STOCKS

News


ఈక్విటీల్లో స్థిరమైన రాబడుల కోసం

Monday 3rd September 2018
personal-finance_main1535951459.png-19897

  •  ఫ్రాంక్లిన్‌ ఇండియా ప్రైమా ఫండ్‌

మిడ్‌క్యాప్‌ విభాగంలో మంచి రాబడులు ఆశిస్తూ అదే సమయంలో పెట్టుబడులకు భద్రత ఉండాలని భావించే వారు తప్పక పరిశీలించాల్సిన పథకాల్లో ఫ్రాంక్లిన్‌ ఇండియా ప్రైమా ఫండ్‌ కూడా ఒకటి. కనీసం ఐదేళ్లు ఆ పై వ్యవధి కోసం పెట్టుబడులు పెట్టేవారు ఎంపిక చేసుకునేందుకు మంచి పేరున్న పథకాల్లో ఇదీ కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ పథకం ప్రారంభమై 25 ఏళ్లు  అయింది. అప్పటి నుంచి చూసుకుంటే రాబడుల్లో మేటిగానే కొనసాగుతోంది. 

రాబడులు 
ఈ పథకం ప్రారంభమైన దగ్గర్నుంచీ సగటున ప్రతీ ఏటా 20 శాతం రాబడులను ఇచ్చిందంటే దీని పనితీరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పథకం రాబడులకు ప్రామాణిక సూచీ నిఫ్టీ 500. మూడేళ్ల కాలంలో ఈ పథకంలో రాబడులు సగటున ఏటా 11.4 శాతంగా ఉన్నాయి. బెంచ్‌ మార్క్‌ నిఫ్టీ 500 రాబడులు ఈ కాలంలో ఏటా 9.3 శాతమే. ఐదేళ్ల కాలంలో ఏటా సగటున ఫ్రాంక్లిన్‌ ఇండియా ప్రైమా ఫండ్‌ 24.1 శాతం రాబడులను ఇవ్వగా, బెంచ్‌ మార్క్‌ రాబడులు 14.9 శాతంగానే ఉన్నాయి. ఇక పదేళ్ల కాలంలో చూసుకున్నా ఈ పథకమే అగ్ర స్థాయిలో ఉంది. ఏటా సగటున 18.1 శాతం రాబడులను ఇవ్వగా... ఇదే కాలంలో బెంచ్‌మార్క్‌ నిఫ్టీ 500 రాబడులు ఏటా సగటున 10.6 శాతం కావడం గమనార్హం. భిన్న రంగాలు, ఆయా రంగాల్లో భిన్న స్టాక్స్‌ మధ్య పెట్టుబడులను వర్గీకరించడం ద్వారా రిస్క్‌ను తగ్గించడం ఈ పథకం నిర్వహణ పనితీరులో భాగం. ఇక లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ను యాడ్‌ చేయడం ద్వారా రిస్క్‌ తగ్గించే ప్రయత్నం కూడా జరుగుతుంది. కానీ, లార్జ్‌క్యాప్‌లో పెట్టుబడులను 15 శాతంలోపునకే పరిమితం చేస్తుంది. ఈ విధమైన వ్యూహాత్మక విధానాలతోనే మిడ్‌ క్యాప్‌ విభాగంలో రాబడులు, భద్రతా పరంగా ఈ పథకం మెరుగైన స్థాయిలో ఉంది. ఈ విభాగంలో నంబర్‌ 1 కాకపోయినప్పటికీ... కేటగిరీతో పోలిస్తే సగటు కంటే ఎక్కువే రాబడులను ఇస్తూ ముందుండడం గమనించాలి. గడిచిన పదేళ్ల కాలంలో ఎస్‌బీఐ మ్యాగ్నం మిడ్‌క్యాప్‌ ఫండ్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మిడ్‌క్యాప్‌, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ మిడ్‌క్యాప్‌ పథకాల కంటే పనితీరులో మెరుగ్గా ఉంది. 

