STOCKS

News


‘పోర్ట్‌ఫోలియో రెడీ చేసుకుని రైడ్‌ చేయడమే’

Saturday 27th October 2018
personal-finance_main1540578775.png-21503

ప్రస్తుత అనిశ్చిత పరిస్థితులు ఇన్వెస్టర్లకు అనుకూలమని, దీన్ని అవకాశంగా తీసుకుని ఇన్వెస్ట్‌మెంట్‌పై దృష్టి సారించాలని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజీవ్‌ భాసిన్‌ సూచించారు. శుక్రవారం మార్కెట్‌ పతనం నేపథ్యంలో ఇన్వెస్టర్లకు ఏం సూచిస్తారన్న ప్రశ్నకు... ‘‘గత రెండేళ్లలోనే నిరాశావాదం చాలా ఎక్కువగా ఉంది. చాలా రంగాల స్టాక్స్‌ బేర్‌ మార్కెట్లోకి ప్రవేశించాయి. మంచి ధరల అవకాశాలు అనేవి ఉండవు. మూడు స్థూల ఆర్థిక అంశాలు మనకు అనుకూలంగా మారాయి. చమురు ధర 10 డాలర్లు తగ్గింది. కానీ తేలిగ్గానే తీసుకున్నాం. ఎస్సార్‌ స్టీల్‌ విషయంలో ఆర్సెలర్‌ మిట్టల్‌, దీనికి పోటీగా రుయాల ఆఫర్‌... వెరసి ఎన్‌సీఎల్‌టీ, ఐబీసీ బ్యాంకులు మాఫీ చేసిన రుణాల విషయంలో సానుకూల ఫలితాలనిస్తున్నాయి. ఇక మూడో అంశం... నిరాశావాదం చాలా అధిక స్థాయిల్లో ఉంది. 100, 200 పాయింట్లు తగ్గడం అన్నది ఇక్కడ ప్రధానం కాదు. స్టాక్స్‌ అనుకూలంగా ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోను నిర్మించుకోవడమే. సిప్‌ రూపంలో ఇన్వెస్ట్‌ చేస్తుంటే వచ్చే 16 వారాల పాటు ఆ మొత్తాన్ని పెంచుకోవాలి. నవంబర్‌లో 400-500 పాయింట్లు పెరిగేందుకు అవకాశం ఉంది’’ అని సంజీవ్‌ భాసిన్‌ వివరించారు. 

2019 దీపావళికి నిఫ్టీ 14,000
డిసెంబర్‌ 12న వెలువడే రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, వచ్చే ఏడాది ఏప్రిల్‌-మేలో జరిగే సాధారణ ఎన్నికలు మన మార్కెట్లకు కీలకమైనవిగా భాసిన్‌ పేర్కొన్నారు. వీటి కంటే ముందు ఇరాన్‌పై ఆంక్షలు, అమెరికాలో మధ్యంతర ఎన్నికలు కూడా ఉన్నాయన్నారు. ఇరాన్‌పై ఆంక్షలకు సమయం దగ్గరపడుతుంటే చమురు ధర కిందకు దిగి వస్తోందన్నారు. డాలర్‌ తప్పకుండా ఈ స్థాయి నుంచి తేలికపడుతుందని, ఇది వర్ధమాన మార్కెట్లను స్వీట్‌స్పాట్‌గా అభివర్ణించారు. ఎన్నికల అనిశ్చితి కూడా కొద్ది రోజుల పాటే ఉంటుందని పేర్కొన్నారు. నగదును సమకూర్చుకుని, వచ్చే తొమ్మిది నెలల్లో పోర్ట్‌ఫోలియోను రెడీ చేసుకోవాలని సూచించారు. 2019 దీపావళికి నిఫ్టీ 14,000 స్థాయికి వెళుతుందని అంచనా వేశారు. మనీ మార్కెట్లో ఉన్న సమస్యలు స్వల్ప కాలమేనని భాసిన్‌ చెప్పారు. 30-70 రోజులకు మించి ఉండవని, ఇప్పటికే 45 రోజులు గడిచాయని కూడా పేర్కొన్నారు. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సమస్య పరిష్కారంలో ఉందన్నారు. You may be interested

ఐఐఎఫ్‌ఎల్‌ దివాళీ స్టాక్‌ రెకమండేషన్లు ఇవే...

Saturday 27th October 2018

ప్రముఖ బ్రోకరేజీ సంస్థ ఐఐఎఫ్‌ఎల్‌ దీపావళి సందర్భంగా స్టాక్‌ సిఫారసులను వెల్లడించింది. ఆర్తి ఇండస్ట్రీస్‌, మైండ్‌ట్రీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎంఫసిస్‌ తదితర షేర్లు జాబితాలో ఉన్నాయి. ఆర్తి ఇండస్ట్రీస్‌ టార్గెట్‌ రూ.1,517. 2017-18 ఆదాయంలో 48 శాతం ఎగుమతుల నుంచే వచ్చింది. వచ్చే రెండేళ్ల పాటు ఏటా 12-15 శాతం వృద్ధికి అవకాశాలున్నాయి. కంపెనీ రూ.14,000 కోట్ల విలువైన 10 ఏళ్లు, 20 ఏళ్ల కాలవ్యవధికి రెండు కాంట్రాక్టులను సొంతం చేసుకుంది. దీంతో

రిటైల్‌ ఇన్వెస్టర్లు పనితీరులో ‘ఫండ్స్‌’ వెనుకే!

Friday 26th October 2018

స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌, ఈఎల్‌ఎస్‌ఎస్‌, మల్టీక్యాప్‌ ఫండ్స్‌ ఎన్‌ఏవీలు గత ఏడాది కాలంలో 3-10 శాతం మధ్యలో పతనం అయ్యాయి. దీంతో మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులను మానేసి, సొంతంగానే స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకుంటే పోదూ... అన్న ఆలోచన కొందరు ఇన్వెస్టర్లలో సహజంగానే వచ్చింది. దీనిపై హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ ఈడీ, సీఐవో ప్రశాంత్‌ జైన్‌ స్పందిస్తూ... స్వల్ప కాల అవాంతరాలన్నవి దీర్ఘకాల లక్ష్యాల విషయంలో ఇన్వెస్టర్లను పక్కదోవ పట్టించకూడదన్నారు. ‘‘వ్యవస్థాగతేతర రిస్క్‌లను

Most from this category