STOCKS

News


ఒకేసారి మొత్తం ఫండ్లలో పెట్టొద్దు!

Monday 24th December 2018
personal-finance_main1545626142.png-23194

‘‘మ్యూచ్‌వల్‌ ఫండ్లలో ఒకేసారి ఇన్వెస్ట్‌ చేయటం సరికాదు. ఒకవేళ అలా చేయాలనుకుంటే ఈక్విటీ ఫండ్లు కాకుండా బ్యాలెన్స్‌డ్‌ ఫండ్లు ఎంచుకోండి. అన్నిటికన్నా సిప్‌ విధానం ఉత్తమం. కాకపోతే జీతం పెరిగినపుడు సిప్‌ మొత్తాన్ని ఏ మేరకు పెంచాలనేది మీ ఆర్థిక స్థితిపై ఆధారపడి ఉంటుంది’’ అంటూ ఇన్వెస్టర్ల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు ప్రముఖ మ్యూచ్‌వల్‌ ఫండ్‌ విశ్లేషకుడు ధీరేంద్ర కుమార్‌. వారి ప్రశ్నలు, వాటికి ఆయనిచ్చిన సమాధానాలు ఇవిగో...
ప్ర: నేను మ్యూచువల్‌ ఫండ్స్‌కు కొత్త. ఇప్పటివరకూ దాచుకున్న  ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలోని మొత్తాన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. ప్రస్తుతం మార్కెట్‌ తీవ్రమైన ఒడిదుడుకుల్లో ట్రేడవుతోంది కదా ! ఈ పరిస్థితుల్లో ఎలాంటి కేటగిరీ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌  చేస్తే మంచిది ? నష్టభయం తక్కువగా ఉండాలి. మంచి రాబడులు రావాలి. ఏ  ఏ ఫండ్స్‌ల్లో  ఇన్వెస్ట్‌ చేయాలో సూచించండి. 
-స్రవంతి, విశాఖ పట్టణం
జ: స్టాక్‌  మార్కెట్‌ ఎప్పుడూ ఒడిదుడుకుల్లోనే ట్రేడవుతూ ఉంటుంది. మార్కెట్‌ పెరుగుతున్నప్పుడు మధ్యలో ఒడిదుడుకులు వచ్చినా మనకేమీ పట్టింపు ఉండదు. అలా కాకుండా మార్కెట్‌ ఒడిదుడుకుల్లో ఉండి మరింతగా పతనమవుతున్నప్పుడు మాత్రం ఆందోళన అధికంగా ఉంటుంది. మార్కెట్‌ ఇలా ఒడిదుడుకులమయంగా ఉన్నçప్పుడు, పెట్టుబడుల కోసం అసెట్‌ అలకేషన్‌ ఫండ్‌ను పరిశీలించవచ్చు. 
మీరు మొదటిసారిగా మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. అంతే కాకుండా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో మొత్తాన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి మళ్లిస్తున్నారు. కాబట్టి మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. మీ డబ్బునంతటినీ ఒకేసారి ఇన్వెస్ట్‌ చేయవద్దు. ఒకేసారి ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేశారనుకోండి. మార్కెట్‌ పడిపోతే ఈ ఇన్వెస్ట్‌మెంట్‌ విలువ కూడా పడిపోతుంది. దీంతో మీకు మార్కెట్‌పై విశ్వాసం పోతుంది. మీరు మ్యూచువల్‌ ఫండ్స్‌కు కొత్త కాబట్టి.. మొదటగా బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయండి. మీ ఇన్వెస్ట్‌మెంట్‌ విలువ మరీ పడిపోకుండా ఈ బ్యాలన్స్‌డ్‌  ఫండ్‌ తగిన రక్షణనిస్తుంది. మార్కెట్‌ పెరుగుతున్నప్పుడు అవి మంచి రాబడులనిస్తాయి. మన అంచనాలకు అనుగుణంగా ఉండనిదే స్టాక్‌ మార్కెట్‌. మనం ఏమీ అంచనాలు పెట్టుకోనప్పుడే మార్కెట్‌ పెరుగుతూ ఉంటుంది. మనం అనుకోనప్పుడే మార్కెట్‌ పడిపోతూ ఉంటుంది. మార్కెట్‌ ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంటుంది. మార్కెట్‌ ఎలా ఉన్నా, మీరు బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే, మార్కెట్‌ పెరిగినప్పుడు మంచి రాబడులు వస్తాయి. మార్కెట్‌ తగ్గినప్పుడు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు రక్షణనిస్తుంది. తక్కువ నష్టభయం, దీర్ఘకాలంలో ఇన్వెస్ట్‌ చేయాలనుకున్నప్పుడు ఈక్విటీ ఇన్‌కమ్‌ ఫండ్‌ను పరిశీలించండి. 
--
ప్ర: నేను గత కొంత కాలంగా మూడు మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో సిప్‌ (సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌)విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. ఇటీవలనే నా జీతం 30 శాతం పెరిగింది. దీంతో ఈ సిప్‌ మొత్తాలను కూడా పెంచాలనుకుంటున్నాను. ఎంత మేర పెంచితే బావుంటుంది ? 
-కుమార్‌, విజయవాడ 
జ: ఇది మీ ఆర్థిక పరిస్థితులను బట్టి ఉంటుంది.  మరో ఏడాది కాలంలో మీకు ఏదైనా పెద్ద ఖర్చు ఉందనుకోండి. ఇప్పుడు సిప్‌లను పెంచాల్సిన పని లేదు. వచ్చే ఏడాది మీ ఖర్చులు తగ్గే అవకాశాలున్నా, మరో ఇంక్రిమెంట్‌ వచ్చే అవకాశాలున్నా, సిప్‌ మొత్తాలను ఎలాంటి ఆలోచన లేకుండా పెంచుకోవచ్చు. మీకు పెరిగే జీతాన్ని బట్టి సిప్‌లను పెంచుకోవచ్చు. ఒక సాధారణ సూత్రం ఏమిటంటే...  మీ ఆదాయం ఎంత శాతం పెరుగుతుందో అంత మొత్తం సిప్‌లను పెంచుకోవచ్చు. ఉదాహరణకు మీకు ప్రస్తుతం రూ.50,000 జీతం వస్తుందనుకుందాం.  ప్రస్తుతం మీ సిప్‌ మొత్తం రూ.10,000 అనుకుందాం. మీ జీతం పది శాతం పెరిగితే, అంతే మొత్తంలో సిప్‌లను పెంచవచ్చు. అంటే మీ జీతం రూ.55,000కు చేరితే, మీరు మీ సిప్‌లను రూ.11,000 పెంచుకోవచ్చు. ఇతరత్రా ఖర్చులు ఏమీ లేకపోతే, ఈ మొత్తాన్ని 20 శాతం వరకూ కూడా పెంచుకోవచ్చు. 
---
ప్ర: నేను   క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్‌లో గతంలో భారీ మొత్తంలోనే ఇన్వెస్ట్‌ చేశాను. కానీ ఈ ఫండ్‌ పనితీరు చాలా అధ్వానంగా ఉంది. ఏడాది కాలంలో ఆరు శాతం రాబడిని కూడా ఈ ఫండ్‌ను ఇవ్వలేదు. మీ వెబ్‌సైట్లో ఈ ఫండ్‌కు వన్‌ స్టార్‌ రేటింగ్‌ మాత్రమే ఉంది. ఈ ఫండ్‌లో నేను ఇన్వెస్ట్‌ చేసి మూడేళ్లు పూర్తి కానందున, ఈ ఫండ్‌ నుంచి నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాను. ఇలా చేస్తే నేను స్వల్ప కాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది.  అందుకని మూడేళ్లు అయ్యేదాక వేచి చూడాలా ? ఇప్పుడే వైదొలగమంటారా ? నేను 30 శాతం ట్యాక్స్‌ బ్రాకెట్‌లో ఉన్నాను. 
-సుదర్శన్‌, హైదరాబాద్‌
జ: మీరు ఇన్వెస్ట్‌మెంట్స్‌ ప్రారంభించి ఎన్ని సంవత్సరాలయ్యిందో మీరు వెల్లడించలేదు. రెండేళ్లు దాటిందనుకుందాం. మరో ఏడాదిలో మూడేళ్లు పూర్తవుతాయి. కాబట్టి వేచి చూడడమే మంచిది. మీరు భారీ మొత్తమే ఇన్వెస్ట్‌ చేశారు. కాబట్టి రెండేళ్లు దాటితే ఆరు శాతం రాబడి చొప్పున మీకు పెద్ద మొత్తమే రాబడి వస్తుంది. ఉదాహరణకు మీరు ఒక కోటి రూపాయలు ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేశారనుకుందాం. ఏడాదికి ఆరు శాతం చొప్పున రెండేళ్లలో మీకు రూ.12 లక్షల వరకూ రాబడి వస్తుంది. మీరు 30 శాతం ట్యాక్స్‌ బ్రాకెట్‌లో ఉన్నారు. కాబట్టి రూ.3.6 లక్షలు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అందుకని మీరు ఇన్వెస్ట్‌ చేసి రెండేళ్లు దాటి మూడు సంవత్సరాలకు  దగ్గరలో ఉంటే ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి. 



