STOCKS

News


ఈఎల్‌ఎస్‌ఎస్‌, యులిప్‌లో పన్ను ఆదాకు ఏది ఉత్తమం?

Thursday 30th August 2018
personal-finance_main1535569145.png-19768

పన్ను ఆదా చేసే పెట్టుబడి సాధనాల విషయంలో చాలా మందిలో సందేహాలు ఉంటుంటాయి. ఈక్విటీల్లో పెట్టుబడులకు వీలు కల్పించే ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌), యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ (యులిప్‌) వీటిలో ఏది మెరుగు? అన్న ప్రశ్న ఎదురైతే... అందుకు చూడాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఈ రెండు పథకాలకు కొన్ని సారూప్యాలు, కొన్ని విభేదాలూ ఉన్నాయి. ఈ రెండూ పన్ను ఆదాకు అర్హమైనవే. రెండింటికీ లాకిన్‌ పీరియడ్‌ ఉంటుంది. వీటికి సంబంధించి మరిన్ని వివరాలను తెలియజేస్తున్నారు ఏంజెల్‌ బ్రోకింగ్‌కు చెందిన చీఫ్‌ సేల్స్‌ ఆఫీసర్‌ సందీప్‌ భరద్వాజ్‌. 

 

యులిప్‌ కంటే ఈఎల్‌ఎస్‌ఎస్‌ మెరుగు

  • ఓ పెట్టుబడి సాధనం మెరుగ్గా ఉందని చెప్పేందుకు దానిలో పారదర్శకత ఉండాలి. ఎంట్రీ, ఎగ్జిట్‌ లోడ్‌ చార్జీలు, ప్రారంభ వ్యయాలు, పోర్ట్‌ఫోలియో వివరాలు ఇవన్నీ తెలిసేలా ఉండాలి. యులిప్‌లు ఈ వివరాలను కవర్‌ చేయవు. యులిప్‌ల డేటా మ్యూచువల్‌ ఫండ్స్‌ మాదిరిగా అందుబాటులో ఉండడం తక్కువ. కనుక మెరుగైన పనితీరు చూపించే యులిప్‌ను ఎంచుకోవడం కష్టం. 
  • బీమా, పెట్టుబడి కలసి ఉండే యులిప్‌ను కొనుగోలు చేయడం మంచి ఆలోచనేమీ కాదు. ఆర్థిక ప్రణాళిక కోణంలో బీమా, పెట్టుబడులు విడిగా ఉండడమే మంచిది. పన్ను ఆదా కోసం ఈఎల్‌ఎస్‌ఎస్‌ కొనుగోలు చేసి, విడిగా టర్మ్‌ పాలసీ తీసుకోవాలి.
  • ఈఎల్‌ఎస్‌ఎస్‌, టర్మ్‌ ప్లాన్‌ తీసుకుంటే ఈ రెండూ కూడా సెక్షన్‌ 80సీ కింద పన్ను ఆదాకు అర్హమైనవే అని గుర్తుంచుకోవాలి. కనుక విడిగా తీసుకున్నా గానీ పన్ను ఆదా నష్టపోవాల్సిన పనిలేదు.
  • మ్యూచువల్‌ ఫండ్స్‌ గడిచిన 20 ఏళ్లలో స్థిరంగా మంచి పనితీరు చూపించాయి.
  • యులిప్‌లకు ఐదేళ్ల లాకిన్‌ పీరియడ్‌ ఉంటుంది. కానీ ఈఎల్‌ఎస్‌ఎస్‌లో పెట్టుబడులకు లాకిన్‌ పీరియడ్‌ మూడేళ్లే. పనితీరు విషయంలో సంతోషంగా లేకపోతే మూడేళ్ల తర్వాత ఆ పెట్టుబడులను వెనక్కి తీసుకుని మరో మంచి ఈఎల్‌ఎస్‌ఎస్‌లో ఇన్వెస్ట్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అంతేకాదు ప్రతీ మూడేళ్లకు ఈఎల్‌ఎస్‌ఎస్‌ పెట్టుబడులను వెనక్కి తీసుకుని రీ ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా పన్ను ఆదా చేసుకోవచ్చు. 
  • యులిప్‌ను ఒక్కసారి ప్రారంభిస్తే నిర్ణీత కాల వ్యవధి పూర్తయ్యే వరకు ప్రతీ సంవత్సరం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈఎల్‌ఎస్‌ఎస్‌ అయితే మీ ఇష్ట ప్రకారం కాల వ్యవధిని ఎంచుకోవచ్చు. ప్రతీ ఏటా కొనసాగించాలన్న నిబంధన ఏదీ లేదు. 
  • యులిప్‌ల్లో పెట్టుబడి పదేళ్ల తర్వాతే లాభదాయకంగా మారగలవు. కానీ, అప్పటి వరకు పెట్టుబడులపై చార్జీలు చాలా ఎక్కువ. కనుక ఈఎల్‌ఎస్‌ఎస్‌తో పోలిస్తే యులిప్‌ల ఎంపిక వల్ల ఉమంత ప్రయోజకరం కాదు. 



You may be interested

గడువులోపు రిటర్నులు ఫైల్‌ చేయకపోతే...?

Thursday 30th August 2018

గడువులోపు ఆదాయపన్ను రిటర్నులు ఫైల్‌ చేయకపోతే, ఆ తర్వాత ఇక చేయవద్దన్న అభిప్రాయంతో చాలా మంది ఉంటుంటారు. కానీ, ఈ గడువు అన్నది పన్ను చెల్లింపుదారులు కచ్చితంగా అనుసరించాలి. లేకపోతే ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయన్నది తెలుసుకుందాం.   ఆఖరి తేదీ గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపన్ను రిటర్నులను ఏటా జూలై ఆఖరుకు దాఖలు చేయాలి. ఈ ఏడాది ఇది ఆగస్ట్‌ 31 వరకు పొడిగించారు. ఇది సాధారణ విభాగం(వేతన జీవులు అందరూ)లోని

11700 దిగువకు నిఫ్టీ

Wednesday 29th August 2018

రెండు రోజుల రికార్డు ర్యాలీకి బ్రేక్‌ మార్కెట్‌ రెండు రోజుల రికార్డు ర్యాలీకి బుధవారం బ్రేక్‌ పడింది. గురువారం(30న) ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టుల గడువు ముగియున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తతో పాటు చివర అరగంటలో అమ్మకాల వెల్లువతో సూచీలు నష్టాలతో ముగిశాయి. వీటికి తోడు రూపాయి జీవితకాల గరిష్టానికి చేరుకోవడం, అంతర్జాతీయంగా చమురు పెరుగుదల, సూచీల గరిష్టస్థాయిల వద్ద ఇన్వెస్టర్ల స్వల్ప లాభాల స్వీకరణ తదితరకారణాలు కూడా సూచీల నష్టాల కారణమయ్యాయి. ఫలితంగా

Most from this category