STOCKS

News


సిప్‌ పెట్టుబడులు ఆపకండి 

Monday 5th November 2018
personal-finance_main1541393319.png-21699

ప్ర: మార్కెట్‌ తగ్గుతున్నప్పుడు సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌)లను కొనసాగించి, మార్కెట్‌ పెరుగుతున్నప్పుడు వాటిని ఆపేయడం ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ కొనసాగిద్దామనుకుంటున్నాను. ఇది సరైన నిర్ణయమేనా ?
-ఇజాజ్‌, హైదరాబాద్‌ 
జ:  ఇది ఏ మాత్రం సరైన నిర్ణయం కాదు. సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) అసలు ఉద్దేశాలు రెండు..మొదటిది,  మీరు క్రమపద్థతిలో ఇన్వెస్ట్‌ చేయడం, రెండోది... మార్కెట్‌ ఒడిదుడుకులతో నిమిత్తం లేకుండా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించడం.  రిటైర్మెంట్‌  నిధి ఏర్పాటు, సొంత ఇల్లు సమకూర్చుకోవడం, పిల్లల ఉన్నత చదువు అవసరాలు.. ఇలాంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం అందరూ ఇన్వెస్ట్‌ చేస్తూ ఉంటారు. ఇలాంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఇన్వెస్ట్‌ చేయడానికి మ్యూచువల్‌ ఫండ్స్‌ మంచి  సాధనాలు. మ్యూచువల్‌ ఫండ్స్‌లో నెలకు కొంత మొత్తం చొప్పున సిప్‌ విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తే, మంచి రాబడులు వస్తాయి. మార్కెట్‌ ఒడిదుడుకులను పట్టించుకోకుండా మీరు నిర్దేశించుకున్న కాలం పాటు ఇన్వెస్ట్‌ చేయడమే మంచిది. సిప్‌ల ద్వారా ఇన్వెస్ట్‌ చేసినందువల్ల మార్కెట్‌ హెచ్చుతగ్గుల నుంచి మీకు రక్షణ పొందుతారు కూడా. అందుకని మార్కెట్‌ తగ్గుతున్నప్పుడు సిప్‌లను కొనసాగించి, మార్కెట్‌ పెరుగుతున్నప్పుడు వాటిని ఆపేయడం సరైన నిర్ణయం కాదు. 

ప్ర: నేను 20 శాతం ట్యాక్స్‌ బ్రాకెట్‌లో ఉన్నాను. అందుకని ట్యాక్స్‌ సేవింగ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయడం తప్పనిసరి. ఇందుకోసం ఇన్వెస్ట్‌మెంట్‌ చేసేందుకు ట్యాక్స్‌ సేవింగ్స్‌ ఫండ్స్‌ను షార్ట్‌లిస్ట్‌ చేశాను. అయితే వీటిల్లో కొన్ని నిర్వహణ ఆస్తులు(ఏయూఎమ్‌)అధికంగా ఉన్నాయి. ఇలా ఏయూఎమ్‌ అధికంగా ఉన్న ట్యాక్స్‌ సేవింగ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చా ? 
-సుధాకర్‌, వరంగల్‌
జ: నిర్వహణ ఆస్తులు అధికంగా ఉన్నా కూడా, ట్యాక్స్‌ సేవింగ్స్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. స్మాల్‌ క్యాప్స్‌, మిడ్‌ క్యాప్స్‌పై దృష్టి కేంద్రీకరించిన ట్యాక్స్‌ సేవింగ్స్‌ ఫండ్స్‌ కూడా ఉన్నాయి. ఇలాంటి ఫండ్స్‌ తర్వాతి సంవత్సరాల్లో బాగా వృద్ధిచెంది, వాటి నిర్వహణ ఆస్తులు బాగా పెరుగుతాయి. ఇలాంటి ఫండ్స్‌ గతంలో ఇచ్చిన స్థాయి రాబడులను ఆ తర్వాతి కాలంలో ఇవ్వలేకపోవచ్చు. నిర్వహణ ఆస్తులు అధికంగా ఉన్నప్పటికీ, డైవర్సిఫికేషన్‌ ఉన్న ట్యాక్స్‌ సేవింగ్స్‌ ఫండ్స్‌లో నిరంభ్యంతరంగా ఇన్వెస్ట్‌ చేయవచ్చు.  మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కంపెనీలపై దృష్టిపెట్టే ఫండ్స్‌ జోలికి వెళ్లకపోవడమే మంచిది.

