STOCKS

News


ఎండోమెంట్‌ ప్లాన్‌ల్లో 11 శాతం రాబడి వస్తుందా ?

Monday 21st January 2019
personal-finance_main1548051992.png-23698

ప్ర: నా వయస్సు 35 సంవత్సరాలు. గత రెండున్నరేళ్ల నుంచి నేను సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఈక్విటీ మ్యూచువల్‌ఫండ్స్‌ల్లో  ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కనీసం 5-10 సంవత్సరాలు కొనసాగిద్దామనుకుంటున్నాను. నాకు ఇటీవలే ఇంక్రిమెంట్‌ వచ్చి జీతం పెరిగింది. దీంతో నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ కూడా పెంచుదామనుకుంటున్నాను. ఏ కేటగిరీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయమంటారు ?
-దీప్తి, హైదరాబాద్‌
జ: ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు గత రెండున్నరేళ్ల కాలం చాలా కీలకమైనది. మార్కెట్‌  గరిష్ట స్థాయిలకు పెరగడం, అలాగే భారీగా నష్టపోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.  గత రెండున్నరేళ్లలో ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసిన ఇన్వెస్టర్లు ఇలా ఒక పూర్తి మార్కెట్‌ సైకిల్‌ను చూసి ఉంటారు. కాబట్టి స్టాక్‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేయడానికి సంబంధించిన పూర్తి అనుభవాన్ని మీరు పొంది ఉంటారు. ఇక ప్రస్తుత విషయానికొస్తే, మీరు పెంచాలనుకుంటున్న ఇన్వెస్ట్‌మెంట్స్‌ కోసం రెండు మల్టీక్యాప్‌ ఫండ్స్‌ను ఎంచుకోండి. ఒకటి విలువాధారిత ఫండ్‌, మరొకటి వృద్ధి ఆధారిత ఫండ్‌ అయి ఉంటే ఇంకా బావుంటుంది. మీరు పెంచాలనుకుంటున్న ఇన్వెస్ట్‌మెంట్‌ మొత్తాన్ని ఈ రెండు ఫండ్స్‌లో 40:60 శాతంగా ఇన్వెస్ట్‌ చేసేలా చూసుకోండి. ఇక డైవర్సిఫికేషన్‌ ప్రయోజనాల కోసం ఈ రెండు ఫండ్స్‌ ఒకే మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీవి కాకుండా రెండు వేర్వేరు మ్యూచువల్‌ ఫండ్స్‌ కంపెనీలవి అయి ఉండేలా చూసుకోవాలి.

ప్ర: ఒక బీమా సంస్థ ఎండోమెంట్‌ ప్లాన్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే 11 శాతం రాబడి వస్తుందని, పన్ను ప్రయోజనాలు కూడా పొందవచ్చని ఆ  బీమా సంస్థ ఏజెంట్‌ చెబుతున్నాడు. ఇది నిజమేనా ? ఎండోమెంట్‌ ప్లాన్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే 11 శాతం రాబడులు పొందవచ్చా ? నన్ను ఏం చేయమంటారు ? ఆ ఎండోమెంట్‌ ప్లాన్‌లో ఇన్వెస్ట్‌ చేయమంటారా ?
-కరుణాకర్‌, విజయవాడ
జ: పాలసీల విక్రయం కోసం  బీమా సంస్థలకు చెందిన కొందరు ఏజెంట్లు లేని, పోని విషయాలు కల్పించి చెబుతూ ఉంటారు. ఎండోమెంట్‌ ప్లాన్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే 11 శాతం రాబడి వస్తుందని చెప్పడం ఇలాంటిదే. దీనిని మీరు నమ్మకండి. అసలు ఇన్వెస్ట్‌ చేయడానికి ఎండోమెంట్‌ ప్లాన్‌లనే ఎంచుకోవద్దు. బీమా అవసరాలకు, భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాల సాధన కోసం ఒకే ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనం ఉండకూడదు. బీమా అవసరాలకు, భవిష్యత్తులో మంచి రాబడులు పొందడానికి ఇన్వెస్ట్‌మెంట్స్‌ వేర్వేరుగా ఉండాలి. మీ పరోక్షంలో మీ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండాలంటే, టర్మ్‌ ఇన్సూరెన్స్‌  పాలసీలో ఇన్వెస్ట్‌ చేయండి. ఆన్‌లైన్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలో ఇన్వెస్ట్‌ చేస్తే ఇంకా మంచిది. దీంట్లో వ్యయాలు తక్కువగానూ, బీమా కవరేజ్‌ అధికంగానూ ఉంటుంది. ఇక పిల్లల ఉన్నత చదువుల అవసరాలు. సొంత ఇల్లు సమకూర్చుకోవడం, రిటైర్మెంట్‌ నిధి ఏర్పాటు వంటి దీర్ఘకాలికి ఆర్థిక లక్ష్యాల సాధన కోసం ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలి. సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తే మంచి రాబడులు వస్తాయి.

