రేటింగ్‌లు ఆధారంగా పెట్టుబడులు పెట్టవద్దు.
By Sakshi

ప్ర: నేను గత కొంతకాలం నుంచి మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. కనీసం 10–15 ఏళ్ల దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయాలనేది నా ఆలోచన. మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను పెంచాలనుకుంటున్నాను. అయితే నా పోర్ట్‌ఫోలియోలోని అన్ని మిడ్‌క్యాప్ ఫండ్స్ గత ఏడాది ఒక్క డిసెంబర్ నెలలోనే 3–4 శాతం వరకూ నష్టపోయాయి. వీటిల్లోంచి పెట్టుబడులను వెనక్కి తీసుకొని వేరే ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా ? ప్ర: నేను రెండేళ్ల నుంచి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. నా పోర్ట్‌ఫోలియోలో బీఎన్పీ పారిబా మిడ్‌క్యాప్ ఫండ్, హెచ్డీఎఫ్సీ మిడ్‌క్యాప్ ఆపర్చనిటీస్, సుందరమ్ మిడ్‌క్యాప్ ఫండ్లు ఉన్నాయి. వీటిల్లో బీఎన్పీ పారిబా పనితీరు అంతంతమాత్రంగానే ఉంది. అంతేకాకుండా కొన్ని వెబ్సైట్లలో ఈ ఫండ్ రేటింగ్ కూడా తక్కువగా ఉంది. అందుకని ఈ ఫండ్ నుంచి వైదొలగి సుందరమ్, హెచ్డీఎఫ్సీ మిడ్క్యాప్ల్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. తగిన సూచనలివ్వండి. నా పోర్ట్‌ఫోలియోలో పదికి మించి ఫండ్స్ ఉన్నాయి. వీటిని తగ్గించుకోవాలనుకుంటున్నాను. ఫండ్స్ సంఖ్యను తగ్గించుకోవడానికి ఏమైనా ప్రాతిపదికలు ఉన్నాయా ?
-సంజయ్, విజయవాడ
జ: మిడ్‌క్యాప్ ఫండ్స్ సాధారణంగా దీర్ఘకాలంలో మంచి రాబడులే ఇస్తాయి. అయితే ఒక నెల పనితీరును బట్టి ఇన్వెస్ట్మెంట్ వ్యూహాన్ని మార్చడం సరైన నిర్ణయం కాదు. వచ్చే నెల పూర్తిగా భిన్నమైన పనితీరు ఉండొచ్చు కదా ! అందుకని మీ పోర్ట్‌ఫోలియోలో మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి. కనీసం ఏడాది కాలాన్ని పరిగణనలోకి తీసుకొని ఫండ్స్ పనితీరును మదింపు చేయాలి. ఈ కాలంలో మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్... ఇదే కేటగిరిలోని ఇతర ఫండ్ల కన్నా అధ్వానమైన పనితీరును కనబరిస్తేనే, అప్పుడు ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకోవాలి.
-పల్లవి, విశాఖ పట్టణం
జ: సాధరణంగా ఒక ఇన్వెస్టర్ పోర్ట్‌ఫోలియోలో రెండు మిడ్‌క్యాప్ ఫండ్లు ఉంటే సరిపోతుంది. మిడ్‌క్యాప్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ ఫండ్ పనితీరు గతంలో ఎలా ఉందో తప్పనిసరిగా చూడాలి. కొన్ని వెబ్సైట్లలో రేటింగ్ తక్కువగా ఉందన్న కారణంగా ఒక ఫండ్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకోవడం సరైన నిర్ణయం కాదు. మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్లు...సాపేక్ష పనితీరు ఆ«ధారంగా ఫండ్స్‌కు రేటింగ్నిస్తాయి.. ఫండ్ తీవ్రమైన ఒడిదుడుకుల్లో ఉన్నా, మంచి రాబడులు ఇవ్వలేకపోయినా, ఆ ఫండ్‌కు తక్కువ రేటింగ్‌ను ఇస్తాయి. ఈ కేటరిగిలోని ఇతర ఫండ్స్‌తో పోల్చితే మీ ఫండ్ పనితీరు అధ్వానంగా ఉంటేనే ఆ ఫండ్ నుంచి వైదొలగాలి. ఇక బీఎన్పీ పారిబా మిడ్‌క్యాప్ ఫండ్ విషయానికొస్తే, రెండేళ్ల క్రితం ఈ ఫండ్‌కు కొత్త ఫండ్ మేనేజర్ వచ్చారు. పాత ఫండ్ మేనేజర్ నిష్క్రమణ కారణంగా కొన్ని అంశాలు సర్దుకోకపోవడంతో ఈ ఫండ్ పనితీరు ఆశించిన స్థాయిలో లేదు. మీరన్నట్లుగా గత ఏడాది మిడ్‌క్యాప్ ఫండ్స్‌కు పీడకలే అని చెప్పవచ్చు. అయితే 10–15 ఏళ్ల దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేసే మీలాంటి ఇన్వెస్టర్లకు ఇది మంచిదే. ఎందుకంటే మీకు తక్కువ ధరలోనే ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లు లభిస్తాయి కదా ! ముందు అనుకున్నట్లుగానే మీ ప్రణాళికలకు అనుగుణంగానే మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి. మార్కెట్ పతన బాటలో ఉన్నప్పుడు కూడా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగిస్తే, మీకు యావరేజింగ్ ప్రయోజనాలు లభిస్తాయి.
