STOCKS

News


సీపీఎస్‌ఈ 4వ ఇష్యూతో కేంద్రానికి రూ.14,000 కోట్లు

Tuesday 20th November 2018
personal-finance_main1542684602.png-22203

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వచ్చే వారం సీపీఎస్‌ఈ ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌ నాలుగో విడత జారీ ద్వారా రూ.14,000 కోట్లను సమీకరించనున్నట్టు ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ వర్గాలు తెలిపాయి. గత మూడు విడతల జారీల్లో కేంద్ర మొత్తం మీద రూ.11,500 కోట్ల మేర సమీకరించింది. నాలుగో విడత ఇష్యూ వచ్చే వారం ప్రారంభం అవుతుందని, ఇన్వెస్టర్లకు 3.5-4 శాతం వరకు తగ్గింపు లభిస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వం రూ.8,000 కోట్ల వరకు సమీకరించాలనుకుంటోందని, అవసరమైతే రూ.4,000-6,000 కోట్ల మేర అదనంగా సమీకరించే ‍గ్రీన్‌ షూ ఆప్షన్‌ కూడా కలిగి ఉంటుందని తెలిపాయి. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలతో కూడిన ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌ ఇది. ఇందులో గతంలో 10 కంపెనీలు ఉండగా తాజాగా వీటి సంఖ్య 11కు చేరింది. కొత్తగా ఎన్‌టీపీసీ, ఎస్‌జేవీఎన్‌, ఎన్‌ఎల్‌సీ, ఎన్‌బీసీసీ వచ్చి చేరాయి. ఇప్పటికే ఉన్న గెయిల్‌, ఇంజనీర్స్‌ ఇండియా, కంటెయినర్‌ కార్పొరేషన్‌ను ఇండెక్స్‌ ఫండ్‌ నుంచి ప్రభుత్వం తొలగించింది. ఈ కంపెనీల్లో కేంద్ర ప్రభుత్వం వాటా 55 శాతం లోపునకు తగ్గిపోవడంతో ఈ చర్య తీసుకుంది. ఇక సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌లో మిగిలిన ఇతర కంపెనీలు... ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, ఐవోసీ, ఆయిల్‌ ఇండియా, పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌. దీన్ని తొలిసారిగా 2014లో కేంద్రం ఏర్పాటు చేసింది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వ కంపెనీల్లో వాటాలను కొంత మేర గత మూడు విడతల జారీలో విక్రయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో వాటాల విక్రయం, పెట్టుబడుల ఉపసంహరణల ద్వారా రూ.80,000 కోట్లు సమీకరించాలన్నది సర్కారు లక్ష్యం.



You may be interested

రిటైల్‌ ఇన్వెస్టర్ల కోసం ఎన్‌ఎస్‌ఈ ‘జీ-సెక్‌’ ప్లాట్‌ఫామ్‌

Tuesday 20th November 2018

ముంబై: రిటైల్‌ ఇన్వెస్టర్లు ప్రభుత్వ సెక్యూరిటీలను సులభంగా కొనుగోలు చేయటానికి వీలుగా ఎన్‌ఎస్‌ఈ వెబ్‌ పోర్టల్‌తో పాటు మొబైల్‌ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘ఎన్‌ఎస్‌ఈ గోబిడ్‌’ పేరిట రూపొందించిన ఈ మొబైల్‌ అప్లికేషన్‌ను సెబీ చైర్మన్‌ అజయ్‌త్యాగి సోమవారం ముంబైలో ఆవిష్కరించారు. ట్రెజరీ బిల్లులు 91 రోజులు, 182 రోజులు, 364 రోజుల కాల వ్యవధి కోసం, ఇతర ప్రభుత్వ బాండ్లలో (ఏడాది నుంచి 40 ఏళ్ల కాల

వచ్చే నెల్లో టెల్కోలతో ట్రాయ్‌ భేటీ

Tuesday 20th November 2018

న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు, సంబంధిత వర్గాలతో టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) వచ్చే నెల్లో సమావేశం అవ్వాలని భావిస్తోంది. 2019లో చేపట్టబోయే అజెండాపై చర్చ ప్రధాన లక్ష్యంగా ఈ సమావేశం జరపాలని భావిస్తున్నట్లు ట్రాయ్‌ చైర్మన్‌ ఆర్‌ఎస్‌ శర్మ సోమవారం ఇక్కడ తెలిపారు. 

Most from this category