News


దీర్ఘకాలంలో బంపర్‌ రాబడులు!

Monday 18th February 2019
personal-finance_main1550474160.png-24244

  • ఎల్‌అండ్‌టీ మిడ్‌క్యాప్‌ ఫండ్‌

దీర్ఘకాలంలో అద్భుతమైన రాబడులతో ఎల్‌అండ్‌టీ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ ఈ విభాగంలోనే మేటి పథకంగా ఉంది. దీర్ఘకాలానికి తక్కువ రిస్క్‌, అధిక రాబడులు ఆశించే వారు ఈ పథకంలో పెట్టుబడులను పరిశీలించొచ్చు. దీర్ఘకాలంలో మంచి పనితీరును చూపడమే కాకుండా మార్కెట్‌ కరెక్షన్లలో నష్టాలను పరిమితం చేయడాన్ని ఈ పథకంలో గమనించొచ్చు. పోర్ట్‌ఫోలియో నిర్మాణంలో రిస్క్‌ను తగ్గించే చర్యలను ఈ పథకం అనుసరిస్తోంది. 

రాబడులు
ఈ పథకంలో దీర్ఘకాలిక రాబడులు చాలా మెరుగ్గా ఉన్నాయనే చెప్పుకోవాలి. గత ఏడాది రాబడులను మినహాయిస్తే మూడేళ్లు, ఐదేళ్లు, పదేళ్ల కాలంలో మంచి ప్రతిఫలాన్ని ఇన్వెస్టర్లకు ఇచ్చింది. మూడేళ్లలో వార్షికంగా 16.68 శాతం, ఐదేళ్లలో వార్షికంగా 23.18 శాతం, పదేళ్ల కాలంలో వార్షికంగా 22.91 శాతం రాబడులను ఇచ్చింది. ఇదే కాలంలో మిడ్‌క్యాప్‌ విభాగం సగటు రాబడులు మూడేళ్లలో 13 శాతం, ఐదేళ్లలో 19 శాతం, పదేళ్ల కాలంలో 21 శాతంగా ఉండడం గమనార్హం. ఏడాది కాలంలో ఎల్‌అండ్‌టీ మిడ్‌క్యాప్‌ పథకం 15 శాతం ప్రతికూల రాబడులను (నష్టాలు) ఇవ్వడం గమనించాలి. కాకపోతే ఇదే కాలంలో మిడ్‌క్యాప్‌ విభాగం సైతం 13 శాతానికి పైగా నష్టపోయింది. ముఖ్యంగా ఈ పథకం 2004లో ప్రారంభం కాగా, అప్పటి నుంచి వార్షికంగా 18.83 శాతం రాబడులను ఇచ్చినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. తన మెరుగైన పనితీరుతో ఈ విభాగంలోని ఇతర అగ్ర పథకాల కంటే ముందుండడం గమనార్హం. 

పెట్టుబడులు
ఈ పథకం పేరుకు తగినట్టే 80 శాతం వరకు మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేసింది. లార్జ్‌క్యాప్‌లో 9 శాతం, స్మాల్‌ క్యాప్‌లో 10 శాతం పైగా పెట్టుబడులను కలిగి ఉంది. విడిగా ఒక్కో కంపెనీలో భారీగా ఇన్వెస్ట్‌ చేయకుండా, పరిమితి మేరకు వ్యవహరించడాన్ని గమనించొచ్చు. రెండు స్టాక్స్‌లోనే మూడు శాతానికి పైగా పెట్టుబడులను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ పథకం పెట్టుబడులు 79 స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసి ఉన్నాయి. ఒకే కంపెనీలో అధికంగా ఇన్వెస్ట్‌ చేయడం వల్ల రిస్క్‌ ఎక్కువగా తీసుకోకూడదనే విధానాన్ని పాటిస్తోంది. ఈ తరహా విధానం వల్ల మార్కెట్‌ కరెక్షన్లలో నష్టాలను పరిమితం చేయడం, అదే సమయంలో ర్యాలీల్లో రాబడులను రాబట్టుకునే విధంగా వ్యవహరిస్తుంది. మోస్తరు రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోలో ఈ పథకాన్ని చేర్చుకోవడాన్ని పరిశీలించొచ్చు. ఫైనాన్షియల్‌ సేవల రంగానికి ఈ పథకం ఎక్కువగా ‍ప్రాధాన్యం ఇచ్చింది. సుమారు 28 శాతం పెట్టుబడులు ఈ రంగానికి చెందిన స్టాక్స్‌లోనే ఉన్నాయి. తర్వాత కన్‌స్ట్రక్షన్‌, ఇంజనీరింగ్‌, హెల్త్‌కేర్‌ రంగాలకు ఇంచుమించుగా ఒకే స్థాయిలో కేటాయింపులు చేసింది.You may be interested

ఎఫ్‌ఎమ్‌జీసీ షేర్లలో అమ్మకాలు

Monday 18th February 2019

మార్కెట్‌ నష్టాల్లో భాగంగా ఎఫ్‌ఎంజీసీ(ఫాస్ట్‌-మూవింగ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌) షేర్లు ఎక్కువగా అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎఫ్‌ఎంజీసీ ఇండెక్స్‌ అత్యధికంగా 1.50శాతం పతనమైంది. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన ఐటీసీ, హిందూస్థాన్‌ యూనిలివర్‌ 1.50శాతం పతనం ఇం‍డెక్స్‌ నష్టపోవడానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. మధ్యాహ్నం గం.1:45ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(29,309.10)తో పోలిస్తే 1.00శాతం క్షీణించి 29,002 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి

నష్టాలు వచ్చాయా...? పన్ను ఆదా చేసుకోవచ్చు

Monday 18th February 2019

నష్టాలు వచ్చాయా...? పన్ను ఆదా చేసుకోవచ్చు... నష్టాల్లో ఎన్నో రకాలు ఇల్లు, వృత్తి లేదా వ్యాపారం, ఆదాయం, స్పెక్యులేషన్‌ ముందుగా ఆయా విభాగంలోనే సర్దుబాటు ఆ తర్వాత మిగిలిన విభాగాల్లో నష్టాలు ఇంకా మిగిలితే తర్వాతి సంవత్సరాలకు బదిలీ సకాలంలో రిటర్నులు వేయడం తప్పనిసరి ఆర్థిక సంవత్సరం చివర్లో ఆదాయపన్ను ఆదా కోసం వివిధ పెట్టుబడి సాధనాల గురించి అన్వేషించడం ఎక్కువ మంది చేసే పని. అయితే, పన్ను ఆదాకు ఇదొక్కటే మార్గం కాదు. పరిశీలిస్తే ప్రత్యామ్నయాలూ కనిపిస్తాయి. కనుక

Most from this category