పోర్ట్‌ఫోలియో, స్ట్రాటజీ
స్టాక్స్‌ ఎంపికలోనూ ఫండ్‌ మేనేజర్లు జాగ్రత్తలు పాటిస్తుంటారు. విడిగా ఒక్కో స్టాక్‌లో పెట్టుబడులు 3-4 శాతం మించనీయరు. ఎంత ఉత్తమమైన కంపెనీ అయినా సరే 4 శాతం దాటకపోవడం గమనించాలి. అంటే రిస్క్‌, రాబడుల కోణంలోనే ఈ నియమాన్ని అమలు చేస్తున్నట్టు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పోర్ట్‌ఫోలియోలో మొత్తం స్టాక్స్‌ 50 నుంచి 60 వరకు ఉంటాయి. మార్కెట్లు ర్యాలీ సమయాల్లో రాబడులను అందించే విషయంలో మంచి స్థితిలో ఉండడం, అదే సమయంలో మార్కెట్‌ కరెక్షన్లలో నష్టాలు పరిమితంగా ఉండడం ఈ పథకంలో గమనించొచ్చు. మార్కెట్ల అస్థిరత సమయాల్లో 7-9 శాతం వరకు నగదు నిల్వలను కొనసాగిస్తుంది. ఎక్కువగా బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ స్టాక్స్‌లో పెట్టుబడులను కలిగి ఉంది. గత ఏడాది కాలంలో ఆటో యాన్సిలరీ, ఇండస్ట్రియల్‌ ప్రొడక్ట్స్‌ రంగాల్లో ఎక్స్‌పోజర్‌ను పెంచుకుంది. ఆర్థిక వ్యవస్థ అధిక వృద్ధి దిశగా సాగిపోతే ఈ రంగాలు ఎక్కువగా లబ్ధి పొందుతాయి. కన్జ్యూమర్‌ నాన్‌ డ్యూరబుల్స్‌లోనూ గత కొన్నేళ్లుగా పెట్టుబడులను పెంచుకుంటూ వస్తోంది. ఇక గత ఏడాది కాలంలో ఐటీ స్టాక్స్‌లో ఎక్స్‌పోజర్‌ను తగ్గించుకుంది. దీంతో ఈ కాలంలో ఐటీ స్టాక్స్‌ ర్యాలీ చేయడంతో ఆ అవకాశం కోల్పోయింది. 
 టాప్‌ హోల్డింగ్స్‌
కంపెనీ పేరు    పెట్టుబడుల శాతం
ఫినోలెక్స్‌ కేబుల్స్‌    3.81
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు    3.26
కోటక్‌ బ్యాంకు    2.86
యస్‌ బ్యాంకు    2.57
సిటీ యూనియన్‌ బ్యాంకు    2.57
అపోలో టైర్స్‌    2.56
వోల్టాస్‌    2.46
ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌        2.41
వాబ్కో ఇండియా    2.37
కన్సాయ్‌ నెరోలాక్‌    2.34



You may be interested

ఇండిపెండెంట్‌ డైరెక్టర్ల ఎంపికకు పరీక్ష

Monday 3rd September 2018

న్యూఢిల్లీ: కార్పొరేట్‌ పరిపాలనను మరింత బలోపేతం చేసేందుకు కంపెనీలకు స్వతంత్ర డైరెక్టర్లు కాదలిచిన వారికి ఎంపిక పరీక్షలు నిర్వహించే ఆలోచన చేస్తున్నట్టు కేంద్ర కార్పొరేట్‌ శాఖ మంత్రి పీపీ చౌదరి తెలిపారు. నిజానికి కంపెనీల చట్టం 2013లో ఉత్తమ పరిపాలనకు గాను కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ, ఇటీవలి కాలంలో కార్పొరేట్‌ అవకతవకల నేపథ్యంలో ఇండిపెండెంట్‌ డైరెక్టర్ల పాత్ర ప్రశ్నార్థకంగా మారింది. ఇక కార్పొరేట్‌ వ్యవహారాల్లో ప్రభుత్వం తన పాత్రను పరిమితం

సోమవారం వార్తల్లోని షేర్లు..!

Monday 3rd September 2018

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు హెచ్‌సీసీ:- సెప్టెంబర్‌ 5న జరిగే బోర్డు సమావేశంలో ఈక్విటీ షేర్ల జారీ, ఇతర సెక్యూరిటీల జారీ ద్వారా నిధుల సమీకరణ అంశంపై సెప్టెంబర్‌ 5న జరిగే బోర్డు సమావేశంలో చర్చించనుంది. ఎల్‌ అండ్‌ టీ:- ఆఫర్‌ ఫర్‌ సేల్‌ పద్ధతిలో నేడు రేపు(సెప్టెంబర్‌3, 4తేదీల్లో) ఫ్లోర్‌ షేరు ధర రూ.1,700ల వద్ద 59లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. క్వాలీటీ:- విదేశీ సంస్థాగత పెట్టుబడి కంపెనీల

Most from this category