STOCKS

News


ఎంఎఫ్‌లకు ఉపసంహరణ ఒత్తిళ్లు

Wednesday 26th September 2018
personal-finance_main1537952211.png-20596

దేశీయ ఈక్విటీల్లో తాజా పతనం మ్యూచువల్‌ ఫండ్‌హౌస్‌లకు ఇబ్బందిగా మారుతోంది. గతంతో పోలిస్తే ఫండ్స్‌ నుంచి పాయింట్లు రిడీమ్‌ చేసుకొని నిధులు ఉపసంహరించుకునేవాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. మరోపక్క ఇప్పటివరకు ఇబ్బడిముబ్బడిగా వచ్చిన పెట్టుబడుల ప్రవాహాలు సన్నగిల్లుతున్నాయి. దీంతో ఎంఎఫ్‌ల్లోకి నిధుల ఇన్‌ఫ్లో కన్నా అవుట్‌ఫ్లో ఎక్కువయింది. కాని ఇప్పటికైతే పరిస్థితి పూర్తిగా అధ్వాన్నంగా మారలేదు. ఇన్‌ఫ్లో తగ్గినా స్థూల నిధుల ప్రవాహం మాత్రం పాజిటివ్‌గానే ఉంది. కాని ఇదే పరిస్థితి కొనసాగితే ఎంఎఫ్‌లకు మరింత ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుందని నిపుణుల అంచనా. ఆగస్టులో ఎంఎఫ్‌ల్లో స్థూల ఉపసంహరణ- స్థూల విక్రయాల నిష్పత్తి 65.9 శాతానికి చేరింది. గత రెండేళ్ల సరాసరి 55 శాతం కన్నా ఇది చాలా ఎక్కువ. ఎక్కువమంది రిటైలర్లు క్రమంగా తమ పెట్టుబడుల ఉపసంహరణకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఆగస్టులో మొత్తం 15వేల కోట్ల రూపాయల నిధులు ఎంఎఫ్‌ల నుంచి ఉపసంహరించుకున్నారు. గత ఐదు నెలల్లో ఇదే అధికం. ఇదే సమయంలో ఆగస్టులో ఈక్విటీ ఎంఎఫ్‌ల్లోకి కేవలం 7700 కోట్ల రూపాయల నిధులు మాత్రమే పెట్టుబడుల రూపంలో వచ్చాయి. 


ఎందుకిలా?
టాప్‌200 ఈక్విటీ ఎంఎఫ్‌ల్లో 80 శాతం పథకాలు ప్రధాన సూచీలతో పోలిస్తే ఈ ఏడాది అంతంతమాత్రపు ప్రదర్శన చూపాయి. గత పదేళ్ల కాలాన్ని లెక్కిస్తే టాప్‌ 200 ఫండ్స్‌లో 33 శాతం ఫండ్స్‌ ప్రధాన సూచీలతో పోలిస్తే పెద్దగా రాబడులు ఇవ్వలేదు. గతేడాది సిప్స్‌లో అధిక శాతం(137 పథకాల్లో 107) నెగిటివ్‌ రాబడులు ఇచ్చాయి. ఎంఎఫ్‌ల్లోకి వచ్చే ఇన్వెస్టర్లు సాధారణంగా వార్షిక రాబడులు లెక్కించుకొని ఎంటరవుతారు. ఈ ఏడాది ఎంఎఫ్‌ల రాబడులు పేలవంగా ఉండడంతో కొత్త పెట్టుబడులు రావడం లేదు. మరోవైపు సూచీల ఎర్నింగ్‌ ఈల్డ్స్‌కు బాండ్‌ ఈల్డ్స్‌కు మధ్య వ్యత్యాసం తగ్గుతూ వస్తోంది. అందువల్ల ఈక్విటీల కన్నా బాండ్స్‌ బెటరని కొందరు వాటిలో పెట్టుబడులకు మొగ్గుతున్నారు. ఇవన్నీ కలిసి ఎంఎఫ్‌ల్లోకి కొత్త పెట్టుబడులను మందగింపజేయడంతో పాటు ఉన్న మదుపరులు ఉపసంహరణకు దిగేలా ప్రేరేపిస్తున్నాయి. You may be interested

వేదాంత వెలుగులు

Wednesday 26th September 2018

అకస్మాత్తుగా వెల్లువెత్తిన కొనుగోళ్లతో బుధవారం మిడ్‌సెషన్‌ సమయానికి వేదాంత షేరు వెలుగులు విరజిమ్ముతోంది. నేడు ఎన్‌ఎస్‌ఈలో వేదాంత షేరు రూ.231.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ నష్టాల ట్రేడింగ్‌లో భాగంగా వేదాంత షేరు కూడా మిడ్‌సెషన్‌ వరకు స్తబ్దుగా ట్రేడైంది. అయితే, మధ్యాహ్నం సమయంలో తెలియని కారణాలతో ఈ కౌంటర్లో ఒక్కసారిగా కొనుగోళ్ల సందడి మొదలైంది. ఫలితంగా షేరు 6.50శాతం ర్యాలీ చేసిన రూ.245.00ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.

ఈ ఐపీఓలకు ఏమైంది..?

Wednesday 26th September 2018

ప్రైమరీ మార్కెట్‌లో సందడి చేసిన అనేక కంపెనీల ఐపీఓలు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) సెకండరీ మార్కెట్‌కు వచ్చే సరికి చతికిలపడిపోతున్నాయి. పలు సంస్థల ప్రకటనలు మూలధన సమీకరణకే పరిమితమైపోతున్నాయి. ఐసీఓ సమయంలో అది చేస్తాం, ఇది చేస్తాం.. కంపెనీ సమర్థత ఓ స్థాయిలో ఉందని చెప్పి ఓవర్‌ వాల్యుయేషన్స్‌ కట్టుకున్న అనేక కంపెనీల అసలు రంగు నెమ్మదిగా బయటపడుతోంది. గతేడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు రూ.500 కోట్లకు మించి నిధులను

Most from this category