STOCKS

News


ఫండ్‌కు రెండు స్కీమ్స్‌... దేంట్లో ఇన్వెస్ట్‌ చేయాలి

Monday 3rd December 2018
personal-finance_main1543814381.png-22587

ప్ర: నేను వ్యాపారం చేస్తున్నాను. ఎన్‌పీఎస్‌(నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌)లో నేను రూ. లక్షన్నర వరకూ ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. అయితే ఎన్‌పీఎస్‌ లో ఇన్వెస్ట్‌ చేస్తే గరిష్టంగా వచ్చే పన్ను ప్రయోజనం రూ.50,000 మాత్రమేనని మిత్రులు చెబుతున్నారు. అందుకని ఎన్‌పీఎస్‌లో పెట్టుబడులు రూ.50,000 వరకే పరిమితం చేసి, మిగిలిన మొత్తాన్ని ఇతర పన్ను ఆదా మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే నాకు 60 ఏళ్లు వచ్చిన తర్వాత ఖచ్చితంగా యాన్యుటీలో ఇన్వెస్ట్‌ చేయాలా? యాన్యుటీలో ఇన్వెస్ట్‌ చేసే విషయాన్ని 65 ఏళ్ల వరకూ వాయిదా వేయవచ్చా ?
-రవీందర్‌, గుంటూరు
జ: ఎన్‌పీఎస్‌కు సంబంధించిన మీ మిత్రులు చెబుతున్న పన్ను రాయితీలు తప్పు. ఎన్‌పీఎస్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై రూ.2 లక్షల వరకూ పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. ఆదాయపు పన్ను చట్టం, సెక్షన్‌ 80 సీ ప్రకారం రూ.లక్షన్నర వరకూ పన్ను ప్రయోజనం లభిస్తుంది. రూ.లక్షన్నరకు మించి ఇన్వెస్ట్‌ చేస్తే, అదనంగా మరో రూ.50,000 వరకూ కూడా పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. అయితే లిక్విడిటీ పరంగా చూస్తే, ఎన్‌పీఎస్‌కు కొన్ని అననుకూలతలు ఉన్నాయి. అందుకని పన్ను ఆదా మ్యూచువల్‌ ఫండ్స్‌లో రూ. లక్షన్నర వరకూ ఇన్వెస్ట్‌ చేసి, ఆ మొత్తానికి రూ. లక్షన్నర వరకూ పన్ను ప్రయోజనాలు పొందండి. ఇక ఎన్‌పీఎస్‌లో రూ.50,000 ఇన్వెస్ట్‌ చేసి, ఈ మొత్తానికి కూడా రూ.50,000 పన్ను ప్రయోజనం పొందండి. మొత్తం​ మీద మీరు రూ.2 లక్షల వరకూ పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. ఇక యాన్యుటీ విషయానికొస్తే, మీకు 60 ఏళ్లు వచ్చినప్పుడే యాన్యుటీలో ఇన్వెస్ట్‌ చేయాల్సిన అవసరం లేదు. దీనిని 65 ఏళ్లకు, అంతకు మించి కూడా పొడిగించుకోవచ్చు. ఎన్‌పీఎస్‌కు సంబంధించి మరో ముఖ్యమైన విషయమేమిటంటే, ఈక్విటీ కేటాయింపులను 75 శాతం వరకూ పెంచుకోవచ్చు. ఎన్‌పీఎస్‌ మొదలైనప్పుడు నిబంధనలు సంక్లిష్టంగా ఉండేవి. ఇప్పుడు నిబంధనలు ఎప్పటికప్పుడు సరళమవుతున్నాయి. రానున్న కాలంలో ఈ నిబంధనలు మరింత సరళం కానున్నాయి. ఇప్పుడు భారత్‌లో యాన్యుటీ మార్కెట్‌ ఇంకా శైశవ దశలోనే ఉంది. కాబట్టి యాన్యుటీ విషయంలో కూడా మార్పులు, చేర్పులు ఉండవచ్చు. అందుకని యాన్యుటీ విషయమై ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

. ప్ర: ఓపెన్‌ ఎండ్‌ ఇన్‌కమ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే మంచిదా ?లేకుంటే ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ ప్లాన్‌(ఎఫ్‌ఎమ్‌పీ)లో ఇన్వెస్ట్‌ చేయడం మంచిదా ? ఎఫ్‌ఎమ్‌పీలో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు నిర్ణీత లాక్‌ ఇన్‌ పీరియడ్‌ ఉంటుంది కదా ! అయినప్పటికీ, ఈ రెండు సాధనాల్లో వచ్చే రాబడులు దాదాపు సమానంగానే ఉంటాయి కదా !
-సర్వర్‌, విజయవాడ
జ: మీరు ఇన్వెస్ట్‌ చేసే డెట్‌ ఫండ్‌ ఏ రకానికి చెందినది అనే దానిని బట్టి రాబడులు ఆధారపడి ఉంటాయి. ఎఫ్‌ఎమ్‌పీల్లోనే ఒకింత అధిక రాబడులు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా మీరు పొందగలిగే రాబడుల విషయమై మీకు ఒక అవగాహన కూడా ఉంటుంది. మీకు లిక్విడిటీ అవసరాలు లేని పక్షంలో ఎఫ్‌ఎమ్‌పీలో ఇన్వెస్ట్‌ చేయడమే ఉత్తమం. అలా కాకుండా మీరు ఇన్వెస్ట్‌ చేసిన సొమ్ములు మీకు తర్వాతి కాలంలో అవసరమైన పక్షంలో ఎఫ్‌ఎమ్‌పీల్లో ఇన్వెస్ట్‌ చేయకండి. మూడేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, షార్ట్‌ టర్మ్‌ బాండ్‌ ఫండ్‌, ఆల్ట్రా షార్ట్‌-టర్మ్‌ బాండ్‌ ఫండ్‌, లిక్విడ్‌ ఫండ్‌ల కంటే కూడా ఎఫ్‌ఎమ్‌పీల్లో కొంచెం ఎక్కువ రాబడులు వస్తాయి.

