STOCKS

News


ఈక్విటీలను ‘సిప్‌’ చేస్తున్నారు

Thursday 10th January 2019
personal-finance_main1547104815.png-23505

దేశీయ హౌస్‌హోల్డ్‌ అసెట్స్‌లో క్రమంగా ఈక్విటీ పెట్టుబడుల వాటా పెరుగుతోంది. రిటైలర్లలో మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఆసక్తి కారణంగా గృహ పెట్టుబడుల్లో ఈక్విటీలు క్రమంగా మంచిస్థానం సంపాదించుకుంటున్నాయని ఆర్బీఐ, ఐఆర్‌డీఏ తదితర సంస్థల గణాంకాల ఆధారంగా సీఎల్‌ఎస్‌ఏ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలోని మొత్తం హౌస్‌హోల్డ్‌ అసెట్స్‌ విలువ 8.5 లక్షల కోట్ల డాలరు. ఇది జీడీపీ కన్నా మూడు రెట్లు అధికం. గతేడాదితో పోలిస్తే ఈ మొత్తం దాదాపు 9 శాతం పైన పెరిగింది. ఇందులో ఈక్విటీల వాటా 39100 కోట్ల డాలర్లు.

2008 తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ గృహస్థుల పెట్టుబడుల్లో ఈక్విటీ పెట్టుబడుల వాటా 4.6 శాతానికి చేరిందని తెలిపింది. 2014లో ఈ వాటా 2.2 శాతానికి పడిపోయింది. అప్పటి నుంచి క్రమంగా పెరుగుతూ వస్తోంది. అయితే ఈక్విటీ పెట్టుబడుల వాటా 2008 సంవత్సరంలో వాటాతో సమానమైనా, ప్రస్తుతం ఇన్వెస్ట్‌మెంట్‌ రూటు మారింది. గతంలో ఎక్కువ పెట్టుబడులు ప్రత్యక్షంగా రిటైలర్లు మార్కెట్లలో భాగస్వామ్యం వహించడం వల్ల వచ్చేవి. కానీ ఇప్పుడు ఎక్కువ ఈక్విటీ పెట్టుబడులు సిప్‌ మార్గంలో వస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం మార్కెట్లో ప్రత్యక్ష రిటైల్‌ పెట్టుబడుల వాటా దాదాపు 13.1 శాతం ఉండగా, గతేడాది ఈ వాటా 11.7 శాతానికి పడిపోయింది. మరోవైపు ఇదే సమయంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆధ్వర్యంలోని ఆస్తుల విలువ(ఏయూఎం) 7.5 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. గత డిసెంబర్‌లో సిప్‌ పెట్టుబడుల మొత్తం రూ.8200 కోట్లు. 2016 మార్చిలో సిప్‌ పెట్టుబడులు రూ. 3122 కోట్లు. అంటే రెండేళ్లలో సిప్‌ పెట్టుబడులు దాదాపు రెట్టింపయ్యాయి. దీనికితోడు గత నాలుగేళ్లలో ఎంఎఫ్‌ల్లోకి వస్తున్న నిధుల ప్రవాహం గత దశాబ్ద సరాసరి కన్నా చాలా ఎక్కువైంది. అలాగని ఈ ట్రెండ్‌ ఓవర్‌బాట్‌ స్థితిని చూపడం లేదని, కేవలం ఇన్వెస్టర్ల ఆలోచనలో వచ్చిన మార్పును చూపుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏటికేడు పెరుగుతున్న ఎంఎఫ్‌ల్లోకి నిధుల ప్రవాహం కారణంగా వచ్చే ఐదేళ్లలో గృహస్థుల పెట్టుబడుల్లో ఈక్విటీల వాటా క్రమంగా 9 శాతం వరకు చేరవచ్చని అంచనాలున్నాయి. 


SIP

You may be interested

ఆగని టాటా మోటార్స్‌ ర్యాలీ

Thursday 10th January 2019

 టాటామోటర్స్‌ షేర్ల ర్యాలీ ఆగడం లేదు. వరుసగా ఐదోరోజూ షేర్లు లాభాల పట్టాయి. బీఎస్‌ఈలో గురువారం మరో 2శాతం ర్యాలీ చేసింది. గతేడాదిలో కంపెనీ తన అనుబంధ సంస్థ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) రికార్డు స్థాయిలో జరిపిన విక్రయాలు.... షేర్ల ర్యాలీకి అండగా నిలిచాయి. నేడు బీఎస్‌ఈలో కంపెనీ షేరు రూ.183.65ల వద్ద ప్రారంభమైంది. జేఎల్ఆర్‌ 2018లో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిపినట్లు గణాంకాలు వెలువడంతో కంపెనీ

ప్రైవేట్‌ బ్యాంక్‌ షేర్ల క్షీణత: బ్యాంక్‌ నిఫ్టీ అరశాతం డౌన్‌..!

Thursday 10th January 2019

మార్కెట్‌ నష్టాల ట్రేడింగ్‌లో భాగంగా ఎన్‌ఎస్‌ఈ బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ అరశాతం క్షీణించింది. ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్‌ షేర్ల క్షీణత ఈ ఇండెక్స్‌ను నష్టాల్లోకి నెట్టింది. ఉదయం గం.11:30ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(27,577.35)తో పోలిస్తే 0.50శాతం(150పాయింట్ల) నష్టంతో 27577ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ ఇండెక్స్‌లోని ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ రంగానికి చెందిన ఇండస్‌ ఇండ్‌ 2శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం నష్టపోయాయి. అలాగే

Most from this category