ప్ర:  నా వయస్సు 23 సంవత్సరాలు. రిటైరయ్యేనాటికి భారీ నిధిని సమకూర్చుకోవడం నా లక్ష్యం. నేను ఎలా ఇన్వెస్ట్‌ చేయాలి ? 
-ధనుంజయ్‌, విశాఖ పట్టణం 
జ: మీరు ఎంత పొదుపు చేయగలరో అంతా పొదుపు చేయండి. ఆ పొదుపును సమర్థవంతంగా మదుపు(ఇన్వెస్ట్‌) చేయండి. వయస్సు మీ వైపు ఉంది. ఆదాయం కూడా తగినంతగా మీ వైపు ఉందో, లేదో నాకు తెలియదు. భారీ మొత్తంలో రిటైర్మెంట్‌ నిధిని సమకూర్చుకోవాలన్న మీ లక్ష్యాన్ని చూస్తే, మీరు మంచి కష్టజీవే అని అనిపిస్తోంది. మొదటగా ఏదైనా బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌(ఎగ్రెసివ్‌ బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌)లో ఇన్వెస్ట్‌ చేయండి. కనీసం మూడేళ్ల పాటు ఈ బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ కొనసాగించండి. ఇలా మూడేళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేయడం వల్ల మీకు మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించి విధి విధానాలు, నియమ నిబంధనలపై అవగాహన వస్తుంది. ఆ తర్వాత మీ పోర్ట్‌ఫోలియోలో కొన్ని మల్టీక్యాప్‌ ఫండ్స్‌ను చేర్చండి. రెండేళ్ల తర్వాత ఒక స్మాల్‌క్యాప్‌ ఫండ్‌ను, మిడ్‌క్యాప్‌ ఫండ్‌ను కూడా చేర్చండి. మీ పోర్ట్‌ఫోలియోలో 70-80 శాతం వరకూ స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ ఫండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఉండేలా చూసుకోండి. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో మూడో వంతును డైవర్సిఫైడ్‌ మల్టీక్యాప్‌లో ఇన్వెస్ట్‌ చేయండి. మీ పోర్ట్‌ఫోలియోలో కనీసం మూడు నుంచి ఐదు ఫండ్స్‌ను మెయిన్‌టైన్‌ చేయండి. వీటిల్లో మీకు వీలైనంతగా ఇన్వెస్ట్‌ చేయండి. మీ రిటైర్మెంట్‌ నిధి లక్ష్యాన్ని మీరు చేరుకోగలరు. మీరు ఎన్ని కోట్ల రిటైర్మెంట్‌ నిధిని ఏర్పాటు చేయాలనుకున్నా, ఇదే పద్ధతిని అనుసరించండి. 

ప్ర:   నేను పది నెలల క్రితం ఎల్‌ అండ్‌ టీ ఎమర్జింగ్‌ బిజినెస్‌స్‌ ఫండ్‌లో ఒకేసారి రూ.2 లక్షలు ఇన్వెస్ట్‌ చేశాను. అది ఇప్పుడు పదిశాతానికి పైగా పడిపోయింది. ఈ ఫండ్‌ యూనిట్లను విక్రయించి బైటపడమంటారా ? లేక ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించమంటారా ?
స్రవంతి, బెంగళూరు 
జ: ఏదైనా స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ ఫండ్‌లో ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌ చేయడం సరైనది కాదు. ఎల్‌ అండ్‌ టీ ఎమర్జింగ్‌ బిజినెసెస్‌ ఫండ్‌ మంచి మ్యూచువల్‌ ఫండ్‌ అన్న విషయం కాదనలేనిదే. కానీ..ఇలాంటి స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌లో ఎప్పుడూ పెద్ద మొత్తంలో ఒకేసారి ఇన్వెస్ట్‌ చేయకూడదు. స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌ దీర్ఘకాలంలో మంచి రాబడులను ఇచ్చినప్పటికీ, మార్కెట్‌ పతన సమయంలో అధికంగా నష్టపోతాయి. అందుకనే ఈ తరహా ఫండ్స్‌ల్లో ఎప్పుడూ పెద్ద మొత్తాల్లో ఇన్వెస్ట్‌ చేయకూడదు. నెలకు రూ.5,000 లేదా రూ.10,000 తో సిప్‌లను ప్రారంభించాలి. ఆ తర్వాత ఇన్వెస్ట్‌ చేసే మొత్తాన్ని పెంచుకుంటూ పోవాలి. ఈ ఫండ్‌ తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటుంది. మార్కెట్‌ పతన సమయంలో బాగా పడిపోతూ ఉంటుంది. మార్కెట్‌ పెరిగినప్పుడు మంచి రాబడులనే ఇచ్చింది. మార్కెట్‌ క్షీణిస్తున్నప్పుడు కూడా మీ సిప్‌లను కొనసాగించండి.
 



You may be interested

సెన్సెక్స్‌ కీలక నిరోధం 35,605

Monday 5th November 2018

మన మార్కెట్లో ఏ క్షణంలోనైనా రిలీఫ్‌ ర్యాలీ మొదలయ్యే అవకాశాలు వున్నాయంటూ గత కాలమ్‌లో సూచించిన రీతిలోనే భారీ అప్‌ట్రెండ్‌ జరిగింది. రూపాయి వేగంగా కోలుకోవడం, క్రూడ్‌ ధర భారీగా పతనంకావడం ఈ ర్యాలీకి కారణం అయ్యింది. అమెరికా-చైనాల వాణిజ్య యుద్ధం ముగియవచ్చన్న ఆశాభావం కూడా ఇందుకు సహకరించింది.  అయితే విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు క్రితం వారం సైతం కొనసాగుతూ వచ్చాయి. ఈ ఇన్వెస్టర్ల నిధుల ఉపసంహరణ ఇదేరీతిలో వుంటే,

బ్యాంకు కార్డులపై భారీ ఆఫర్లు 

Monday 5th November 2018

అమెజాన్‌ ‘గ్రేట్‌ ఇండియా ఫెస్టివల్‌’... ఫ్లిప్‌కార్డ్‌ ‘ఫెస్టివ్‌ ధమాకా సేల్స్‌’... పేటీఎం ‘మహా క్యాష్‌బ్యాక్‌ సేల్‌’... వీటిలో కొనలేకపోయారా..? ఆఫర్లను మిస్‌ అయ్యామని నిరాశ పడాల్సిన పనేలేదు. ఎందుకంటే పండుగ సందర్భంగా డిస్కౌంట్‌ ఆఫర్లకు పలు ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. అటు ఆన్‌లైన్‌ సంస్థలూ కొత్త కొత్త పేర్లతో పండగల దాకా ఏదో ఒక రూపంలో ఆఫర్లు అందిస్తూనే ఉంటున్నాయి. ఇక దగ్గర్లోని  ప్రముఖ దుకాణానికి వెళ్లినా ఆఫర్లు అందుకోవచ్చు!

Most from this category