STOCKS

News


మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు మర్చిపోయారా?

Wednesday 8th August 2018
personal-finance_main1533728800.png-19057

ఎప్పుడో మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసి ఆ విషయమే మర్చిపోయారా? లేదంటే మీ పెద్దలు ఇన్వెస్ట్‌ చేసి ఆ విషయం మీకు చెప్పడం మర్చిపోయి అయినా ఉండొచ్చు. ఎందుకంటే మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల వద్ద ఆచూకీ లేని ఇన్వెస్టర్లకు సంబంధించి రూ.44,000 కోట్లు ఉండిపోయాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌ వద్ద ఉన్న మొత్తం పెట్టుబడుల్లో ఇవి రెండు శాతం. వీటిలో అధిక శాతం రిటైల్‌ ఇన్వెస్టర్లవే అయి ఉంటాయి. ఇదే నిజమైతే మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల వద్దనున్న రిటైల్‌ ఇన్వెస్టర్ల మొత్తం నిధుల్లో 3.6 శాతానికి సమానమంటున్నారు వ్యాల్యూ రీసెర్చ్‌ సీఈవో ధీరేంద్ర కుమార్‌. దీనిపై ఆయన తన అభిప్రాయాలను ఇలా తెలియజేశారు...

 

ఎక్కువ మంది ప్రజలకు కష్డపడితే కానీ డబ్బులు రాని ఈ దేశంలో ఈ స్థాయిలో (రూ.44,000 కోట్లు) నిధులను వదిలివేయడమన్నది భయానకమైనదే. ఎందుకు ఇలా జరిగింది, ఈ విషయంలో ఎందుకు ఏమీ చేయలేకపోతున్నారు? అన్నదే ప్రశ్నలు. బ్యాంకింగ్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడుల చరిత్రను పరిశీలిస్తే... ఇదంతా వెనుకటి పెట్టుబడులేనని, పాన్‌ లింకేజీ, క్లిష్టమైన కేవైసీ నిబంధనలు రాకముందు ఇన్వెస్ట్‌ చేసినట్టుగా తెలుస్తోంది. నాకు తెలిసినంత వరకు పాన్‌ లింకేజీ, కేవైసీ రాకముందు, రెండు దశాబ్దాల క్రితం కూడా ఫండ్స్‌ ఏ బ్యాంకు నుంచి పెట్టుబడులు వచ్చాయన్నది నమోదు చేసేవి. ఈ పెట్టుబడులన్నీ 2000కు ముందు నాటివి. కొన్ని ఇంకా పాతవి అయి ఉంటాయి. ఈ నేపథ్యంలో వాస్తవ పెట్టుబడులు రూ.2,000-5,000 కోట్ల మధ్యే ఉండొచ్చు. ఆ పెట్టుబడులు 10, 20 రెట్లు పెరిగి ఉంటాయి. ఈ పెట్టుబడులు వాటి అసలైన యజమానులకు చేరిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది..? ఎప్పుడో రూ.5,000 ఇన్వెస్ట్‌ చేసి, ఇప్పుడు ఒక్కసారిగా రూ.లక్ష వస్తే మరింత ఆశ్చర్యంగా ఉంటుంది. సరైన యజమానులకు ఈ డబ్బులు చేరేందుకు గట్టి కృష్టి చేయాల్సిన అవసరం ఉంది.

 

వరుసగా ఏడేళ్ల పాటు క్లెయిమ్‌ చేయని డివిడెండ్‌ ఆదాయాన్ని ఇన్వెస్టర్ల సంరక్షణ నిధికి మళ్లించాలన్నది మన దగ్గర చట్టం ఉంది. ఇది డివిడెండ్స్‌కే పరిమితం కాదు. నిజానికి మీ పెట్టుబడులు ఏ రూపంలో ఉన్నా కానీ ప్రభుత్వం వాటిని తీసేసుకోకూడదు. మీ పెట్టుబడుల్లో కొంత భాగం లేదా ఆదాయాన్ని మీకు పంపిన తర్వాత దాన్ని క్లెయిమ్‌ చేసుకోకపోతే దాన్ని హైజాక్‌ చేసి ఇన్వెస్టర్‌ ఎడ్యుకేషన్‌ పేరుతో ఖర్చు చేసేస్తున్నారు. మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఓపెన్‌ ఎండెడ్‌ గ్రోత్‌ పథకంలో ఇన్వెస్ట్‌ చేస్తే అది ఎప్పుడూ మీతోనే ఉంటుంది. కానీ, డివిడెండ్‌ ప్లాన్‌ లేదా క్లోజ్‌ ఎండెడ్‌ ప్లాన్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే డివిడెండ్స్‌, రిడెంప్షన్‌ అన్నవి క్లెయిమ్‌ చేసుకోకపోతే ప్రభుత్వం లాగేసుకునేందుకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఒకవేళ ఇన్వెస్టర్‌ తన నివాసం మార్చినా, లేదా బ్యాంకు ఖాతా మూసేసినా లేక ఆ సమాచారం తనపై ఆధారపడిన వారికి తెలియజేయకుండా మరణించినా ఏడేళ్ల తర్వాత అది ప్రభుత్వ ఖజానాలోకి వెళుతుంది. ఏడేళ్ల తర్వాత నిజమైన క్లెయిమ్‌ వచ్చినా ఆ డబ్బుల్ని ఇన్వెస్టర్లకు అందించరు. ఇది ఏ విధంగానూ న్యాయం కాదు. కానీ, చట్టం ఇందుకు అనుమతిస్తోంది. 



You may be interested

మార్కెట్లపై వీటి ప్రభావం

Thursday 9th August 2018

రెండు రోజులుగా కన్సాలిడేట్‌ అవుతూ వస్తున్న నిఫ్టీ ఇండెక్స్‌ని బుల్స్‌ బుధవారం 11,460 స్థాయికి తీసుకెళ్లాయి. ఇండెక్స్‌ కీలకమైన నిరోధ స్థాయిలకు సమీపంలో కదలాడుతుండటంతో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  వరుసగా రెండు సెషన్‌లలో బేరిష్‌ క్యాండిల్‌ ఏర్పరచిన ఇండెక్స్‌ బుధవారం డైలీ చార్ట్స్‌లో బుల్లిష్‌ క్యాండిల్‌ను ఏర్పరచింది. ఇండెక్స్‌కు 11,500, 11,530 వద్ద కీలకమైన నిరోధ స్థాయి ఉంది. ఇక 11,330 మద్దతు స్థాయి.   నిఫ్టీ 50 బుధవారం

మరో కొత్త రికార్డు ముగింపు

Wednesday 8th August 2018

11450 వద్ద నిఫ్టీ ముంబై:- ఒక రోజు మిశ్రమ ముగింపు అనంతరం సూచీలు మళ్లీ సరికొత్త రికార్డులకు శ్రీకారం చుట్టాయి. బ్యాంకింగ్‌, ఇంధన, ఫైనాన్షియల్‌ సర్వీసెస్ రంగ షేర్ల అండతో సూచీలు ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త రికార్డులను సృష్టించాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో సూచీలు రోజంతా లాభాల ర్యాలీ చేశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 221 పాయింట్ల లాభపడి 37,887 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 60.55 పాయింట్లు

Most from this category