STOCKS

News


వన్నె తగ్గుతున్న గోల్డ్‌  ఈటీఎఫ్‌లు

Wednesday 28th November 2018
personal-finance_main1543390810.png-22443

న్యూఢిల్లీ: గోల్డ్‌ ఈటీఎఫ్‌ (ఎక్స్చేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌) ప్రభ మసకబారుతోంది. గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నుంచి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం కొనసాగుతూనే ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌- అక్టోబర్‌ కాలానికి ఇన్వెస్టర్లు గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నుంచి రూ.290 కోట్ల మేర పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్న పెట్టుబడులు రూ.422 కోట్లుగా ఉన్నాయి. మొత్తం మీద గోల్డ్‌ ఈటీఎఫ్‌లు వన్నె తగ్గుతున్నాయని అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌  ఫండ్స్‌ ఇన్‌ ఇండియా(ఆంఫీ) తాజా నివేదిక పేర్కొంది. మరోవైపు ఈక్విటీ, ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌(ఈఎల్‌ఎస్‌ఎస్‌)లో పెట్టుబడులు రూ.75,000 కోట్లకు పెరిగాయని ఈ నివేదిక తెలిపింది. ఒక్క అక్టోబర్‌లోనే ఈ ఫండ్స్‌లో రూ.14,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించింది. మొత్తం మీద ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-అక్టోబర్‌ కాలానికి మ్యూచువల్‌ ఫండ్స్‌లో నికరంగా రూ.81,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇంకా ఈ నివేదిక ఏం చెప్పిందంటే., 
♦ఈ  ఏడాది అక్టోబర్‌ నాటికి గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నిర్వహణ ఆస్తులు 8 శాతం తగ్గి రూ.4,621 కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలానికి ఈ ఆస్తులు రూ.5,017 కోట్లుగా ఉన్నాయి. 
♦ గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో గోల్డ్‌ ఈటీఎఫ్‌ల ట్రేడింగ్‌ అంతకంతకూ దిగజారుతూ వస్తోంది. 
♦ 2013-14లో రూ.2,293 కోట్లుగా ఉన్న గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నుంచి ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ2014-15లో రూ.1,475 కోట్లకు తగ్గింది. పెట్టుబడుల ఉపసంహరణ 2015-16లో రూ.903 కోట్లు, 2016-17లో రూ.775 కోట్లు, 2017-18లో రూ.835 కోట్లుగా ఉన్నాయి. 
♦ 2012-13లో మాత్రం గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లో నికరంగా రూ.1,414 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 
♦ గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో ఈక్విటీ మార్కెట్లో మంచి లాభాలు రావడంతో ఇన్వెస్టర్లు గోల్డ్‌ ఈటీఎఫ్‌లకు దూరంగా ఉంటున్నారు. 
♦ మరోవైపు పుత్తడిని భౌతికంగా ఉంచుకోవడానికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతారని, డీమ్యాట్‌ రూపంలో అంటే పెద్దగా ఆసక్తి ఉండదని నిపుణులంటున్నారు. 



You may be interested

మొబైల్‌ యూజర్లు @ 142 కోట్లు!

Wednesday 28th November 2018

న్యూఢిల్లీ: భారత్‌లో మొబైల్ సబ్‌స్క్రయిబర్ల సంఖ్య 2024 నాటికి 142 కోట్లకు చేరుకోనుంది. అప్పటికి 80 శాతం మంది యూజర్లు 4జీ సేవలను వినియోగించుకునే అవకాశముందని మంగళవారం విడుదల చేసిన నివేదికలో ఎరిక్సన్‌ మొబిలిటీ తెలియజేసింది. 2022 నుంచి భారత్‌లో 5జీ సేవలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని నివేదిక పేర్కొంది. "2020 నాటికల్లా 5జీ సర్వీసులను ప్రవేశపెడతామని భారత ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. ఈ సర్వీసుల వినియోగం 2022 నాటికి గానీ గణనీయ

ఇంజినీరింగ్‌ విద్యార్థులకు వెయ్యికి పైగా శామ్‌సంగ్‌ ఉద్యోగాలు

Wednesday 28th November 2018

న్యూఢిల్లీ: గృహోపకరణాల  దిగ్గజం శామ్‌సంగ్‌ ఇండియా వెయ్యికి పైగా ఇంజినీరింగ్‌ పట్టభద్రులకు ఉద్యోగాలినివ్వనున్నది. వీటిల్లో 300 మందిని వివిధ ఐఐటీల నుంచి తీసుకుంటామని శామ్‌సంగ్‌ ఇండియా హెడ్‌(హ్యుమన్‌ రిసోర్సెస్‌) సమీర్‌ వాధ్వాన్‌ తెలిపారు. వచ్చే నెల 1 నుంచి ఢిల్లీ, కాన్సూర్‌, బాంబే, మద్రాస్‌, ఖర్గపూర్‌, గౌహతి, రూర్కీ ఐఐటీల్లో ఉద్యోగ నియామకాలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కొత్త ఐఐటీలైన హైదరాబాద్‌, ధన్‌బాద్‌, రోపార్‌, ఇండోర్‌, గాంధీనగర్‌, పాట్నా, భువనేశ్వర్‌, మండి, జోధ్‌పూర్‌లతో

Most from this category