ప్ర: నేను మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. అయితే ప్రతి ఫండ్‌కు రెండు స్కీమ్స్‌ కనిపిస్తున్నాయి. ఉదాహరణకు హెచ్‌డీఎఫ్‌సీ ఫండ్‌, హెచ్‌డీఎఫ్‌సీ డైరెక్ట్‌ ఫండ్‌.. ఈ రెండు స్కీమ్‌లు వేర్వేరా ? లేక రెండూ ఒకటేనా? దేంట్లో ఇన్వెస్ట్‌ చేయాలి?
-ప్రియాంక, హైదరాబాద్‌
జ: ప్రతి మ్యూచువల్‌ ఫండ్‌ స్కీమ్‌కు రెండు వేరియంట్లు ఉంటాయి. ఒకటేమో రెగ్యులర్‌, రెండోది డైరెక్ట్‌. రెగ్యులర్‌ ప్లాన్‌లు మ్యూచువల్‌ ఫండ్‌ ఏజెంట్లు, డిస్ట్రిబ్యూటర్లు విక్రయిస్తారు. వీరికి కొంత కమీషన్‌ లభిస్తుంది. ఇక డైరెక్ట్‌ ప్లాన్‌ల్లో మీరు నేరుగా ఇన్వెస్ట్‌ చేయవచ్చు. ఏజెంట్లకు కమీషన్‌ చెల్లింపుల కారణంగా రెగ్యులర్‌ స్కీమ్‌ల ఎక్స్‌పెన్స్‌ రేషియో అధికంగా ఉంటుంది. డైరెక్ట్‌ ప్లాన్‌ల ఎక్స్‌పెన్స్‌ రేషియో తక్కువగా ఉంటుంది. ఈ తేడా కారణంగా రెగ్యులర్‌ స్కీమ్‌ల కంటే డైరెక్ట్‌ స్కీమ్‌ల రాబడులు(వార్షికంగా) 0.5 శాతం నుంచి 1 శాతం వరకూ అదనంగా ఉంటాయి. డైరెక్ట్‌ ప్లాన్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే ప్రతి విషయమూ మీరే చూసుకోవాలి.  ఇన్వెస్ట్‌ చేయడానికి మీకు ఎవరూ సాయపడరు. ఏ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలి ? ఎలా ఇన్వెస్ట్‌ చేయాలి ఇలాంటి అన్ని విషయాలూ మీరే చూసుకోవలసి ఉంటుంది. ఈ బాదరబందీ అంతా ఎందుకు అనుకుంటే, రెగ్యులర్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయండి. మీరు మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కు కొత్త కాబట్టి ముందు రెగ్యులర్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయండి. ఇన్వెస్ట్‌మెంట్‌కు సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌)విధానాన్ని ఎంచుకోండి. ఒక ఏడాది పాటు ఇన్వెస్ట్‌ చేసిన తర్వాత మీకు మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, మార్కెట్‌ తీరు తదితర అంశాలపై ఒక అవగాహన వస్తుంది. అప్పుడు డైరెక్ట్‌ ఫండ్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం మొదటి సారి కాబట్టి, ముందుగా ఒక ఏడాది పాటు బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌చేయడం ఆరంభించండి. ఆ తర్వాత ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకోండి.



You may be interested

అన్ని ఫండ్లూ లాభాలివ్వవు

Monday 3rd December 2018

 మ్యూచ్‌వల్‌ ఫండ్లలో వైవిధ్యత లేకుంటే రిస్కే - ఒకోసారి లాభాల మాట అటుంచి పెట్టుబడికీ ఇబ్బందే - మార్కెట్‌ పతనాల్లో నష్టాలు మరింత పెరగొచ్చు - అనుకున్న లక్ష్యాల సాధనలో వెనుకడుగు - మల్టీక్యాప్‌ ఫండ్స్‌ వైవిధ్య పరంగా అనువైనవి - లార్జ్‌, మిడ్‌క్యాప్‌, సెక్టార్‌ ఫండ్స్‌ ఎంచుకోవచ్చు - ఫండ్స్‌ ఎక్కువ ఉంటే ప్రతికూలం కావచ్చు (సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం) మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే చాలు... చక్కని రాబడులు వచ్చేస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ అది కరెక్టు

ఆర్‌బీఐ పాలసీతో మార్కెట్లకు దిశానిర్దేశం

Monday 3rd December 2018

స్థూల గణాంకాలు, రూపాయి కదలికలూ కీలకం న్యూఢిల్లీ: కీలక వడ్డీ రేట్లపై రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం, స్థూల ఆర్థిక గణాంకాలు, అంతర్జాతీయ పరిస్థితులు, రూపాయి కదలికలు తదితర అంశాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌కు దిశానిర్దేశం చేస్తాయని మార్కెట్ నిపుణులు తెలిపారు. అలాగే, తయారీ, సేవల రంగాలకు సంబంధించిన పీఎంఐ గణాంకాలు కూడా కీలకంగా ఉండగలవని పేర్కొన్నారు. ఇక శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత విడుదలైన స్థూల దేశీయోత్పత్తి గణాంకాలు ..

Most from this category