STOCKS

News


ఫ్రాంక్లిన్ టెంపుల్టన్‌ నుంచి ఆల్టర్నేటివ్ ఫండ్‌...

Monday 13th August 2018
personal-finance_main1534136335.png-19200

ఫ్రాంక్లిన్ టెంపుల్వ్‌ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్స్ (ఎఫ్‌టీఏఐ) తాజాగా తమ తొలి ఫండ్ 'ఫ్రాంక్లిన్ ఇండియా లాంగ్ షార్ట్ ఈక్విటీ ఏఐఎఫ్‌'ను ప్రవేశపెట్టింది. పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్‌పై అవగాహన ఉండి, ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాల్లో మరింతగా ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికోసం దీన్ని ఉద్దేశించినట్లు  ఎఫ్‌టీఏఐ ప్రెసిడెంట్ నాగనాథ్ సుందరేశన్ తెలిపారు. దేశీ సంస్థల ఈక్విటీ, డెరివేటివ్స్‌ మొదలైన వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మధ్య, దీర్ఘకాలానికి మెరుగైన రాబడులు అందించడం, పెట్టుబడుల విలువ పెరిగేలా చూడటం ఈ ఫండ్ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఫండమెంటల్‌, టెక్నికల్ విశ్లేషణల మేళవింపుతో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుందని తెలిపారు.  



You may be interested

13 శాతం పెరిగిన అమర రాజా లాభం

Monday 13th August 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: జూన్‌ త్రైమాసికంలో అమర రాజా బ్యాటరీస్‌ నికరలాభం క్రితంతో పోలిస్తే 13 శాతం పెరిగి రూ.113 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.1,685 కోట్ల నుంచి రూ.1,792 కోట్లకు ఎగసింది. 65 లక్షల యూనిట్ల వార్షిక తయారీ సామర్థ్యంతో రూ.700 కోట్లతో నెలకొల్పనున్న ఆటోమోటివ్‌ బ్యాటరీ ప్లాంటుకై బోర్డు అనుమతించిందని కంపెనీ సీఈవో ఎస్‌.విజయానంద్‌ తెలిపారు. 

జెట్ ఎయిర్‌వేస్‌పై డీజీసీఏ ఆడిట్‌

Monday 13th August 2018

ముంబై: సమస్యలతో సతమతమవుతున్న జెట్ ఎయిర్‌వేస్‌ ఆర్థిక పరిస్థితులపై ఆడిట్ నిర్వహించేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సిద్ధమవుతోంది. ఆగస్టు 27 నుంచి ఆడిట్ నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఎయిరిండియా ఆడిట్ పూర్తి అయినట్లు వివరించాయి. ఎగిసిన ముడిచమురు ధరలు, చౌక విమాన చార్జీలతో జెట్ ఎయిర్‌వేస్ ఆర్థిక పరిస్థితులు దిగజారడం, త్రైమాసిక ఫలితాల వెల్లడిని వాయిదా వేయడం తెలిసిందే.   

Most from this category