STOCKS

News


పతనాలకు వెరవని ఈక్విటీ ఫండ్స్‌ ఇన్వెస్టర్లు

Sunday 14th October 2018
personal-finance_main1539540804.png-21141

మార్కెట్లలో కరెక్షన్‌ సాధారణంగా రిటైల్‌ ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తుంది. మార్కెట్‌ ర్యాలీల్లో ఇన్వెస్ట్‌ చేసేందుకు మొగ్గు చూపే ఇన్వెస్టర్లు, పతనాల్లో మాత్రం దూరం ఉంటుంటారు. అంతేకాదు ఉన్నదంతా ర్యాలీల్లో ఇన్వెస్ట్‌ చేసి, కరెక్షన్‌లో భయపడి అమ్ముకునే వారు కూడా ఉన్నారు. కానీ, ఇటీవలి కాలంలో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్టర్లలో పరిణతి కనిపిస్తోంది. మార్కెట్‌ కరెక్షన్లు చూసి రిటైల్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్టర్లు భయపడడం లేదు సరికదా, అదనంగా పెట్టుబడులు పెట్టే పరిస్థితికి వచ్చింది. చాలా మంది ఇన్వెస్టర్లు ఏక మొత్తంలో, సిప్‌ ద్వారా మార్కెట్లు పడిపోయిన సందర్భాల్లో ఈక్విటీ ఫండ్స్‌లో తమ పెట్టుబడులను కొనసాగిస్తున్నారు. గడిచిన మూడున్నరేళ్ల కాలంలో మార్కెట్లు 8 శాతానికి పైగా దిద్దుబాటుకు గురైన ప్రతీసారీ... మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులను కొనసాగించడమే కాకుండా, అదనపు పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది.  

 

మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ గణాంకాల ప్రకారం... ఈ ఏడాది సెప్టెంబర్‌లో మార్కెట్లు కరెక్షన్‌కు గురికాగా, ఈ సమయంలో రూ.11,903 కోట్లను ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టారు. ఆగస్ట్‌ 28 నుంచి అక్టోబర్‌ 8 వరకు చూస్తే సెన్సెక్స్‌ 11.37 శాతం పడిపోయింది. కానీ, ఇదే కాలంలో ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.22,908 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 2016 అక్టోబర్‌ 25 నుంచి నవంబర్‌ 24 మధ్య సెన్సెక్స్‌ 7.94 శాతం దిద్దుబాటుకు లోనుకాగా, ఆ సమయంలో ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.25,490 కోట్లను రిటైల్‌ ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టారు. ఇక 2015 ఆగస్ట్‌ 4 నుంచి నుంచి సెప్టెంబర్‌ మధ్య సెన్సెక్స్‌ 11.32 శాతం కరెక్షన్‌కు గురైంది. ఆ సమయంలో ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.18,025 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈక్విటీ అనేది స్వల్ప కాలంలో అస్థిరతలతో ఉంటుందని, దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొని సంపద సృష్టిస్తుందని చాలా మంది ఇన్వెస్టర్లు అర్థం చేసుకుంటున్నట్టు మ్యూచువల్‌ ఫండ్స్‌ డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. ‘‘గత కొన్నేళ్లలో ఇన్వెస్టర్ల తీరులో మార్పు వచ్చింది. కరెక్షన్ల పట్ల ఇన్వెస్టర్లు ఆందోళన చెందడం లేదు. మంచి ఈక్విటీ ఫండ్స్‌ను 5-7 ఏళ్ల పాటు కొనసాగిస్తున్నారు’’ అని ఎడెల్వీజ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సీఈవో రాధికా గుప్తా తెలిపారు.



You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ డౌన్‌..

Monday 15th October 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో సోమవారం స్వల్ప నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:39 సమయంలో 6 పాయింట్ల నష్టతో 10,473 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,486 పాయింట్లతో పోలిస్తే 13 పాయింట్లు నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిప్టీ సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి.

సెప్టెంబర్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌ కొనుగోళ్లు

Sunday 14th October 2018

మ్యూచువల్‌ ఫండ్స్‌ను నిపుణులైన మేనేజర్లు నిర్వహిస్తుంటారు. ఏ స్టాక్‌ను ఎప్పుడు విక్రయించాలి, ఎప్పుడు కొనుగోలు చేయాలనే విషయంలో సాధారణ ఇన్వెస్టర్లతో పోలిస్తే ఫండ్స్‌ మేనేజర్లు సదా అప్రమత్తంగా వ్యవహరిస్తుంటారు. అలా అయితేనే వారు ఇన్వెస్టర్ల పెట్టుబడులపై రాబడులు తీసుకురాగలరు. ఈ ఏడాది సెప్టెంబర్‌ నెలలో దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టపోయిన విషయం తెలిసిందే. ఈ సమయంలో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగించగా... దేశీయ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు (మ్యూచువల్‌ ఫండ్స్‌ తదితర)

Most from this category