News


క్యాష్‌లెస్‌ చెల్లింపులపై ఫ్లిప్‌కార్ట్‌ అదనపు డిస్కౌంట్‌

Tuesday 22nd January 2019
personal-finance_main1548096745.png-23708

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ తన ప్లాట్‌ఫామ్‌పై డిజిటల్‌ చెల్లింపుల కొనుగోళ్లను పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. స్మార్ట్‌ఫోన్లు, గృహోపకరణాలు, వస్త్రాలు సహా అన్ని విభాగాల్లో కొనుగోళ్లకు డిజిటల్‌ రూపంలో పేమెంట్‌ చేస్తే అదనంగా 5 శాతం తగ్గింపు ఇస్తోంది. డెబిట్‌ కార్డు/ క్రెడిట్‌కార్డు/ నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా ఈ నెల 11-31వ తేదీల మధ్య కొనుగోళ్లకు చెల్లింపులు చేస్తే 5 శాతం డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్టు అమ్మకందారులకు ఇచ్చిన సమాచారంలో ఫ్లిప్‌కార్ట్‌ పేర్కొంది. కనీస కొనుగోళ్ల విలువతో సంబంధం లేకుండా ఈ తగ్గింపు ఇవ్వనుంది. అలాగే, ఒక కస్టమర్‌ ఒకటికి మించిన లావాదేవీలపైనా ఈ ఆఫర్‌ పొందొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌ తన మొబైల్‌ వ్యాలెట్‌ ‘ఫోన్‌ పే’ చెల్లింపులపై ఈ ఆఫర్‌ ఇ‍వ్వకపోవడం గమనార్హం. ఫ్లిప్‌కార్ట్‌ లావాదేవీల్లో 90 శాతం క్యాష్‌ ఆన్‌ డెలివరీవే ఉంటున్నాయి. నగదు నిర్వహణకు అవుతున్న ఖర్చు ఆన్‌లైన్‌ లావాదేవీలతో పోలిస్తే ఎక్కువగా ఉంటోంది. దీంతో ఈ ఖర్చు తగ్గించుకునేందుకు ఫ్లిప్‌కార్ట్‌ ఈ ఆఫర్‌ తీసుకొచ్చింది.You may be interested

ఐఐఎఫ్‌ఎల్‌ ఎన్‌సీడీ ఇష్యూ... ఎంతో ఆకర్షణీయం!

Tuesday 22nd January 2019

ఇండియా ఇన్ఫోలైన్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (ఐఐఎఫ్‌ఎల్‌) ఎన్‌సీడీ ఇష్యూ ఈ నెల 22న ప్రారంభం కాబోతుంది. ఈ నెల మొదట్లో మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ ఎన్‌సీడీలు ప్రారంభమయ్యాయి. తాజాగా వీటి సరసన ఐఐఎఫ్‌ఎల్‌ ఎన్‌సీడీ కూడా చేరింది. అయితే, ఈ కంపెనీ ఆకర్షణీయమైన వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తుండడం ఆసక్తికరం. ఈ నేపథ్యంలో ఈ ఎన్‌సీడీలో ఇన్వెస్ట్‌ చేసుకోవడంపై అనలిస్టుల అభిప్రాయాలు ఇలా

నెల రోజులకు పది సిఫార్సులు

Monday 21st January 2019

వచ్చే నెల రోజుల్లో దాదాపు 15 శాతం వరకు రాబడినిచ్చే పది స్టాకులను ప్రముఖ అనలిస్టులు రికమండ్‌ చేశారు. 1. హిండాల్కో: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 240. స్టాప్‌లాస్‌ రూ. 199. చార్టుల్లో లోయర్‌లో క్యాండిల్స్‌ ఏర్పరచడం ఆగిపోయింది. డైలీ ఆర్‌ఎస్‌ఐ బుల్లిష్‌ క్రాసోవర్‌ జరిపింది. రూ. 200 స్థాయి వద్ద మద్దతు దొరుకుతోంది. ఇండికేటర్లు అప్‌మూవ్‌ సంకేతాలు ఇస్తున్నాయి. 2. వోల్టాస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 557. స్టాప్‌లాస్‌ రూ. 525.

Most from this category