STOCKS

News


మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులపై పన్ను ఇలా...

Wednesday 31st October 2018
personal-finance_main1540924840.png-21592

మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్టర్లు పెట్టిన పెట్టుబడి వృద్ధి, డివిడెండ్‌ ఆదాయం రూపంలో లాభాలు గడిస్తుంటారు. ఈక్విటీ ఫండ్స్‌ అయితే లాభాలు వచ్చినప్పుడు సహజంగా ఏఎంసీలు డివిడెండ్‌ ప్రకటిస్తుంటాయి. అలాగే, డెట్‌ ఫండ్స్‌ అయితే వడ్డీ రూపంలోనూ ఇన్వెస్టర్లకు స్థిరమైన రాబడి ఉంటుంది. దీంతో పెట్టుబడి వృద్ధి జరుగుతుంది. మొత్తానికి భిన్న స్థాయిల్లో మూల ధన లాభం అనేది ఉంటుంది. దీనిపై ఫండ్‌ కేటగిరీని బట్టి పన్ను మారిపోతుంది. ఏ తరహా ఫండ్‌లో ఎంత కాలం పెట్టుబడి పెట్టారు, ఎంత లాభం గడించారన్నదాన్ని బట్టి పన్ను ఆధారపడి ఉంటుంది. ఏడాదిలోపు పెట్టుబడులను స్వల్పకాలం అని, అంతకుమించితే దాన్ని దీర్ఘకాలిక మూలధన లాభంగా పరిగణిస్తారు. ఇది ఈక్విటీ ఫండ్స్‌కు మాత్రమే. అదే డెట్‌ ఫండ్స్‌ అయితే మూడేళ్ల కాలాన్ని స్వల్ప కాలం అని, మూడేళ్లు దాటితే అది దీర్ఘకాలం అని పరిగణిస్తున్నారు. 

 

పన్ను రేటు ఏ ప్రకారం...

ఈక్విటీ ఫండ్స్‌ అయితే మూలధన లాభంపై 15 శాతం పన్ను చెల్లించాలి. పెట్టుబడి పెట్టి ఏడాది దాటిన తర్వాత విక్రయించగా... వచ్చిన మూలధన లాభం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష మించితేనే అప్పుడు 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రూ.లక్ష వరకు లాభం ఉంటే చెల్లించక్కర్లేదు. అదే డెట్‌ ఫండ్స్‌ అయితే పెట్టుబడి పెట్టిన మూడేళ్లలోపు విక్రయించగా వచ్చిన మూలధన లాభంపై 20 శాతం పన్ను చెల్లించాలి. ద్రవ్యోల్బణ కాస్ట్‌ను మినహాయించి వచ్చిన లాభంపై చెల్లిస్తే సరిపోతుంది. పన్ను ఉన్నప్పటికీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో దీర్ఘకాలానికి రాబడుల అవకాశాలు మెరుగ్గా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, ఇన్వెస్ట్‌ చేసే ముందు సంబంధిత పథకం గురించి పూర్తిగా అవగాహన చేసుకోవాలని పేర్కొంటున్నారు. తరచుగా కొని అమ్మకం చేయకుండా, సిప్‌ మార్గంలో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా మంచి రాబడులను అందుకోవచ్చు. ఐదేళ్లకు మించి కొనసాగించడం ద్వారా మెరుగైన రాబడులకు అవకాశాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఈక్విటీ ఫండ్స్‌పై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించడం ఇష్టం లేని వారు ఏటా రూ.లక్ష లాభాన్ని మించకుండా (విక్రయంపై) విత్‌డ్రా చేసుకోవడం మంచి ఆలోచన. 



You may be interested

దేవెన్‌ చోక్సే స్టాక్‌ సిఫారసులు

Wednesday 31st October 2018

చమురు ధరల పతనం చమురు మార్కెటింగ్‌ కంపెనీలకు మేలు చేస్తుందని కేఆర్‌ చోక్సే ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ ఎండీ దేవేన్‌ చోక్సే పేర్కొన్నారు. అయితే, ధరల విషయంలో ప్రభుత్వ జోక్యం రిటైల్‌ ఇన్వెస్టర్లకు మేలు చేసేది కాదన్నారు. పెట్టుబడి పరంగా ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్‌ కంపెనీలకు బదులు... ఈ రంగంలోనే లబ్ధి పొందే సామర్థ్యం కలిగిన రిలయన్స్‌ మంచి ఎంపిక అవుతుందని పేర్కొన్నారు. సిప్లా, బజాజ్‌ ఆటో, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌డీఎఫ్‌సీ

నిఫ్టీలో సగానికి పైగా భారీగా నష్టపోయినవే

Wednesday 31st October 2018

గత రెండు నెలల కాలంలో మన మార్కెట్లు కరెక్షన్‌ బాటలో ప్రయాణిస్తుండగా, ఈ కాలంలో ప్రధాన సూచీలు నిఫ్టీ-50, బీఎస్‌ఈలో సగానికి పైగా స్టాక్స్‌... 20 నుంచి 60 శాతం వరకు నష్టపోయాయి. నాణ్యమైన స్టాక్స్‌ సైతం ఆకర్షణీయ విలువల వద్ద లభిస్తున్నాయి. అంటే బేర్స్‌ వీటిని తమ ఆధీనంలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ‘‘ఇవి దిపావళి అమ్మకాలు. ఇన్వెస్టర్లు మంచి స్టాక్స్‌ను తప్పకుండా కొనుగోలు చేయవచ్చు. ఇండస్‌ఇండ్‌ బ్యాంకును ఈ

Most from this category