STOCKS

News


లిక్విడ్‌ ఫండ్స్‌ కూడా నమ్మకాన్ని వమ్ము చేశాయ్‌!

Monday 1st October 2018
personal-finance_main1538392701.png-20763

తమ పొదుపు నిధులను బ్యాంకు ఖాతాలకు బదులు లిక్విడ్‌ ఫండ్స్‌లో ఉంచితే కాస్తంత అదనపు రాబడి వస్తుందని ఆశించిన వారి ఆశలు అడియాశలయ్యాయి. ఎందుకంటే ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ డిఫాల్ట్‌ సంక్షోభం ఈ ఏడాది కొన్ని లిక్విడ్‌ ఫండ్స్‌లో రాబడులను హరించి వేశాయి. లిక్విడ్‌ ఫండ్స్‌ అన్నవి సాధారణంగా రిస్క్‌ తక్కువ అన్న అభిప్రాయం ఉండేది. తాజా పరిణామాం దాన్ని తుడిచిపెట్టేసింది. లిక్విడ్‌ ఫండ్స్‌ షార్ట్‌ టర్మ్‌ డెట్‌ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. లిక్విడిటీ ఎక్కువ, అదే సమయంలో భద్రత కూడా కాస్తంత ఎక్కువగా భావిస్తుంటారు. కానీ, ఇప్పుడేమైంది..? నిజానికి మార్కెట్‌తో అనుసంధానమైన ప్రతీ సాధనంలోనూ స్వతహాగా రిస్క్‌ ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. 

 

సెప్టెంబర్‌ 10న కొన్ని లిక్విడ్‌ ఫండ్స్‌, అల్ట్రా షార్ట్‌ టర్మ్‌ ఫండ్స్‌ ఒక శాతానికి పైగా నష్టపోయాయి. ఆ తర్వాత వారాల్లో వీటి ఎన్‌ఏవీలు మరింత నష్టాలను చవిచూశాయి. ఒక్క రోజులోనే 5 శాతం ఎన్‌ఏవీ పడిపోవడం జరిగింది. ఎందుకంటే సెప్టెంబర్‌ 8న ఐఎల్‌ఎఫ్‌ఎస్‌కు చెందిన కమర్షియల్‌ పేపర్ల షార్ట్‌ టర్మ్‌ రేటింగ్‌ను క్రిసిల్‌ తగ్గించింది. 292 ఓపెన్‌ ఎండెడ్‌ డెట్‌ ఫండ్స్‌లో, 18 ఓపెన్‌ ఎండెడ్‌ డెట్‌ ఫండ్స్‌కు ఐఎల్‌ఎఫ్‌ఎస్‌లో ఆగస్ట్‌ చివరికి రూ.2,500 కోట్ల మేర పెట్టుబడులు ఉన్నాయి. వీటిలో కొన్ని లిక్విడ్‌ ఫండ్స్‌, అల్ట్రా షార్ట్‌ టర్మ్‌ ఫండ్స్‌ కూడా ఉన్నాయి. ఒక్క రోజులోనే పది ఫండ్స్‌ ఎన్‌ఏవీలు ఒక శాతానికి పైగా నష్టపోవడం అన్నది అసాధారణమేనన్నది నిపుణులు అభిప్రాయం. సెప్టెంబర్‌ 7 నుంచి అదే నెల 27వ తేదీ వరకు చూస్తే... ప్రిన్సిపల్‌ క్యాష్‌ మేనేజ్‌మెంట్‌ ఫండ్‌ 8 శాతం, మోతీలాల్‌ ఓస్వాల్‌ అల్ట్రా షార్ట్‌ టర్మ్‌ ఫండ్‌ 6 శాతం, ప్రిన్సిపల్‌ అల్ట్రా షార్ట్‌ టర్మ్‌ ఫండ్‌ 5.23 శాతం, యూనియన్‌ లిక్విడ్‌ ఫండ్‌ 3 శాతం, టాటా ఎస్‌టీ బాండ్‌ ఫండ్‌ 2.67 శాతం, టాటా కార్ప్‌ బాండ్‌ ఫండ్‌ 2.38 శాతం మేర ఎన్‌ఏవీలు నష్టపోయాయి. 