-శ్రీకాంత్, హైదరాబాద్
జ: మార్కెట్ బాగా పెరుగుతున్నప్పుడు అందరూ చాలా ఉత్సాహంగా ఇన్వెస్ట్ చేస్తారు. చేతి నిండా సొమ్ములు ఉంటే కనిపించిన స్కీమ్‌ల్లో ఎడాపెడా ఇన్వెస్ట్ చేసేస్తారు. డబ్బులు అవసరమైనప్పుడు అయినకాడికి తెగనమ్ముకొని నష్టాలపాలవుతారు. కళల విషయంలో అభిరుచి ఉంటే కళాత్మక వస్తువులను సేకరించడం బావుంటుంది. అయితే సేకరించడం (అన్ని ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడమనేది)ఇన్వెస్ట్‌మెంట్స్‌కు వర్తించదు. మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా మీ ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి. అన్ని ఒకే కేటగిరి ఫండ్స్‌ల్లో కాకుండా విభిన్నమైన మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించిన విభిన్నమైన కేటగిరీల ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఇలా చేస్తే డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు పొందవచ్చు. ఇక మీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఫండ్స్‌ను తగ్గించుకోవడానికి రకరకాల మార్గాలున్నాయి. మొత్తం మీ పోర్ట్‌ఫోలియోలో కనీసం రెండు బ్యాలన్స్డ్ ఫండ్స్ ఉండేలా చూసుకోవాలి. బ్యాలన్స్డ్ ఫండ్స్ మీ పోర్ట్‌ఫోలియోను ఆటోమేటిక్‌గా రీబ్యాలన్స్ చేస్తుంది. స్టాక్ మార్కెట్ పతనమైనా, పెద్దగా నష్టాలు రావు. ఇక మీ పోర్ట్‌ఫోలియోలో రెండు, లేదా మూడు మల్టీక్యాప్ ఫండ్స్ ఉండేలా చూసుకోవాలి. ఇవి ఒకే మ్యూచువల్ ఫండ్ సంస్థవి అయి కాకుండా వేర్వేరు మ్యూచువల్ ఫండ్ కంపెనీలవి అయి ఉండే మంచిది. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్స్ పనితీరును కనీసం ఏడాదికొక్కసారైన మదింపు చేయండి. ఆరు నెలలకొకసారి మదింపు చేస్తే మరీ మంచిది. ఫండ్స్ పనితీరును మదింపు చేసేటప్పుడు అదే కేటగిరీలోని ఇతర ఫండ్స్ కంటే మీ ఫండ్స్ మంచి రాబడులు ఇచ్చినా, లేక అదే స్థాయి రాబడులు ఇచ్చినా ఆ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించవచ్చు. అలా కాకుండా ఇతర ఫండ్స్‌తో పోల్చితే మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్స్ రాబడి సరిగ్గా లేదనుకోండి. సదరు ఫండ్ నుంచి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకొని, వేరే ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి.
You may be interested
ఈ అపోహలకు చోటివ్వొద్దు
Monday 28th January 2019ఆన్లైన్లో అన్ని బీమా ఉత్పత్తులూ చౌక కాదు మ్యూచువల్ ఫండ్స్‌కు కాంపౌండింగ్ సరికాదు ఆన్లైన్ భారీ సేల్స్‌లో తగ్గింపు కొసరంతే సిప్పై నష్టాలు రావన్న గ్యారంటీ లేదు తెలుసుకోవాల్సిన ఇలాంటి అంశాలెన్నో... ఆర్థిక విషయాలు, పెట్టుబడుల విషయంలో కచ్చితంగా ఉంటేనే అనుకున్న లక్ష్యాలను చేరుకోగలం. అయితే, ఈ మార్గంలో ఎన్నో సందేహాలు, అపోహలు తలెత్తుతుంటాయి. ఏది నిజం? అన్నది తెలిస్తేనే సరైన నిర్ణయాలకు అవకాశం ఉంటుంది. అపోహతో తీసుకునే నిర్ణయం నష్టానికి కారణం కావచ్చు. అందుకని ఇన్వెస్టింగ్,
నిత్యాంక్ ఇన్ఫ్రాపవర్తో సంబంధాల్లేవు
Monday 28th January 2019మనీలాండరింగ్ ఆరోపణలను ఖండించిన ఎస్సెల్ గ్రూపు న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం పెద్ద ఎత్తున డిపాజిట్లు చేసిన నిత్యాంక్ ఇన్ఫ్రా పవర్ అండ్ మల్టీవెంచర్స్ సంస్థపై ఎస్ఎఫ్ఐవో దర్యాప్తు చేస్తుండగా, ఈ సంస్థతో తమకు సంబంధాలు ఉన్నట్టు వచ్చిన వార్తలను ఎస్సెల్ గ్రూపు కంపెనీలు జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్, డిష్ టీవీ ఖండించాయి. నిత్యాంక్ ఇన్ఫ్రా స్వతంత్ర కంపెనీ అని, ఇది ఎస్సెల్ గ్రూపునకు సంబంధించినది కాదని స్టాక్ ఎక్సేంజ్‌లకు