STOCKS

News


మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి రూ.2.3 లక్షల కోట్లు అవుట్‌

Tuesday 9th October 2018
personal-finance_main1539023454.png-20937

సెప్టెంబర్‌ నెలలో దేశీయ మ్యూచువల్‌ ఫండ్స్‌కు పెద్ద ఎత్తున ఉపసంహరణలు ఎదురయ్యాయి. సుమారు రూ.2.3 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోగా, ఇందులో లిక్విడ్‌ ఫండ్స్‌ నుంచే రూ.2.11 లక్షల కోట్లు ఉండడం గమనార్హం. ఇన్‌కమ్‌ స్కీమ్స్‌ నుంచి రూ.32,504 కోట్లు, గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నుంచి రూ.33 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. దీంతో 41 మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తుల విలువ సెప్టెంబర్‌ చివరి నాటికి 12.5 శాతం క్షీణించి రూ.22.06 లక్షల కోట్లుగా ఉంది. ఆగస్ట్‌ చివరికి ఇది రూ.25.20 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. అంటే ఒక్క నెలలో ఉపసంహరణలు, ఆస్తుల విలువ తగ్గింపును లెక్కేసుకుని చూస్తే నికరంగా రూ.3.14 లక్షల కోట్లు తగ్గింది. 

 

లిక్విడ్‌ ఫండ్స్‌ అన్నవి స్వల్ప కాల సాధనాలైన ట్రెజరీ బిల్లులు, సర్టిఫికెట్‌ ఆఫ్‌ డిపాజిట్‌ తదితర సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. ఆరు నెలలు ఏడాదిలోపు అవసరాల కోసం, తాత్కాలికంగా ఇన్వెస్ట్‌ చేసుకునేందుకు అనువైనవని తెలిసిందే. సెప్టెంబర్‌లో ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం తర్వాత మార్కెట్లలో లిక్విడిటీ పరంగా ఆందోళనలు, సందేహాలు ఎక్కువైన విషయం చూశాం. బ్యాంకింగ్‌ రంగంలో లిక్విడిటీ కఠినతరం కావడంతో భారీగా ఉపసంహరణలు వచ్చినట్టు మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు. మార్కెట్‌ స్థిరపడిన తర్వాత లిక్విడ్‌ ఫండ్స్‌లోకి తిరిగి పెట్టుబడుల ప్రవాహం మొదలవుతుందని అంచనా వేస్తున్నట్టు యాంఫి సీఈవో ఎన్‌ఎస్‌ వెంకటేశ్‌ పేర్కొన్నారు. ఈక్విటీ, ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌) పథకాల్లోకి మాత్రం సెప్టెంబర్‌ మాసంలో నికరంగా రూ.11,250 కోట్ల పెట్టుబడులు తరలిరావడం విశేషం. బ్యాలన్స్‌డ్‌ ఫండ్స్‌లోకి రూ.731 కోట్లు వచ్చాయి. 



You may be interested

బోవోఐ ఆక్సా క్రెడిట్‌రిస్క్‌ ఫండ్‌ రూ.100 కోట్ల మాఫీ

Tuesday 9th October 2018

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ డిఫాల్ట్‌ దెబ్బకు బీవోఐ ఆక్సా క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్‌ రూ.100 కోట్లను నష్టపోయింది. అంటే, ఈ ఫండ్‌ ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ కమర్షియల్‌ పేపర్లలో గతంలో పెట్టుబడులు పెట్టింది. ఇందులో రూ.105 కోట్ల మేర ఈ అక్టోబర్‌ 29న గడువు తీరిపోనున్నాయి. ఈ మొత్తాన్ని తన పుస్తకాల్లో రైటాఫ్‌ (రద్దు) చేసింది. దీంతో ఈ ఫండ్‌ ఎన్‌ఏవీ అక్టోబర్‌ 5న 5.17 శాతం తగ్గిపోయింది. ‘‘ఏవైనా ఉపసంహరణలు ఎదురైతే అవి ప్రస్తుత

షాపింగ్‌కు ఫండ్‌ మేనేజర్లు రెడీ!

Monday 8th October 2018

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఇప్పటికే 12 శాతం వరకు పతనమయ్యాయి. స్టాక్‌ ధరలు తక్కువకు పడిపోతే కొనేందుకు మ్యూచువల్‌ ఫండ్స్‌ మేనేజర్లు నగదు నిల్వలతో సిద్ధంగా ఉన్నారు. మార్కెట్‌ మరింత దిద్దుబాటుకు గురైతే, బాగా ఆకర్షణీయ విలువలకు చేరిన స్టాక్స్‌ను వారు బుట్టలో వేసుకోవడం ఖాయం. ఇప్పటికే చాలా స్టాక్స్‌ ఆకర్షణీయ ధరలకు చేరాయి. స్థూల ఆర్థిక అంశాలు, రూపాయి, చమురు ధరల కదలికల ఆధారంగా మార్కెట్‌ ట్రెండ్‌ను వారు

Most from this category