STOCKS

News


సిప్‌ ఇన్వెస్టర్లు ఎంత పోగొట్టుకున్నారో తెలుసా?

Wednesday 26th September 2018
personal-finance_main1537945554.png-20590

ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో గత ఏడాది కాలంగా సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్స్‌ (సిప్స్‌) విధానంలో ఇన్వె‍స్ట్‌ చేసిన ఇన్వెస్టర్లు వారి పెట్టుబడులను నష్టపోవాల్సి వచ్చింది. 147 యాక్టివ్లీ మేనేజ్‌డ్‌ ఈక్విటీ స్కీమ్స్‌లో 123 స్కీమ్స్‌ నష్టాలను మిగిల్చాయి. వ్యాల్యురీసెర్చ్‌ గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఎక్కువగా నష్టపోయిన వాటిల్లో స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌ ముందు వరుసలో ఉంటే.. వీటి తర్వాతి స్థానంలో మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌, మల్టీక్యాప్‌ ఫండ్స్‌ ఉన్నాయి.  
సిప్స్‌ విషయానికి వస్తే.. ఇన్వెస్టర్లు ప్రతినెల లేదా ప్రతి త్రైమాసికం నిర్ణీత మొత్తంలో డబ్బుల్ని ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవి బ్యాంకుల రికరింగ్‌ డిపాజిట్ల వంటివి. గత రెండేళ్లలో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో తొలిసారి ఇన్వెస్ట్‌ చేసేవారిలో సిప్‌ విధానంలో పెట్టుబడులు పెట్టిన వారే అధికంగా ఉన్నారు.
గత ఏడాది కాలంలో సుందరం స్మాల్‌క్యాప్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేసిన వారికి గమనిస్తే.. సిప్‌ రూపంలో నెలకు రూ.1,000 ఇన్వెస్ట్‌ చేస్తే అది 12 నెలలకు రూ.12,000 అవుతుంది. అయితే సెప్టెంబర్‌ 25 నాటికి ఈ విలువ రూ.9,726 తగ్గింది. అంటే రూ.2,374 నష్టపోవాల్సి వచ్చింది. గత రెండేళ్లలో చూస్తే 141 ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో 22 వరకు నెగటివ్‌ సిప్‌ రిటర్న్స్‌ అందించాయి.
ఐదేళ్ల దీర్ఘకాల లక్ష్యంతో సిప్‌ రూపంలో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలని మార్కెట్‌ నిపుణులు సూచిస్తున్నారు. ‘స్వల్పకాలిక ఒడిదుడుకులకు భయపడొద్దు. కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌ బలంగా ఉంటాయి.  పరిస్థితుల్లో మార్పు వస్తుంది’ అని మనీమంత్ర ఫౌండర్‌ విరాల్‌ భట్‌ తెలిపారు. స్టాక్‌మార్కెట్‌ పడిపోతున్నప్పుడు.. మరిన్ని స్టాక్స్‌ను కొనుగోలు చేయడం మంచిదని మ్యూచువల్‌ ఫండ్‌ అధికారులు పేర్కొంటున్నారు. ‘ఇన్వె‍స్టర్లు వారి సిప్‌ ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగించాలి. స్వల్పకాలిన నెగటివ్‌ రిటర్న్స్‌ చూసి అధైర్యపడొద్దు. సిప్‌ ఇన్వెస్టర్లకు మార్కెట్‌ పడిపోవడం మంచి అవకాశంలాంటిది. అప్పుడు ప్రతినెలా ఎక్కువ స్టాక్స్‌ కొనుగోలు చేయవచ్చు. ఇవే తర్వాత అధిక రిటర్న్స్‌ను అందిస్తాయి’ అని మీర్‌ అసెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సీఈవో స్వరూప్‌ మొహంతీ తెలిపారు. 2008-10 కాలంలో ఇన్వెస్టర్లు నెగటివ్‌ రిటర్న్స్‌ పొందారని, అయితే తర్వాత మంచి లాభాలను అందుకున్నారని గుర్తుచేశారు. 
అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆఫ్‌ ఇండియా (యాంఫీ) గణాంకాల ప్రకారం.. 2018-19లో ప్రతి నెలా సగటున 10.07 లక్షల కొత్త సిప్‌ ఖాతాలు ఓపెన్‌ అవుతున్నాయి. అలాగే ఒక సిప్‌ ఖాతా ఇన్వెస్ట్‌మెంట్‌ మొత్తం సగటున రూ.3,200గా ఉంది. మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి సిప్‌ రూపంలో 2017-18లో రూ.67,190 కోట్లమేర పెట్టుబడులు వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల కాలంలో ఈ మొత్తం రూ.36,760 కోట్లుగా నమోదయ్యింది.

