STOCKS

News


హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ అనూహ్య నిర్ణయం

Wednesday 19th June 2019
personal-finance_main1560884687.png-26394

హెచ్‌డీఎఫ్‌సీ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఏఎంసీ) అనూహ్య నిర్ణయం తీసుకుంది. గడువు తీరిన ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ ప్లాన్ల(ఎఫ్‌ఎంపీ) నుంచి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు వెనక్కి తీసుకునేందుకుగాను రూ.500 కోట్ల కేటాయింపులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎస్సెల్‌ గ్రూపు కంపెనీల ఎన్‌సీడీల్లో హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ పలు పథకాల ద్వారా పెట్టుబడులు పెట్టింది. ఎస్సెల్‌ గ్రూపు కంపెనీలు తీవ్ర నిధుల సంక్షోభంలో చిక్కుకుపోవడంతో ఎన్‌సీడీలకు సకాలంలో చెల్లింపులు చేయలేకపోయాయి. వచ్చే సెప్టెంబర్‌ వరకు వేచి చూస్తే చెల్లింపులు చేస్తానంటూ పలు సంస్థలతో జీ గ్రూపు ప్రమోటర్లు ఓ అంగీకారం కూడా కుదుర్చుకున్నారు. అయితే, గడువు తీరిన హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ మ్యూచువల్‌ ఫండ్‌ ఎఫ్‌ఎంపీ ప్లాన్ల ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల కోసం ఎక్కువ కాలం వేచి ఉండరు కదా... అందుకే ఆ చెల్లింపుల భారాన్ని హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ తాను తీసుకున్నట్టు అయింది. 

 

ఎస్సెల్‌ గ్రూపునకు చెందిన ఎడిసియన్స్‌ ఇన్‌ఫ్రాపవర్‌ అండ్‌ మల్టీవెంచర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌, స్పిరిట్‌ ఇన్‌ఫ్రాపవర్‌ అండ్‌ మల్టీవెంచర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ జారీ చేసిన ఎన్‌సీడీల్లో హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఎఫ్‌ఎంపీ పథకాలు ఇన్వెస్ట్‌ చేశాయి. ఏప్రిల్‌లో గడువు తీరినప్పటికీ పెట్టుబడులను నగదుగా మార్చుకోలేకపోయింది. తాను చేసిన పెట్టుబడులు ఇప్పటికిప్పుడు తిరిగిరాని పరిస్థితి. అందుకే లిక్విడిటీ సర్దుబాటు కోసం హెచ్‌డీఎఫ్‌సీ ముందుకు వచ్చింది. ఆయా పథకాల తరఫున కొనుగోలు చేసిన ఎన్‌సీడీలను తను స్వయంగా కొనుగోలు చేయడం లేక తన పుస్తకాల పరిధిలోకి తీసుకోవడం చేస్తుంది. అలాగే, వచ్చే సెప్టెంబర్‌కు గడువు తీరే ఎఫ్‌ఎంపీ ప్లాన్లకూ ఇదే వర్తిస్తుంది. చెల్లింపుల కోసం ఎస్సెల్‌ గ్రూపు కూడా ఈ ఏడాది సెప్టెంబర్‌ వరకు గడువు కోరింది. అయితే, ప్రస్తుత విలువపైనే ఎఫ్‌ఎంపీలను హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ కొనుగోలు చేస్తుందా అన్న దానిపై స్పష్టత లేదు. 

 

హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌తోపాటు కోటక్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలు కూడా ఎస్సెల్‌ గ్రూపు కంపెనీల ఎన్‌సీడీల్లో ఇన్వెస్ట్‌ చేశాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో గడువు తీరినప్పటికీ ఇన్వెస్టర్లకు చెల్లింపులు చేయలేదు. హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ అయితే ఇన్వెస్టర్లకు రోలోవర్‌ లేదా మెచ్యూరిటీ గడువును పొడిగించునే ఆప్షన్లను ఇచ్చింది. గడువు తీరినా గానీ ఎఫ్‌ఎంపీ యూనిట్‌ హోల్డర్లకు చెల్లింపులు చేయకపోవడం (ఉపసంహరణకు వీలు కల్పించడం)తో సెబీ ఈ రెండు ఏఎంసీలకు ఇప్పటికే షోకాజు నోటీసులు కూడా జారీ చేయడం గమనార్హం. రానున్న మూడు నెలల్లో హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీకి సంబంధించి మరో ఐదు ఎఫ్‌ఎంపీలు కూడా గడువు తీరనున్నాయి. వీటన్నంటికీ కలిపి ఎక్స్‌పోజర్‌ రూ.430 కోట్లు ఉంటుందని అంచనా. ఈ పరిణామాల నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ తన బ్రాండ్‌ పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న నమ్మకాన్ని కాపాడుకునేందుకు భిన్నమైన నిర్ణయం తీసుకుంది. ఇలా చేయడం వల్ల తర్వాత కాలంలో సంబంధిత జీ గ్రూపు ఎన్‌సీడీలకు చెల్లింపులు జరగకపోతే అప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ స్వయంగా నష్టపోవాల్సి వస్తుంది. అలా జరిగితే హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ వాటాదారులపైనా ఆ ప్రభావం పడుతుంది.



You may be interested

11750ల పైన ప్రారంభమైన నిఫ్టీ

Wednesday 19th June 2019

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ బుధవారం లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 150 పాయింట్ల లాభంతో 39,176.56 వద్ద, నిఫ్టీ 56 పాయింట్లు పెరిగి 11,750.45 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. చైనాతో నెలకొన్న వాణిజ్య సమస్యల పరిష్కారం కోసం జీ - 20 సదస్సులో ఆ దేశాధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో చర్చలు జరుపుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ బుధవారం తెలిపారు. అలాగే ద్రవ్యోల్బణం వేగవంతం కాకపోతే, వడ్డీరేట్లపై

రూపాయికి ఆసియా కరెన్సీల లాభాల మద్దతు

Wednesday 19th June 2019

21 లాభపడి 69.70కి రూపాయి ముంబై: ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో వరుసగా మూడు ట్రేడింగ్‌ సెషన్లలో నష్టపోతూ వచ్చిన రూపాయి మంగళవారం కొంత కోలుకుంది. డాలర్‌ మారకంలో 21 పైసలు లాభపడి 69.70 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరల స్పీడ్‌ తగ్గడం, అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడ్‌ సమావేశం నేపథ్యంలో డాలర్‌ బలహీనత  వంటి అంశాలు తాజాగా రూపాయిపై ప్రభావం చూపాయి. దీనితో దేశీయంగా ఈక్విటీ మార్కెట్ల

Most from this category