News


క్యు3లో ఫండ్‌ మేనేజర్లు ఏం చేశారు?

Wednesday 23rd January 2019
personal-finance_main1548222360.png-23751

డిసెంబర్‌ త్రైమాసికంలో వివిధ మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్లు సరాసరి 194 కంపెనీల్లో వాటాలు పెంచుకున్నారు. గతేడాది భారీగా పతనమైన పలు స్టాకుల్లో ఎంఎఫ్‌లు కొనుగోళ్లు జరిపాయి. ఎక్కువ ఫండ్‌ మేనేజర్లు కాంట్రాబయింగ్‌ జరిపారు. నాణ్యమైన స్టాకులు బహిర్గత కారణాలతో పతనమైతుంటే వాటిలో పొజిషన్లు తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తుంటారు. ఫండ్‌ మేనేజర్లు ఈ విధానాన్ని పాటించి అశోక్‌ బుల్డ్‌కాన్‌, ఎన్‌సీసీ, కేఎన్‌ఆర్‌ కనస్ట్రక‌్షన్స్‌, ఒరియంట్‌ సిమెంట్‌, డిక్సన్‌ టెక్నాలజీ, అపోలోటైర్స్‌, ఎంఎం ఫోర్జింగ్‌, బీఈఎంఎల్‌, అహ్లువాలియా కాంట్రాక్ట్స్, సోలార్‌ ఇండస్ట్రీస్‌ తదితర కంపెనీల్లో వాటాలు పెంచుకున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 
మరోవైపు ఇదే త్రైమాసికంలో ఎంఎఫ్‌లు దాదాపు 117 కంపెనీల్లో వాటాలను తగ్గించుకున్నాయి. ఫండ్‌ మేనేజర్లు క్యు3లో విక్రయించిన స్టాకుల్లో భారత్‌ ఫైనాన్షియల్స్‌, అతుల్‌, ఎంసీఎక్స్‌, దివిస్‌ ల్యాబ్‌, అరబిందో ఫార్మా, సీఎల్‌ఎడ్యుకేట్‌, రేమండ్‌, మన్‌పసంద్‌ బెవరేజెస్‌, అర్వింద్‌ తదితరాలున్నాయి. అయితే ఫండ్‌ మేనేజర్లను గుడ్డిగా అనుసరించడం మంచిది కాదని రిటైల్‌ ఇన్వెస్టర్లకు నిపుణులు సలహా ఇస్తున్నారు. ఒకరిని అనుసరించేబదులు స్టాకుపై సొంత అధ్యయనం చేసి పెట్టుబడి పెట్టాలని సూచించారు. ఎందుకంటే ఒక్కో ఫండ్‌ జరిపే అమ్మకాలు, కొనుగోళ్లకు ఒక్కో పద్ధతి, ఒక్కో కారణం ఉంటుంది. వారివద్ద ఇప్పటికే ఉన్న పోర్టుఫోలియో ఆధారంగా ఫండ్‌ మేనేజర్లు వ్యవహరిస్తుంటారు. అందువల్ల వారిని గుడ్డిగా అనుకరించడం అంత మంచిదికాదని సూచన. 


 



You may be interested

ఐటీసీ ఫలితాలు.. ఏం చూడాలి?

Wednesday 23rd January 2019

ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం మూడో త్రైమాసిక ఫలితాలు బుధవారం విడుదల చేయనుంది. ఈ దఫా కంపెనీ బలమైన ఫలితాలు ప్రకటించవచ్చని అంచనాలున్నాయి. సిగిరెట్‌ వ్యాపారం మరింత పుంజుకుంటుందని, ఎఫ్‌ఎంసీజీ, హోటల్‌ వ్యాపారం జోరు కొనసాగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ త్రైమాసికంలో కంపెనీ షేరు దాదాపు 5 శాతం పతనమైంది. కంపెనీ నికరలాభం సరాసరిన 12 శాతం ఉండొచ్చని బ్రోకింగ్‌ సంస్థలు భావిస్తున్నాయి. అంచనాలు: - ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌: లాభంలో 13.8 శాతం వృద్ది. సిగరెట్‌

చమురు డిమాండ్‌లో రెండవస్థానానికి భారత్‌

Wednesday 23rd January 2019

- 2019పై ఉడ్‌ మెకెన్‌జీ నివేదిక న్యూఢిల్లీ: చమురు డిమాండ్‌ విషయంలో చైనాను ఈ ఏడాది భారత్‌ అధిగమించనుందని రిసెర్చ్‌ అండ్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ ఉడ్‌ మెకెన్‌జీ మంగళవారం విడుదల చేసిన తన నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం చమురు డిమాండ్‌ విషయంలో వరుస మూడు స్థానాల్లో అమెరికా, చైనా, భారత్‌ ఉన్నాయి. భారత్‌లో ఈ ఏడాది ఆటో ఫ్యూయెల్‌, ఎల్‌పీజీ వినియోగం గణనీయంగా పెరుగుతున్నట్లు పేర్కొన్న నివేదిక, ఈ కారణంగా చమురు

Most from this category