STOCKS

News


బోవోఐ ఆక్సా క్రెడిట్‌రిస్క్‌ ఫండ్‌ రూ.100 కోట్ల మాఫీ

Tuesday 9th October 2018
personal-finance_main1539023695.png-20938

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ డిఫాల్ట్‌ దెబ్బకు బీవోఐ ఆక్సా క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్‌ రూ.100 కోట్లను నష్టపోయింది. అంటే, ఈ ఫండ్‌ ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ కమర్షియల్‌ పేపర్లలో గతంలో పెట్టుబడులు పెట్టింది. ఇందులో రూ.105 కోట్ల మేర ఈ అక్టోబర్‌ 29న గడువు తీరిపోనున్నాయి. ఈ మొత్తాన్ని తన పుస్తకాల్లో రైటాఫ్‌ (రద్దు) చేసింది. దీంతో ఈ ఫండ్‌ ఎన్‌ఏవీ అక్టోబర్‌ 5న 5.17 శాతం తగ్గిపోయింది. ‘‘ఏవైనా ఉపసంహరణలు ఎదురైతే అవి ప్రస్తుత ఇన్వెస్టర్లపై ప్రభావం చూపిస్తాయి. దీంతో మిగిలిన మొత్తాన్ని రైటాఫ్‌ చేయడం సరైన నిర్ణయమని భావించాం’’ అని బీవోఐ ఆక్సా మ్యూచువల్‌ ఫండ్‌ సీఈవో సందీప్‌దాస్‌గుప్తా తెలిపారు. ఇక అక్టోబర్‌ 8 నుంచి 31వ తేదీ వరకు ఈ పథకంలోకి తాజా పెట్టుబడులను (ఏ రూపంలో అయినా) నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. 

 

‘‘ప్రభుత్వ జోక్యం నేపథ్యంలో ఐఎల్‌ఎఫ్‌ఎస్‌లో మా పెట్టుబడులను తర్వాతి కాలంలో వసూలు చేసుకోగలమని అంచనా వేస్తున్నాం. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ కమర్షియల్‌ పేపర్లలో మా పెట్టుబడులు అక్టోబర్‌ 29వ తేదీన గడువు తీరిపోతున్నాయి. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ పునరుద్ధరణ ప్రణాళికను ఆ తర్వాతే ప్రకటించనున్నారు. కనుక గడువు తేదీన మా పెట్టుబడులు రాకపోయేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి’’ అని బీవోఐ ఆక్సా మ్యూచువల్‌ ఫండ్‌ తెలిపింది. బీవోఐ ఆక్సా క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేసిన వారు ప్రస్తుతం కొంత నష్టపోయినప్పటికీ, ఐఎల్‌ఎఫ్‌ఎస్‌లో పెట్టుబడులు తర్వాత రికవరీ అయితే, అప్పటి వరకు వారు ఈ ఫండ్‌లో కొనసాగితే ఆ మేర ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌లో పెట్టుబడులను రైటాఫ్‌ చేసిన మొదటి సంస్థ ఇదే కావడం గమనార్హం. 
 



You may be interested

స్వల్ప లాభాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ..

Tuesday 9th October 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో మంగళవారం స్వల్ప లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 3 పాయింట్ల లాభంతో 10,370 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ సోమవారం ముగింపు స్థాయి 10,379 పాయింట్లతో పోలిస్తే 9 పాయింట్లు నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిప్టీ మంగళవారం ఫ్లాట్‌గా లేదా నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.  మిశ్రమంగా ఆసియా మార్కెట్లు.. ఆసియా ప్రధాన సూచీలన్నీ మంగళవారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.

మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి రూ.2.3 లక్షల కోట్లు అవుట్‌

Tuesday 9th October 2018

సెప్టెంబర్‌ నెలలో దేశీయ మ్యూచువల్‌ ఫండ్స్‌కు పెద్ద ఎత్తున ఉపసంహరణలు ఎదురయ్యాయి. సుమారు రూ.2.3 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోగా, ఇందులో లిక్విడ్‌ ఫండ్స్‌ నుంచే రూ.2.11 లక్షల కోట్లు ఉండడం గమనార్హం. ఇన్‌కమ్‌ స్కీమ్స్‌ నుంచి రూ.32,504 కోట్లు, గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నుంచి రూ.33 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. దీంతో 41 మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తుల విలువ సెప్టెంబర్‌ చివరి నాటికి

Most from this category