చెత్త పనితీరు కనబర్చిన ఫండ్స్‌
స్కీమ్‌ పేరు            కేటగిరి        ఏడాది కాలం రిటర్న్‌ (%)
సుందరం స్మాల్‌క్యాప్‌        స్మాల్‌క్యాప్‌    -34  
హెచ్‌ఎస్‌బీసీ స్మాల్‌క్యాప్‌        స్మాల్‌క్యాప్‌    -28
ఐసీఐసీఐ ప్రు. స్మాల్‌క్యాప్‌        స్మాల్‌క్యాప్‌    -27
ఆదిత్య బిర్లా. స్మాల్‌క్యాప్‌        స్మాల్‌క్యాప్‌    -25
ఆదిత్య బిర్లా. ప్యూర్‌ వ్యాల్యు    వ్యాల్యు ఓరియెంటెడ్‌    -24

మంచి పనితీరు కనబర్చిన ఫండ్స్‌
ఐసీఐసీఐ ప్రు. ఫోకస్‌డ్‌ ఈక్విటీ    ఫోకస్‌డ్‌    13
పరాగ్‌ పరీఖ్‌ లాంగ్‌టర్మ్‌ ఈక్విటీ    మల్టీక్యాప్‌    9
ఐసీఐసీఐ ప్రు. వ్యాల్యు డిస్కవరీ    వ్యాల్యు ఓరియెంటెడ్‌    7
ఐసీఐసీఐ ప్రు. మల్టీక్యాప్‌        మల్టీక్యాప్‌    6
యాక్సిస్‌ బ్లూచిప్‌            లార్జ్‌క్యాప్‌    6
 You may be interested

మార్కెట్‌ యూటర్న్‌

Wednesday 26th September 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ రివర్స్‌ గేర్‌లో వెళ్తోంది. గ్యాప్‌అప్‌తో ప్రారంభమైన సూచీలు తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నాం 1:09 సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 261 పాయింట్ల నష్టంతో 36,391 వద్ద, నిఫ్టీ 66 పాయింట్ల నష్టంతో 11,001 వద్ద ట్రేడవుతున్నాయి.  నిఫ్టీ-50లో ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 7 శాతానికిపైగా లాభపడింది. ఇక యూపీఎల్‌ 3 శాతానికిపైగా ఎగసింది. టైటాన్‌, యస్‌ బ్యాంక్‌, గెయిల్‌ షేర్లు 2 శాతానికిపైగా పెరిగాయి. మరోవైపు టాటా

కేఈఐటీ 17శాతం క్రాష్‌..!

Wednesday 26th September 2018

ముంబై:- ఐటీ రంగంలో సేవలు అందించే కేపీఐటీ టెక్నాలజీస్‌ షేరు బుధవారం 17శాతం నష్టపోయింది. నేడు ఎన్‌ఎస్‌ఈలో కేపీఐటీ షేరు రూ.268.45ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. గత ట్రేడింగ్‌లో డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత కారణంగా భారీ లాభపడిన ఐటీ షేర్లలో నేడు లాభాల స్వీకరణ జరుగుతోంది. తెలియని కారణాలతో నేటి ట్రేడింగ్‌లో ఎన్‌ఎస్‌ఈలో కేపీఐటీ 17శాతం నష్టపోయి 222.65 వద్ద ఇంట్రాడే కనిష్టానికి తాకింది. మధ్యాహ్నం గం.12:15ని.లకు షేరు గతముగింపు

Most from this category