STOCKS

News


ఫండ్ వ్యాపారానికి డీహెచ్‌ఎఫ్‌ఎల్ గుడ్‌బై

Wednesday 19th December 2018
personal-finance_main1545194321.png-23069

ముంబై: డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రామెరికా అసెట్ మేనేజర్స్‌ మ్యూచువల్ ఫండ్ వ్యాపారం నుంచి వైదొలుగుతున్నట్లు గృహ రుణాల సంస్థ దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్‌ఎఫ్ఎల్‌) వెల్లడించింది. జాయింట్ వెంచర్‌లో తమకున్న మొత్తం వాటాలను భాగస్వామి ప్రుడెన్షియల్‌ ఫైనాన్షియల్‌కు విక్రయిస్తున్నామని, డీహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రామెరికా ట్రస్టీస్ నుంచి కూడా పూర్తిగా తప్పుకుంటున్నామని పేర్కొంది. 2015లో ఫండ్ వ్యాపారంలో 50 శాతం వాటాలను డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కొనుగోలు చేసింది. ఇందులో 17.12 శాతం వాటాలు నేరుగా, 32.88 శాతం అనుబంధ సంస్థ డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ అడ్వైజరీ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ద్వారా ఉన్నాయి. మరోవైపు, డీహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రామెరికా ట్రస్టీస్‌లో కూడా 50 శాతం వాటాలున్నాయి. వాటాల విక్రయానికి సంబంధించి ప్రుడెన్షియల్ ఫైనాన్షియల్‌లో భాగమైన పీజీఎల్‌హెచ్‌ ఆఫ్ డెలావేర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. డీహెచ్‌ఎఫ్‌ఎల్ అసెట్ మేనేజర్స్ సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో రూ.129.74 కోట్ల ఆదాయం, రూ.7.76 కోట్ల లాభం ఆర్జించింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఆదాయం రూ.109.67 కోట్లు కాగా.. లాభం రూ. 7.64 కోట్లు. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ సంస్థ.. ప్రుడెన్షియల్‌ ఫైనాన్షియల్‌తో కలిసి డీహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రామెరికా లైఫ్‌ ఇన్సూరెన్స్ పేరిట జీవిత బీమా సంస్థను కూడా ఏర్పాటు చేసింది. 2016 అక్టోబర్‌లో ఈ జాయింట్ వెంచర్ సంస్థలో ప్రుడెన్షియల్ తన వాటాను 26 శాతం నుంచి 49 శాతానికి పెంచుకుంది.
దేశీయంగా నాన్‌ బ్యాంకింగ్ ఫైనాన్స్‌ సంస్థలు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు తీవ్రంగా నిధుల కొరత ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఫండ్‌ వ్యాపారం నుంచి డీహెచ్‌ఎఫ్‌ఎల్ తప్పుకోనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. సెప్టెంబర్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌) డిఫాల్ట్‌తో మొదలైన ఈ నిధుల సంక్షోభం పలు ఎన్‌బీఎఫ్‌సీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అనేక సంస్థల షేర్ల ధరలు భారీగా పతనమయ్యాయి. సెప్టెంబర్‌ ప్రారంభం నుంచి చూస్తే డీహెచ్‌ఎఫ్‌ఎల్ షేర్లు ఏకంగా 68 శాతం క్షీణించాయి. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో రూ. 213.90 వద్ద క్లోజయ్యాయి. 



You may be interested

నిఫ్టీ 50లో వీక్లీ ఆప్షన్లు

Wednesday 19th December 2018

న్యూఢిల్లీ: నిఫ్టీ-50 సూచీలో వీక్లీ ఆప్షన్లకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. దీంతో ట్రేడర్లకు తమ పోర్ట్‌ఫోలియో నష్టభయాన్ని మరింత ప్రభావవంతంగా నిర్వహించుకోవడానికి తాజాగా మరో హెడ్జింగ్‌ టూల్‌ లభించనున్నది. మరోవైపు సెన్సెక్స్‌కు సంబంధించిన వీక్లీ ఫ్యూచర్స్‌, ఆప్షన్ల కాంట్రాక్టులను ఈ నెల 21 నుంచి అందుబాటులోకి తేనున్నామని బీఎస్‌ఈ తెలిపింది.  ప్రతి గురువారం ఎక్స్‌పైరీ... నిఫ్టీ 50 సూచీ వీక్లీ ఆప్షన్లకు ట్రేడర్లు, ఇన్వెస్టర్ల స్పందన ఎలా ఉండనుందో

వడ్డీ రేటు పెంచి మరో తప్పు చేయొద్దు

Wednesday 19th December 2018

వాషింగ్టన్‌: వడ్డీ రేట్ల పెంపుపై ఫెడరల్ రిజర్వ్‌ను (ఫెడ్‌) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ హెచ్చరించారు. రేట్లను పెంచడం ద్వారా 'మరో తప్పు' చేయవద్దని స్పష్టంచేశారు. "వాల్‌స్ట్రీట్ జర్నల్ రాసిన ఎడిటోరియల్ చూసైనా వడ్డీ రేట్ల పెంపు విషయంలో ఫెడ్ పునరాలోచన చేయాలి. మరో తప్పిదం చేయకూడదు. ఇప్పటికే లిక్విడిటీ తగ్గిపోయిన మార్కెట్‌ను మరింతగా కుంగదీయొద్దు. అర్థంపర్థం లేని గణాంకాలను పట్టుకుని కూర్చోకుండా.. మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకోండి.

Most from this category