STOCKS

News


మెరుపు తగ్గిన గోల్డ్‌ ఈటీఎఫ్‌లు!

Tuesday 10th July 2018
personal-finance_main1531238933.png-18177

న్యూఢిల్లీ: బంగారం ధరలు పెద్దగా పెరగకపోవటంతో గోల్డ్‌ ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌లో (ఈటీఎఫ్‌) అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో రూ.146 కోట్ల మేర బంగారం ఈటీఎఫ్‌ల నుంచి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో బంగారం ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తుల విలువ 12 శాతం క్షీణించి రూ.4,567 కోట్లకు తగ్గింది. ఇది అంతకు ముందు ఏడాది జూన్‌ నాటికి రూ.5,174 కోట్లుగా ఉంది. ఏప్రిల్‌లో రూ.54 కోట్లు, మేలో రూ.38 కోట్లు, జూన్‌లో రూ.54 కోట్ల మేర ఉపసంహరణలు ఉన్నాయి. గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో బంగారం ఈటీఎఫ్‌ విభాగంలో పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతూనే రావటం గమనార్హం. 
2017-18లో రూ.835 కోట్లు, 2016-17లో రూ.775 కోట్లు, 2015-16లో రూ.903 కోట్లు, 2014-15లో రూ.1,475 కోట్లు, 2013-14లో రూ.2,293 కోట్ల మేర నిధులు గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నుంచి బయటకు వెళ్లిపోయాయి. ‘‘గత ఐదేళ్లుగా బంగారం ఈటీఎఫ్‌ల నుంచి పెట్టుబడులు వెనక్కి పోతూనే ఉన్నాయి. బంగారం ధరలు కొన్నేళ్ల ర్యాలీ తర్వాత 2011-12లో కొత్త గరిష్టాలకు చేరాయి. ఆ తర్వాత గణనీయంగా దిద్దుబాటుకు గురయ్యాయి. అప్పటి నుంచి ఔన్స్‌కు 1,100-1400 డాలర్ల మధ్య ట్రేడవుతున్నాయి’’ అని మార్నింగ్‌స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ భారత ఎండీ కౌస్తుభ్‌ బేలాపుర్కర్‌ చెప్పారు. ఇదే కాలంలో ఈక్విటీ మార్కెట్లు గణనీయంగా పెరిగాయని, దాంతో ఇన్వెస్టర్లు ఈక్విటీలపై దృష్టి పెట్టినట్టు చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ కాలంలో ఈక్విటీల్లోకి రూ.33,000 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. 



You may be interested

ఆస్ట్రేలియా వర్సిటీ ఫీజులు ఐసీఐసీఐలో చెల్లించొచ్చు!

Tuesday 10th July 2018

న్యూఢిల్లీ: భారతీయ విద్యార్థులు ఆస్ట్రేలియా వర్సిటీలకు ఆన్‌లైన్లో ఫీజులను చెల్లించే సదుపాయాన్ని ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ఆస్ట్రేలియాకి చెందిన వెస్ట్‌ప్యాక్‌ బ్యాంకింగ్ కార్పొరేషన్‌తో (వెస్ట్‌ప్యాక్) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఆన్‌లైన్ ఫీజుల చెల్లింపు సదుపాయం ముందుగా ‘లా ట్రోబ్’ యూనివర్సిటీలో అందుబాటులో ఉంటుందని, తర్వాత మిగతా వర్సిటీలు, కాలేజీలు కూడా అందుబాటులోకి వస్తాయని ఐసీఐసీఐ బ్యాంక్ ఈడీ విజయ్ చందోక్ తెలిపారు. ప్రత్యేక

రూ.300 కోట్ల వ్యక్తిగత రుణాలిస్తాం

Tuesday 10th July 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ ముత్తూట్‌ ఫైనాన్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.300 కోట్ల మేర వ్యక్తిగత రుణాలు జారీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇటీవలే వ‍్యక్తిగత రుణాల విభాగంలోకి ప్రవేశించిన ఈ సంస్థ... 2018 ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు రూ.30 కోట్లను కస్టమర్లకు అందించింది. అయిదేళ్లలో రూ.3,000 కోట్ల స్థాయికి ఈ విభాగాన్ని తీసుకెళతామని ముత్తూట్‌ ఫైనాన్స్‌ ఈడీ జార్జ్‌ ఎం అలెగ్జాండర్‌

Most from this category