STOCKS

News


డీఎస్‌పీ నుంచి హెల్త్‌కేర్‌ ఫండ్‌

Saturday 17th November 2018
personal-finance_main1542432079.png-22114

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థ డీఎస్‌పీ బ్లాక్‌రాక్‌ తాజాగా హెల్త్‌కేర్‌కి సంబంధించి కొత్త ఫండ్‌ ఆఫర్‌ను ఆరంభించింది.  నవంబర్‌ 12న ప్రారంభమైన ఈ ఫండ్‌ ఆఫర్‌ వ్యవధి నవంబర్‌ 26 దాకా ఉంటుంది. ఈ ఫండ్‌ సుమారు రూ.500 కోట్ల దాకా పెట్టుబడులు (ఏయూఎం) సమీకరించే అవకాశం ఉందని ఫండ్‌ మేనేజర్‌ ఆదిత్య ఖేమ్కా శుక్రవారమిక్కడ విలేకరులకు తెలిపారు. ఈ ఫండ్‌ సుమారు 20–25 హెల్త్‌కేర్, ఫార్మా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తుందన్నారు. ‘‘లార్జ్‌క్యాప్‌ కన్నా మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ షేర్లలో ఎక్కువగా ఇన్వెస్ట్‌ చేస్తాం. ఈ షేర్లు ఇప్పటికే గణనీయంగా క్షీణించి ఆకర్షణీయమైన రేటుకు లభిస్తుండటమే దీనికి కారణం. ఇవైతే భవిష్యత్‌లో మెరుగైన రాబడులు అందించగలవు’’ అని ఖేమ్కా వివరించారు. ఫండ్‌లో సుమారు పాతిక శాతాన్ని అటు అంతర్జాతీయంగా అమెరికన్‌ మార్కెట్లో కూడా హెల్త్‌కేర్, ఫార్మా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయనుండటం ఈ ఫండ్‌ ప్రత్యేకతగా ఆదిత్య వివరించారు. డాలర్, రూపాయి మారకంలో వ్యత్యాసాల కారణంగా కరెన్సీపరమైన ప్రయోజనాలు కూడా చేకూరగలవన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ వంటి ప్రభుత్వ పథకాలు, పెరుగుతున్న జనాభా అవసరాలు దేశీయంగా ఫార్మా, హెల్త్‌కేర్‌ సంస్థలకు సానుకూలంగా ఉండగలవని తెలిపారు. 
ఆటుపోట్లు కొనసాగవచ్చు ..
సార్వత్రిక ఎన్నికలు తదితర అంశాల నేపథ్యంలో రాబోయే ఆరు నెలలు మార్కెట్లలో ఆటుపోట్లు కొనసాగవచ్చని ఆదిత్య వివరించారు. ఫార్మా రంగంలో తీవ్ర పోటీ వల్ల ధరల పరమైన ఒత్తిళ్లు, నియంత్రణ సంస్థల నిబంధనలు తదితర సవాళ్లు ఉండొచ్చని పేర్కొన్నారు. రూపాయి పతనం ప్రయోజనాల ప్రభావం .. కంపెనీల ఖాతాల్లో ఈ ఆర్థిక సంవత్సరం ఆఖర్లో కనిపించవచ్చని చెప్పారు.You may be interested

ముంబైలో మోషన్‌ క్యాప్చర్‌ ల్యాబ్‌

Saturday 17th November 2018

ముంబై: ఫేమస్‌ స్టూడియోస్‌, బ్రిటన్‌కు చెందిన సెంట్రాయిడ్‌తో కలసి ముంబైలోని మహాలక్ష్మి ప్రాంతంలో గల తన స్టూడియోలో దేశంలోనే తొలి మోషన్‌ క్యాప్చర్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. ఇది దేశంలోనే తొలి ఎండ్‌ టు ఎండ్‌ మోషన్‌ క్యాప్చర్‌ ల్యాబ్‌ అని కంపెనీ ప్రకటించింది. సినిమా నిర్మాణం, యానిమేషన్‌, గేమింగ్‌కు ఇది అత్యాధునిక టెక్నాలజీలతో కూడిన సేవలను అందించనుంది. షూటింగ్‌ నుంచి పోస్ట్‌ ప్రొడక్షన్‌ వరకు నటీ, నటులకు సహకారం

గెయిల్‌ చేతికి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ పవన విద్యుత్తు వ్యాపారం?

Saturday 17th November 2018

ముంబై: ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు చెందిన పవన విద్యుదుత్పత్తి విభాగాన్ని కొనుగోలు చేయాలని గెయిల్‌ ఇండియా యోచిస్తోంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌(ఐఎఫ్‌ఎల్‌ఎల్‌) గ్రూప్‌ కంపెనీలు రుణాల చెల్లింపుల్లో డీఫాల్ట్‌ అయి, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ రంగంలో కుదుపులకు కారణమైన విషయం తెలిసిందే. ఈ ​గ్రూప్‌లో భాగమైన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌కు చెందిన 775 మెగావాట్ల పవన విద్యుదుత్పత్తి వ్యాపారాన్ని కొనుగోలు చేయాలని గెయిల్‌ భావిస్తోంది. ఈ విషయమై గెయిల్‌ కంపెనీ

Most from this category