 

గడిచిన కొన్ని వారాల్లో చోటు చేసుకున్న పరిణామాలు గత తాలూకూ సంఘటనలను గుర్తుకు తెస్తున్నాయంటున్నారు మార్కెట్‌ పరిశీలకులు. గతంలో ఆమ్టెక్‌ ఆటో, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌, బల్లార్‌పూర్‌ ఇండస్ట్రీస్‌ క్రెడిట్‌ రేటింగ్‌లను తగ్గించినప్పుడు కూడా డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ రాబడులు గణనీయంగా ప్రభావితం అయ్యాయి. ఈ కంపెనీల డెట్‌ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేసిన జేపీ మోర్గాన్‌ ఇండియా ట్రెజరీ ఫండ్‌, జేపీ మోర్గాన్‌ షార్ట్‌ టర్మ్‌ ఇన్‌కమ్‌ ఫండ్‌ ఎన్‌ఏవీలు 1-3 శాతం మధ్యలో 2015 ఆగస్ట్‌లో నష్టపోయాయి. ఆ తర్వాత 2016 జనవరిలో జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ రేటింగ్‌ డౌన్‌ గ్రేడ్‌ అయిన సందర్భంలో... ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ మ్యూచువల్‌ ఫండ్‌, ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల ఎన్‌ఏవీలు ఒత్తిళ్లకు గురయ్యాయి.You may be interested

ఐఎమ్‌ఎఫ్‌ ప్రధాన ఆర్థికవేత్తగా గీతా గోపీనాధ్‌

Tuesday 2nd October 2018

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్‌ఎఫ్‌) ప్రధాన ఆర్థిక వేత్తగా భారత సంతతికి చెందిన గీతా గోపీనాధ్‌ నియమితులయ్యారు. ఈ ఏడాది చివర్లో రిటైరవుతున్న మౌరిస్‌ ఓస్ట్‌ఫెల్డ్‌ స్థానంలో ఆమె పదవీ బాధ్యతలు స్వీకరిస్తారని ఐఎమ్‌ఎఫ్‌ సోమవారం ఒక ట్వీట్‌ ద్వారా తెలియజేసింది. భారత్‌లో పుట్టి, పెరిగిన గీతా... ప్రస్తుతం హార్వర్డ్‌ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఢిల్లీ యూనివర్శిటీ నుంచి పట్టభద్రురాలైన ఆమె ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌, వాషింగ్టన్‌

అప్పుల ఊబికి ఐదు సంకేతాలు..

Monday 1st October 2018

ఈ సిగ్నల్స్‌ వస్తే రుణభారం మోయలేనట్లే లెక్క తక్షణ చర్యలు తీసుకోకుంటే అసలుకే మోసం వచ్చే ప్రమాదం... శ్రుతిమించిన అప్పులతో మితిమీరిన తిప్పలు వస్తాయి.. అందువల్ల ఎప్పటికప్పుడు రుణాలను కంట్రోల్‌లో ఉంచుకోవడం ఉత్తమం. ఒక్కోసారి పరిస్థితులు మన చేతిలో ఉండవు. అలాంటప్పుడు తలకుమించిన అప్పులు చేస్తాం. వీటిని సకాలంలో తీర్చగలిగితే ఓకే, లేదంటే రుణ ఊబిలోకి జారడం ఖాయం. మనం రుణాల అగాధంలో పడిపోతున్నామనేందుకు ఐదు సంకేతాలుంటాయని పర్సనల్‌ ఫైనాన్స్‌ నిపుణులు చెబుతున్నారు.

Most from this category