ప్ర: స్థిర ఆదాయం పొందడం లక్ష్యంగా నేను కొంత మొత్తాన్ని మూడేళ్ల నుంచి ఐదేళ్ల కాలానికి ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు(ఎన్‌బీఎఫ్‌సీ) ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో ఇన్వెస్ట్‌ చేయోచ్చంటారా ? లేకుంటే డైనమిక్‌ బాండ్‌ ఫండ్స్‌ను ఎంచుకోమంటారా ?
-గంగాధర్‌, కరీంనగర్‌
జ: స్థిర ఆదాయం పొందే లక్ష్యం మీదైతే డైనమిక్‌ బాండ్‌ ఫండ్స్‌ను ఎంచుకోవద్దు. స్వల్ప కాలం నుంచి మధ్య కాలానికి డైనమిక్‌ బాండ్‌ ఫండ్స్‌లో నష్టాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. వడ్డీ రేట్ల విషయంలో గత నాలుగు నుంచి ఐదేళ్ల కాలంలో ఫండ్‌ మేనేజర్ల అంచనాలు తల్లకిందులయ్యాయి. రేట్లు తగ్గుతాయనుకున్నప్పుడు పెరగడమో, పెరుగుతాయనుకున్నప్పుడు తగ్గడమో జరగడం...ఇలా   ఫండ్‌ మేనేజర్ల అంచనాలకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే మంచి రాబడులు వచ్చే మాట వాస్తవమే కానీ, మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు నష్టభయం ఉండదని చెప్పలేం. కొంత మొత్తంలో ఖచ్చితమైన ఆదాయం కావాలనుకుంటే, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ)ల డిపాజిట్లలో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. అయితే వీటిల్లో కూడా నష్ట భయం పూర్తిగా ఉండదని చెప్పలేం. అయితే కంపెనీ పేరు ప్రఖ్యాతులు, క్రెడిట్‌ రేటింగ్‌ ఆధారంగా ఎన్‌బీఎఫ్‌సీ డిపాజిట్లను ఎంచుకోవాలి. ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ కోసం మూడు రకాలైన ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. లిక్విడ్‌, షార్ట్‌ డ్యురేషన్‌, ఆల్ట్రా షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చు. ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ కోసం ఒక రిటైల్‌ ఇన్వెస్టర్‌ ఈ మూడు కాకుండా ఇతర ఫండ్స్ గురించి ఆలోచించడం వృధా. అయితే ఇటీవలి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం కారణంగా ఇప్పుడు ఇన్వెస్టర్లు లిక్విడ్‌ ఫండ్స్‌ పేర్లు వింటే వణికిపోతున్నారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం ఒక యాక్సిడెంట్‌ మాత్రమే అని నేను భావిస్తున్నాను. లిక్విడ్‌, షార్ట్‌ డ్యురేషన్‌, ఆల్ట్రా షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌... ఎన్‌బీఎఫ్‌సీల డిపాజిట్ల కంటే కూడా మెరుగైన రాబడులనే ఇస్తాయి. మరోవైపు పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి.You may be interested

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నికర లాభం 20% అప్‌

Monday 21st January 2019

న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజమైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసికానికి ఆశాజనక ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌–డిసెంబర్‌)లో కంపెనీ నికర లాభం 20.3 శాతం వృద్ధి చెంది రూ.5,585.9 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికానికి రూ.4,642.6 కోట్ల నికర లాభాన్ని ఆర్జించించింది. ఈసారి లాభం గణనీయంగా పెరగడానికి.. అధిక నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) ప్రధాన కారణమని బ్యాంక్‌ ఒక

నేటి నుంచి దావోస్ సదస్సు

Monday 21st January 2019

డబ్ల్యూఈఎఫ్‌కు వస్తున్న దిగ్గజాలు భారత్ నుంచి 100 మంది పైగా సీఈవోల బృందం ట్రంప్‌, పుతిన్‌, మాక్రాన్‌, థెరిసా మే సదస్సుకు దూరం దావోస్‌: స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) సదస్సు సోమవారం (నేడు) నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 25 దాకా జరిగే ఈ సదస్సులో ప్రపంచ ఎకానమీ ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి చర్చించేందుకు, పరిష్కార మార్గాలపై కసరత్తు చేసేందుకు వివిధ దేశాల అధినేతలు, విధాన కర‍్తలు,

Most from this category