STOCKS

News


ధీరేంద్రకుమార్‌ సూచించే ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌

Tuesday 26th March 2019
personal-finance_main1553624811.png-24811

ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌) వంటి దీర్ఘకాల పెట్టుబడులు భారీ రిటైర్మెంట్‌ నిధికి దారితీస్తాయని వ్యాల్యూ రీసెర్చ్‌ సంస్థ అధినేత ధీరేంద్ర కుమార్‌ సూచించారు. పన్ను ఆదా కోసం చివరి వరకు వేచి చూస్తుంటారని, ప్రణాళిక ప్రకారం ఈ పెట్టుబడులు ముందు నుంచే చేయడం మంచిదని సూచించారు. ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్‌ నుంచే సిప్‌ ఆరంభించాలన్నారు. పన్ను ఆదా కోసం చేసే పెట్టుబడులు 10-15-20 ఏళ్ల పాటు కొనసాగించగలిగితే వార్షిక సిప్‌ సైతం మంచిదేనన్నారు. దీర్ఘకాలంలో భారీ నిధి సమకూరుతుందని చెప్పారు. 

 

ఈఎల్‌ఎస్‌ఎస్‌లో ఇన్వెస్ట్‌ చేసే వారు...
‘‘రాబడుల అంచనాల ఆధారంగానే ఈక్విటీ పెట్టుబడులు ఉండాలి. చాలా ఫండ్స్‌ చక్కని వైవిధ్యంతో ఉన్నవే. రిస్క్‌ను అధిగమించి పనితీరు చూపిస్తున్నవే. స్వల్ప కాలంలో ప్రతికూల పనితీరును నేను పట్టించుకోను’’ అని ధీరేంద్ర కుమార్‌ వివరించారు. ఈఎల్‌ఎస్‌ఎస్‌లో చేసే పెట్టుబడులు మూడేళ్ల పాటు లాకిన్‌ ఉంటాయన్నది గుర్తుంచుకోవాలన్నారు. అదే ఓపెన్‌ ఎండెడ్‌ పథకం అయితే, అస్థిరతల సమయాల్లో భయంతో పెట్టుబడులను వెనక్కి తీసేసుకుంటారని... ఈఎల్‌ఎస్‌ఎస్‌లో ఈ అవకాశం ఉండదన్నారు. మూడేళ్ల పాటు కొనసాగడం వల్ల చివరికి సానుకూల రాబడులే ఉంటాయని తెలిపారు. ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌ ప్రతికూల సమయాల్లో చూపించిన పనితీరు పీపీఎఫ్‌ రాబడుల కంటే ఎక్కువేనన్నారు. కనుక స్వల్పకాల పనితీరు గురించి ఆందోళన చెందక్కర్లేదన్నారు. 

 

టాప్‌ ఫండ్స్‌
‘‘నాకు నచ్చిన కొన్ని ఫండ్స్‌ నుంచి రిస్క్‌ ఆధారిత రాబడుల్లో మెరుగ్గా ఉన్న నాలుగు ఫండ్స్‌ను షార్ట్‌ లిస్ట్‌ చేయమంటే... ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ట్యాక్స్‌ రిలీఫ్‌ 96, మిరే అస్సెట్‌ ట్యాక్స్‌ సేవర్‌, మోతీలాల్‌ ఓస్వాల్‌ లాంగ్‌టర్మ్‌, యాక్సిస్‌ లాంగ్‌ టర్మ్‌ ఈక్విటీ ముఖ్యమైనవి. మిరే అస్సెట్‌, మోతీలాల్‌ ఓస్వాల్‌ లాంగ్‌టర్మ్‌ ఈక్విటీ ఫండ్‌ రెండూ కొత్త పథకాలు. ఐదేళ్ల ట్రాక్‌ రికార్డు కూడా లేదు. అయితే, ఈ కాలంలో ఇవి రిస్క్‌ను సర్దుబాటు చేసుకుని మరీ మెరుగైన రాబడులను అందించాయి. మిరే అస్సెట్‌ అనేది చాలా అధిక నాణ్యతతో కూడిన పోర్ట్‌ఫోలియోతో ఉంది. 70 శాతం లార్జ్‌క్యాప్‌నకు కేటాయించింది. మార్కెట్లతోపాటు చాలా వేగంగా పనితీరులో ముందుంటుంది. మోతీలాల్‌ ఓస్వాల్‌ లాంగ్‌టర్మ్‌ అన్నది ఫోకస్‌ పోర్ట్‌ఫోలియోతో ఉంటుంది. యాక్సిస్‌ లాంగ్‌టర్మ్‌ ఈక్విటీ ఫండ్‌ దీర్ఘకాల చరిత్ర కలిగినది. ప్రధానంగా లార్జ్‌క్యాప్‌తో కూడుకున్న ఫండ్‌. కన్జర్వేటివ్‌ ఇన్వెస్టర్లకు మంచి పోర్ట్‌ఫోలియోతో ఉంటుంది. లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ అన్నీ బెంచ్‌ మార్క్‌ను మించి పనితీరు చూపించలేకపోతున్నాయి. అయినప్పటికీ ఈ పథకం బెంచ్‌ మార్క్‌ కంటే మెరుగైన ప్రదర్శన ఇస్తోంది. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ట్యాక్స్‌ రిలీఫ్‌ ఫండ్‌ అయితే ఎన్నో ఎత్తు పల్లాలు ఉన్నాయి. అయినా కానీ, మొత్తం మీద ఐదేళ్లు, ఏడేళ్ల కాలంలో గణనీయమైన రాబడులను ఇస్తుంది’’అని ధీరేంద్ర కుమార్‌ వివరించారు. You may be interested

స్వల్పంగా తగ్గిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Wednesday 27th March 2019

 క్రితం రోజు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైన అంతర్జాతీయ మార్కెట్లు తిరిగి కుదుటపడిన నేపథ్యంలో క్రితం రోజు భారీ ర్యాలీ జరిపిన భారత్‌ సూచీలు బుధవారం స్వల్ప తగ్గుదలతో లేదా ఫ్లాట్‌గా ప్రారంమయ్యే సంకేతాలిస్తూ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ స్వల్పంగా తగ్గింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.40  గంటలకు 8 పాయింట్ల నష్టంతో 11,502 పాయింట్ల వద్ద కదులుతోంది. మంగళవారం ఇక్కడ నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 11,510 పాయింట్ల వద్ద ముగిసింది. 

మిడ్‌క్యాప్‌లో రికవరీకి అవకాశం: ఎలారా

Tuesday 26th March 2019

మిడ్‌క్యాప్‌లో రికవరీకి అవకాశం ఉందని ఎలారా క్యాపిటల్‌ పేర్కొంది. చారిత్రక ధోరణలు, ధరలు, వ్యాల్యూషన్లు సౌకర్యంగా ఉండడంతో ఈ అంచనాకు వచ్చింది. లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే మిడ్‌క్యాప్‌ వ్యాల్యూషన్లు చారిత్రకంగా కనిష్ట స్థాయిలో ఉన్నాయని తెలిపింది. రోలింగ్‌, అబ్జల్యూట్‌ పరంగానూ ఇదే కనిపిస్తోందని పేర్కొంది. దీంతో మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో రికవరీ ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం వ్యాల్యూషన్ల పరంగా కొనుగోలు చేసుకోవడానికి అనుకూలంగా ఉన్న 20  మిడ్‌క్యాప్‌ కంపెనీలతో జాబితాను విడుదల చేసింది.    ఎలారా

Most from this category