూడా బెంబేలు పడకుండా సిప్‌లను కొనసాగించాలి. మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే,  ఏడాదికొక్కసారి ఇంక్రిమెంట్‌ వస్తుంది కదా ! అదే విధంగా సిప్‌ మొత్తాలను ప్రతి ఏడాది  పెంచాలి. ఏడాదికి కనీసం 10 శాతం వంతును పెంచితే సమంజసంగా ఉంటుంది. పిల్లల పైచదువులు, రిటైర్మెంట్‌ నిధి ఏర్పాటు, సొంత ఇల్లు సమకూర్చుకోవడం వంటి దీర్ఘకాలిక ఆర్థిక  లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో సిప్‌ద్వారా ఇన్వెస్ట్‌ చేయాలి.



You may be interested

నష్టాలు వచ్చాయా...? పన్ను ఆదా చేసుకోవచ్చు

Monday 18th February 2019

నష్టాలు వచ్చాయా...? పన్ను ఆదా చేసుకోవచ్చు... నష్టాల్లో ఎన్నో రకాలు ఇల్లు, వృత్తి లేదా వ్యాపారం, ఆదాయం, స్పెక్యులేషన్‌ ముందుగా ఆయా విభాగంలోనే సర్దుబాటు ఆ తర్వాత మిగిలిన విభాగాల్లో నష్టాలు ఇంకా మిగిలితే తర్వాతి సంవత్సరాలకు బదిలీ సకాలంలో రిటర్నులు వేయడం తప్పనిసరి ఆర్థిక సంవత్సరం చివర్లో ఆదాయపన్ను ఆదా కోసం వివిధ పెట్టుబడి సాధనాల గురించి అన్వేషించడం ఎక్కువ మంది చేసే పని. అయితే, పన్ను ఆదాకు ఇదొక్కటే మార్గం కాదు. పరిశీలిస్తే ప్రత్యామ్నయాలూ కనిపిస్తాయి. కనుక

తక్షణ మద్దతు శ్రేణి 35,510-35,375

Monday 18th February 2019

కొద్దినెలలుగా ప్రపంచ ట్రెండ్‌కు భిన్నంగా దేశీయ సూచీలు కదులుతూ వస్తున్నాయి. ఇదేరీతిలో గతవారం ప్రపంచ మార్కెట్లన్నీ కొద్దిపాటి హెచ్చుతగ్గులతో నెలల గరిష్టస్థాయి వద్ద ట్రేడవుతుండగా, భారత్‌ మార్కెట్‌ మాత్రం రెండు శాతంపైగా క్షీణించింది.  మరిన్ని కార్పొరేట్‌ గ్రూప్‌లు రుణాల చెల్లింపులో డిఫాల్ట్‌అయ్యే సంకేతాలు, మరో రెండు, మూడు నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలు ఇన్వెస్టర్ల ఆందోళనకు కారణం కావొచ్చు. మార్కెట్‌ ట్రెండ్‌ను నిర్దేశించే హెవీవెయిట్‌ షేర్లలో ఇన్ఫోసిస్‌ మినహా మిగిలినవన్నీ

Most from this category