You may be interested

పెన్షన్‌ కోసం... మీ ‘ప్లాన్‌’ ఏంటి?

Monday 24th December 2018

ఒకప్పటి పరిస్థితి ఇప్పుడు లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పెన్షన్‌ లేక ఎన్‌పీఎస్‌లో (జాతీయ పెన్షన్‌ విధానం) చేరి... దాన్నుంచి పెన్షన్‌ అందుకునే పరిస్థితి ఉంది. ఇక ప్రయివేటు ఉద్యోగులో..? ఏదో కొద్ది మందికి ఆయా సంస్థలు సొంత ట్రస్టుల్ని పెట్టుకుని పెన్షన్‌ ఇస్తున్నాయి తప్ప 90 శాతానికిపైగా ఇలాంటి సౌకర్యం లేనివారే. ఇక స్వయం ఉపాధి పొందుతున్న వారి గురించి చెప్పనే అక్కర్లేదు. మరి వీళ్లందరికీ రిటైరయ్యాక కూడా

ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు ప్రముఖ నేతలు

Monday 24th December 2018

న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సు వార్షిక సమావేశాలు వచ్చే నెల 21 నుంచి 25వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ పట్టణంలో జరగనున్నాయి. దీనికి మన దేశం నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతోపాటు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కంపెనీల సీఈవోలు పాల్గొననున్నారు. మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల, ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్‌ కిమ్‌ సహా ఆరుగురు సంయుక్తంగా అధ్యక్షత వహంచనున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సైతం పాల్గొనవచ్చని అంచనా

Most from this category